కోట్లు కుమ్మరించినా ఫలితం లేదు : no result for invest crores
కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే (crores of income) లీగ్ గా ప్రసిద్ధి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటు ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలకు కూడా వందల కోట్ల లాభాలను ఆర్జించి పెడుతుంది. అయితే కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసిన కొందరు ఆటగాళ్లు మాత్రం ఆ ధరకు తగ్గ న్యాయం చేయడం లేదని అటు ఫ్రాంచైజీలతో (franchises) పాటుగా ఇటు అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.
కోట్లు కుమ్మరించినా ఫలితం లేదు : no result for invest crores
కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే (crores of income) లీగ్ గా ప్రసిద్ధి చెందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆటు ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలకు కూడా వందల కోట్ల లాభాలను ఆర్జించి పెడుతుంది. అయితే కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసిన కొందరు ఆటగాళ్లు మాత్రం ఆ ధరకు తగ్గ న్యాయం చేయడం లేదని అటు ఫ్రాంచైజీలతో (franchises) పాటుగా ఇటు అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందుగానే జరిగే వేలంలో ఈ ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఐపీఎల్ 16 వ సీజన్ (IPL 16th season) ప్రారంభమై మూడు రోజులయింది. తమ తొలి మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) ఓటముల పాలయ్యాయి. ఆయా జట్లు భారీగా ఆశలు పెట్టుకుని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు (foreign players failed). ఈ ఐపీఎల్ (IPL) 16 వ సీజన్లో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్ల వివరాలు, వాళ్ళ ప్రదర్శన ఒకసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్ 16 వ సీజన్ ఖరీదైన ఆటగాళ్లు : Expensive players in IPL 16th season
సామ్ కర్రాన్, పంజాబ్ కింగ్స్) : Sam Curran (PBKS)
పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు సామ్ కర్రాన్ (Sam Curran) ను రూ. 18.5 కోట్లు (18.5 cores) పెట్టి దక్కించుకుంది. ఆల్ రౌండర్ (All-rounder) కావడం, ఇటీవల జరిగిన సిరీసుల్లో అదరగొట్టడంతో అత్యధిక ధర చెల్లించి పంజాబ్ జట్టు దక్కించుకుంది. అయితే సామ్ ఆడిన మొదటి మ్యాచ్ లో 17 బంతుల్లో 26 పరుగులు (26 runs of 17 balls) చేసాడు. బౌలింగ్ లో మూడు ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు (3-0-38-1). ఇన్ని కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే సామ్ ప్రదర్శన జట్టు యాజమాన్యానికి ఆందోళన (management worried) కలిగిస్తోంది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయాన్నందుకుంది.
కామెరాన్ గ్రీన్, ముంబై ఇండియన్స్ : Cameron Green (MI)
5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ (5 times IPL champion) ముంబై ఇండియన్స్ (MI) జట్టు ఏకంగా రూ.17 కోట్లు (17 crores) వెచ్చించి కామెరాన్ గ్రీన్ ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ ఆల్ రౌండర్ (Cameron All-rounder) గా ప్రఖ్యాతి చెందాడు. అయితే ఐపీఎల్ 16 వ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు (5 runs of 4 balls) మాత్రమే చేసాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు (2-0-30-1). ఈ మ్యాచ్లో ముంబై జట్టు ఓటమి (Mumbai Indians lost match) పాలైంది.
బెన్ స్టోక్స్, చెన్నై సూపర్ కింగ్స్ : Ben Stokes (CSK)
ఎక్కువగా వెటరన్ ప్లేయర్లతో (Veteran players) నిండిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ ఇంగ్లండ్ కి చెందిన ఆల్ రౌండర్ (England All-rounder) బెన్ స్టోక్స్ (Ben Stokes) ను రూ.16.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ఫిట్నెస్ సమస్యలతో (fitness problem) బాధ పడుతుండడంతో ఐపీఎల్ 16 వ సీజన్లో బౌలింగ్కు పూర్తిగా దూరమయ్యాడు (completely away from blowling). తొలి మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఓటమి చెందింది.
నికోలస్ పూరన్, లక్నో : Nicholas Pooran (LSG)
వెస్టిండీస్ కి చెందిన పూరన్ వికెట్ కీపింగ్ (West indies wicket keeper) తో పాటు విధ్వంసకర బ్యాటర్ గా ప్రసిద్ధిగాంచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంచైజీ రూ. 16 కోట్లు (16 crores) వెచ్చించి పూరన్ ను దక్కించుకుంది. మొదటి మ్యాచ్లో 21 బంతులను ఎదుర్కొన్న పూరన్ 36 పరుగులు (36 of 21 balls) చేసి ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు విజయాన్నందుకుంది.
హ్యారీ బ్రూక్, హైదరాబాద్ : Harry Brook (SRH)
ఇక, ఇంగ్లండ్కు (England) చెందిన మరో ఆటగాడు హ్యారీ బ్రూక్ (Harry Brook) ను సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఏకంగా రూ. 13.25 కోట్ల రూపాయలు వెచ్చించి చేజిక్కించుకుంది. అయితే ఆదివారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో బ్రూక్ కేవలం 13 పరుగులు (13 runs only) మాత్రమే చేసి నిరాశపరిచాడు.
అయితే ఐపీఎల్ సీజన్ (IPL season) ప్రారంభమైన తరువాత ఒక్కో మ్యాచ్లో (played 1st matches) మాత్రమే వీరంతా ఆడారు. ఇంకా చాలా మ్యాచ్లు (more matches) ఆడాల్సి ఉండడంతో ఆయా మ్యాచ్ల్లో వీళ్ళు తమ అసలైన ఆట తీరును ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవని క్రీడా పండితులు (sports scholars) విశ్లేషిస్తున్నారు. వీరిని కొనుగోలు చేసిన ఆయా ఫ్రాంచైజీలు సైతం ఇదే విశ్వసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమను కోట్లు వెచ్చించి (crores of rupees invested) కొనుగోలు చేసినందుకు దానికి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఆయా ఆటగాళ్లపై ఎంతైనా ఉందని చెప్పవచ్చు.