నేటి ఐపీఎల్ లో డబల్ ధమాఖా : Today 2 blasting matches in IPL

ఇండియన్ రిచ్ లీగ్ గా పిలువబడే ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) భాగంగా నేడు రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి.

నేటి ఐపీఎల్ లో డబల్ ధమాఖా : Today 2 blasting matches in IPL

నేటి ఐపీఎల్ లో డబల్ ధమాఖా : Today 2 blasting matches in ipl

ఇండియన్ రిచ్ లీగ్ గా పిలువబడే ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) భాగంగా నేడు రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి.

 

ఒకరికి ఖేదం... ఒకరికి మోదం : One are in happy ... One are in sadness...

ఇండియన్ రిచ్ లీగ్ గా పిలువబడే ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) భాగంగా నేడు రెండు మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా పంజాబ్ (Punjab Kings XI, PBKS), బెంగుళూరు (Royal Challengers Bangalore, RCB), ఢిల్లీ లోని అరుజ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ (DC), కోల్కతా (KKR) జట్లు నేడు తలపడనున్నాయి. ఈ సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ మూడు మ్యాచ్‌లలో ఓడింది. దీంతో నేడు పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని భావిస్తోంది. అదేవిధంగా ఈ సీజన్ ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన కనబరుస్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టీమ్ కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Night Riders, KKR) టీమ్ తో తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్రేమికుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నేడు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా నెఉడ్ జరిగే మ్యాచ్‌లో వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ టీమ్ పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించాలని భావిస్తోంది. టీమ్ లో ప్రధాన ఆటగాడిగా ఉంటాడని భావించిన పృథ్వీ షా (Prithvi Sha) ఎవరూ ఊహించని రీతిలో పేలవమైన ఆటను ప్రదర్శిస్తూ అన్ని వైపులా నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ బోణీ కొట్టాలని భావిస్తోంది.

పంజాబ్ vs బెంగళూర్ : PBKS vs RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా బెంగళూర్ టీమ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో (points table) పైకి ఎగబాకాలని చూస్తోంది. ఇదే భావనను పంజాబ్ (PBKS) సైతం ఆశిస్తోంది. బెంగళూర్ (RCB) టీమ్ కి గత మ్యాచ్ లో అనూహ్యంగా పరాజయం ఎదురయింది. గెలవాల్సిన మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇంకోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన శిఖర్ ధావన్ (Sikhar Dhavan) సాథ్యంలోని పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ అభిమానులను అలరిస్తుందని చెప్పవచ్చు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన గత 6 మ్యాచ్‌ల ఫలితాలు (6 matches results) గనుక పరిశీలిస్తే, ఆర్‌సీబీపై పంజాబ్‌కు ఘనమైన  రికార్డు ఉంది. బెంగళూరుతో జరిగిన గత 6 మ్యాచ్‌ల్లో పంజాబ్ 5 మ్యాచ్‌లలో గెలిచింది.

పంజాబ్ కింగ్స్ జట్టు తుది అంచనా : PBKS probable XI prediction

శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాట్ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ మరియు అర్ష్‌దీప్ సింగ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తుది అంచనా : RCB probable XI prediction

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాక్

 

ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ : DC vs KKR

వార్నర్ నాయకత్వంలోని (captain warner) ఢిల్లీ క్యాపిటల్స్ నేడు కోలకతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley stadium) నేడు జరిగే మ్యాచ్ లో విజయం అందుకుని వరుస పరాజయాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కోల్కతా సైతం వరుసగా రెండు పరాజయాల తరువాత నేడు జరిగే మ్యాచ్ తో తిరిగి ఫామ్ (form) లోకి రావాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఢిల్లీ జట్టు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పేలవంగా (DC failed in batting and bowling) ఉంది. వార్నర్ ఒక్కడే సారథిగా రాణిస్తున్న, మిగతా వారి నుంచి సహకారం కొరవడింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తుది అంచనా : DC vs KKR probable XI

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

 

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తుది అంచనా : KKR probable XI

రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), N జగదీసన్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి