31 న ఐపీఎల్ మొదటి మ్యాచ్ : First match of IPL on 31st

పాల్గొన్న మొదటి సీజన్లోనే టైటిల్ (1st title) సాధించి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఒక వైపు... నాలుగు సార్లు విజేతగా, 5 సార్లు రన్నర్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఒక వైపు. ఒకవైపు హార్దిక్ పాండ్యా (Pandya) యువ సారథ్యం, మరోవైపు అపార అనుభవం ఉన్న ఎమ్మెస్ ధోని (MS Dhoni) సారథ్యం.

31 న ఐపీఎల్ మొదటి మ్యాచ్ : First match of IPL on 31st

31 ఐపీఎల్ మొదటి మ్యాచ్ : First match of IPL on 31st

పాల్గొన్న మొదటి సీజన్లోనే టైటిల్ (1st title) సాధించి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు ఒక వైపు... నాలుగు సార్లు విజేతగా, 5 సార్లు రన్నర్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఒక వైపు. ఒకవైపు హార్దిక్ పాండ్యా (Pandya) యువ సారథ్యం, మరోవైపు అపార అనుభవం ఉన్న ఎమ్మెస్ ధోని (MS Dhoni) సారథ్యం.

గుజరాత్ సంచలనం : Gujarat created sensation

ఏమాత్రం అంచనాలు లేకుండా తాము పాల్గొన్న మొదటి సీజన్లో (2022,15th IPL season) అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు కనీసం ప్లే-ఆఫ్స్ (Play-offs) అయినా చేరుతుందా లేదా అని అందరికీ సందేహాలు కలిగాయి. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఆరంగ్రేటం చేసిన సీజన్లోనే టైటిల్ గెలిచింది. జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రాల (Coach Ashish Nehra) వ్యూహాలతో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 16 ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. సీజన్లో తమ మొదటి మ్యాచ్ ను నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో తలపడనుంది. సీజన్ ను కూడా గత ఏడాది లాగా టైటిల్ నెగ్గి ముగించాలని యువ ఆటగాళ్లతో (young players) బరిలోకి దిగుతోంది. సీజన్ కోసం టైటాన్స్ జట్టు మినీ వేలంలో (Mini auction) శివమ్ మావి (Shivam Mavi), కెఎస్ భరత్ (KS Bharat), కేన్ విలియమ్సన్ (Ken Williamson), జోష్ లిటిల్‌ (Josh Little) వంటి యువ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

టైటాన్స్ కు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ : Strong batting line-up for Titans

గుజరాత్ జట్టులో విధ్వంసకర బ్యాటింగ్ (Destructive batting) చేసేవారు ఎంతో మంది ఉన్నారు. దీంతో జట్టు బ్యాటింగ్ లైనప్ (batting lineup) పటిష్టంగా ఉంది. శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్ తో టాప్ ఆర్డర్ పటిష్టంగా (Strong Top order) ఉంది. రాహుల్ తెవాటియా, మిల్లర్, హార్దిక్ పాండ్యా ఫినిషర్స్ గా ఎప్పటిలానే సేవలు అందించనున్నారు. ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ (Rashid Khan) కూడా అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ రాణించగల సమర్ధుడు. రషీద్ బౌలింగ్ తన స్పిన్ బౌలింగ్ విషయంలో కీలకం కానున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ లో మహ్మద్ షమీకి (Mohammad Shami) తోడుగా శివమ్ మావి, జోష్ లిటిల్ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI : GT playing XI

వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్.

ధోనీ అనుభవం పనిచేస్తుందా : Does Dhoni experience work?

మార్చి 31 తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో (first match) డిఫెండింగ్ ఛాంపియన్స్ (defending champions) గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్తలపడనుంది. రెండు జట్లు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అపారమైన అనుభవం ఉన్న ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్(CSK captain) గా ఉండడమే కాకుండా జట్టును ముందుండి నడిపించగలడు. ధోని సారథ్యంలోనే చెన్నై జట్టు 4 ఐపీఎల్ టైటిల్స్ (4 IPL titles) నెగ్గింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు తొలిసారిగా టోర్నీలో అడుగుపెట్టి కప్ (title) ఎగురేసుకుపోయింది. ఇక తొలి మ్యాచ్ ఖచ్చితంగా హోరాహోరీగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఐపీఎల్సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 9 స్థానంలో (9th place) నిలిచి నిరాశ పర్చింది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి రవీంద్ర జడేజా కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే జడేజాపై ఒత్తిడి ఉండడంతో ధోనీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 

చెన్నై బ్యాటింగ్ లైనప్ : CSK batting lineup

గత ఏడాది ఎదురైన చేదు అనుభవాన్ని దిగమింగి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కసితో బరిలోకి దిగనుంది. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ (Dhoni net practice) బ్యాటింగ్ విన్యాసాలు వైరల్ అయ్యాయి. ఈసారి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ (fans) సంబర పడిపోతున్నారు. జట్టులో దాదాపు 10 మంది ఆల్రౌండర్లు (10 all-rounders) ఉన్నారు. ఓపెనర్లుగా (strong opening) డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నారు. వన్డౌన్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఉన్నాడు. 4 స్థానంలో అంబటి రాయుడు అదనపు బలం. ఎటుచూసినా మిడిల్ ఆర్డర్ ఎంతో పటిష్టంగా ఉంది. ఆల్రౌండర్లు శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా తరువాత ఫినిషర్ పాత్రలో ధోనీ (finisher Dhoni) ఎలానూ ఉన్నాడు.

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSK playing XI

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివం దూబే, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముకేశ్ చౌదరి

 

చెన్నై సూపర్ కింగ్స్ గణాంకాలు : Chennai Super Kings Stats 

 ప్లేయర్స్

  రోల్

IPL

మ్యాచ్‌లు

   గణాంకాలు

1.

మహేంద్ర సింగ్ ధోని

వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్

234

పరుగులు -4978

2.

డెవాన్ కాన్వే

వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్

7

పరుగులు -252

3.

రుతురాజ్ గైక్వాడ్

బ్యాట్స్ మన్

36

పరుగులు -1207

4.

అంబటి రాయుడు

వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్

188

పరుగులు -4190

5.

రవీంద్ర జడేజా

ఆల్‌రౌండర్

210

పరుగులు -2502, వికెట్లు -132

6.

మొయిన్ అలీ

ఆల్‌రౌండర్

44

పరుగులు -910, వికెట్లు- 24

7.

శివం దూబే

ఆల్‌రౌండర్

35

పరుగులు -688, వికెట్లు -4

8.

డ్వైన్ ప్రిటోరియస్

ఆల్‌రౌండర్

6

పరుగులు -44, వికెట్లు -6

9.

మిచెల్ సాంట్నే

ఆల్‌రౌండర్

12

పరుగులు -54, వికెట్లు -10

10.

బెన్ స్టోక్స్

ఆల్‌రౌండర్

43

పరుగులు -920, వికెట్లు -28

11.

సుభ్రాంశు సేనాపతి

బ్యాట్స్ మన్

ఇంకా IPL ఆడలేదు

12.

అజయ్ మండల్

ఆల్‌రౌండర్

 

ఇంకా IPL ఆడలేదు

13.

షేక్ రషీద్

బ్యాట్స్ మన్

 

ఇంకా IPL ఆడలేదు

14.

నిశాంత్ సింధు

ఆల్‌రౌండర్

 

ఇంకా IPL ఆడలేదు

15.

అజింక్య రహానే

బ్యాట్స్ మన్

158

పరుగులు -4074

16.

రాజవర్ధన్ హంగర్గేకర్

బౌలర్

ఇంకా IPL ఆడలేదు

17.

