ఐపీఎల్ లో నేడు రసవత్తరమైన మ్యాచ్ : Today RR vs LSG match in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో బుధవారం నాడు మరో రసవత్తరమైన మ్యాచ్ కి వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో (Points table) తొలి రెండు స్థానాలలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి.

ఐపీఎల్ లో నేడు రసవత్తరమైన మ్యాచ్ : Today RR vs LSG match in IPL

ఐపీఎల్ లో నేడు రసవత్తరమైన మ్యాచ్ : Today RR vs LSG match in IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో బుధవారం నాడు మరో రసవత్తరమైన మ్యాచ్ కి వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో (Points table) తొలి రెండు స్థానాలలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి. దీంతో మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుంది. సవాయ్ మాన్సింగ్స్టేడియంలో (Sawai Mansingh Stadium) మ్యాచ్ జరగనుంది.  లక్నో టీమ్ రాజస్థాన్ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతోంది.

 

ఫామ్ లో సంజూ సేన : Sanju squad is in good form

రాజస్థాన్రాయల్స్కు (Rajasthan Royals) సారథ్యం వహిస్తున్న సంజూ సాంసన్ (Sanju Samson) జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్లిష్ట సమయంలో తన బ్యాట్ కి (Batting) పదును పెడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ లో ఉన్న శాంసన్ బౌలర్లను ఒక ఆటాడుకుంటున్నారు. జట్టులోని ఓపెనర్లు (openers) యశస్వీ జైశ్వాల్‌, జోస్బట్లర్అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. నేడు జరిగే మ్యాచ్ లో వీరిద్దరూ మరోసారి తమ ఫామ్ ను కనబరిస్తే మాత్రం లక్నో జట్టుకు తిప్పలు తప్పవని చెప్పవచ్చు. వీరితో పాటుగా దేవదత్పడిక్కల్‌, రియాన్పరాగ్జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక మిగిలార్డర్లో వస్తున్న హెట్మైయిర్మ్యాచులను ఫినిష్ చేస్తున్న (match finishing) విధానం అద్భుతమని చెప్పవచ్చు. బౌలింగ్ విషయంలో బౌల్ట్  (boult) పవర్ ప్లేలో ఖచ్చితంగా రెండు వికెట్లను తీస్తూ జట్టులో స్ఫూర్తిని నింపుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా (impact players) వస్తున్న అశ్విన్‌, ధ్రువ్జోరెల్తమ బ్యాటుకు పదును పెడుతూ పరుగులను అలవోకగా సాధిస్తున్నారు.

లక్నో సైతం... Lucknow also in form

రాజస్థాన్ తో సమానంగా లక్నో జట్టు (LSG team) కూడా ఐపీఎల్ 16 సీజన్లో అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోంది. అయితే గెలవాల్సిన మ్యాచుల్లో చేతులారా ఓటమిని కొనితెచ్చుకుంటోంది. తీరును కనుక నెట్టుకు రాగలిగితే జట్టుకు తిరుగుండదని విశ్లేషకుల అంచనా. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో (IPL last season) రాజస్థాన్ జట్టుతో జరిగిన రెండు మ్యాచులను లక్నో కోల్పోయింది (LSG lost 2 matches). కేఎల్ రాహుల్ తన ఆటతీరును మార్చుకుని ఓపెనింగ్ లో కనుక పరుగులు సాధించడంలో సఫలమైతే రాజస్థాన్ కు తిప్పలు తప్పవు. దీపక్హుడా, కృనాల్పాండ్య పరుగులు సాధించడంలో ఇంకా ఇబ్బంది పడుతుండడం జట్టుపై భారం పడుతోందని చెప్పవచ్చు.

 

రాజస్థాన్ రాయల్స్ ఫుల్ స్క్వాడ్ : RR team full squad

సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI అంచనా : RR probable playing XI

యశస్వి జైస్వాల్, ఆర్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జోస్ బట్లర్, ఎస్వీ శాంసన్ (కెప్టెన్), డిసి జురెల్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, జంపా

 

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్ : LSG full squad

కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.

 

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI అంచనా : LSG probable playing XI

KL రాహుల్ (కెప్టెన్), MP స్టోయినిస్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, KH పాండ్యా, A బదోని, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్