కైల్ జేమీసన్

ఆల్‌రౌండర్

9

పరుగులు -65, వికెట్లు-9

18.

భగత్ వర్మ

ఆల్‌రౌండర్

ఇంకా IPL ఆడలేదు

19.

మహేశ్ తీక్షణ

బౌలర్

9

వికెట్లు - 7

20.

ప్రశాంత్ సోలంకి

బౌలర్

2

వికెట్లు -2

21.

దీపక్ చాహర్

బౌలర్

63

వికెట్లు - 59

22.

సిమర్‌జీత్ సింగ్

బౌలర్

6

వికెట్లు -4

23.

మతీష పతిరన

బౌలర్

2

వికెట్లు -2

24.

ముఖేష్ చౌదరి

బౌలర్

13

వికెట్లు - 16

25.

తుషార్ దేశ్‌పాండే

బౌలర్

7

వికెట్లు -4

గుజరాత్ టైటాన్స్ గణాంకాలు : Gujarat Titans Stats

 ప్లేయర్స్

  రోల్

IPL మ్యాచ్‌లు

   గణాంకాలు

1.

హార్దిక్ పాండ్యా

ఆల్ రౌండర్

107

పరుగులు - 1963, వికెట్లు- 50

2.

శుభమాన్ గిల్

బ్యాట్స్ మన్

74

పరుగులు - 1900

3.

అభినవ్ మనోహర్

బ్యాట్స్ మన్

8

పరుగులు - 108

4.

వృద్ధిమాన్ సాహా

వికెట్ కీపర్, బ్యాట్స్మన్

144

పరుగులు - 2427

5.

డేవిడ్ మిల్లర్

బ్యాట్స్ మన్

105

పరుగులు - 2405

6.

మాథ్యూ వాడే

వికెట్ కీపర్, బ్యాట్స్మన్

13

పరుగులు - 179

7.

కేన్ విలియమ్సన్

బ్యాట్స్ మన్

76

పరుగులు - 2101

8.

KS భరత్

వికెట్ కీపర్, బ్యాట్స్మన్

10

పరుగులు - 199

9.

సాయి సుదర్శన్

బ్యాట్స్ మన్

5

పరుగులు - 145

10.

  విజయ్ శంకర్

ఆల్ రౌండర్

51

పరుగులు - 731, వికెట్లు- 9

11.

రాహుల్ తెవాటియా

ఆల్ రౌండర్

64

పరుగులు - 738, వికెట్లు- 32

12.

ఓడియన్ స్మిత్

ఆల్ రౌండర్

6

పరుగులు - 51, వికెట్లు- 6

13.

జయంత్ యాదవ్

ఆల్ రౌండర్

19

పరుగులు - 40, వికెట్లు- 8

14.

రషీద్ ఖాన్

ఆల్ రౌండర్

92

పరుగులు - 313, వికెట్లు- 112

15.

మహ్మద్ షమీ

బౌలర్

93

వికెట్లు- 99

16.

అల్జారీ జోసెఫ్

బౌలర్

12

వికెట్లు- 13

17.

ప్రదీప్ సాంగ్వాన్

బౌలర్

42

వికెట్లు- 38

18.

యశ్ దయాళ్

బౌలర్

9

వికెట్లు- 11

19.

మోహిత్ శర్మ

బౌలర్

86

వికెట్లు- 92

20.

నూర్ అహ్మద్

బౌలర్

 

ఇంకా ఆడాలి

21.

శివం మావి

బౌలర్

32

వికెట్లు- 30

22.

ఉర్విల్ పటేల్

వికెట్ కీపర్, బ్యాట్స్మన్

 

ఇంకా ఆడాలి

23.

జోష్ లిటిల్

బౌలర్

 

ఇంకా ఆడాలి

24.

దర్శన్ నల్కండే

బౌలర్

2

వికెట్లు- 2

25.

ఆర్ సాయి కిషోర్

బౌలర్

5

వికెట్లు- 6