నేడు హైదరాబాద్ vs ముంబై మ్యాచ్ : srh vs mi will face today match

ధనాధన్ పొట్టి క్రికెట్ గా పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. బంతి బంతికీ, మ్యాచ్ మ్యాచ్ కీ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తోంది.

నేడు హైదరాబాద్ vs ముంబై మ్యాచ్ : srh vs mi will face today match

నేడు హైదరాబాద్ vs ముంబై మ్యాచ్ : srh vs mi will face today match

ధనాధన్ పొట్టి క్రికెట్ గా పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తోంది. బంతి బంతికీ, మ్యాచ్ మ్యాచ్ కీ అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తోంది.

ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. సీజన్ ప్రారంభమైన మొదట్లో రెండు మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ టీమ్ తరువాత పుంజుకుని రెండు మ్యాచ్‌లు గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లను ఓడించిన హైదరాబాద్ టీమ్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ తో తలపడనుంది. హైదరాబాద్ జట్టులాగానే ముంబై ఇండియన్స్ సైతం రెండు మ్యాచ్‌లు వోడి అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందింది. దీంతో నేడు జరగనున్న మ్యాచ్‌ నిజంగా అందరికీ కనువిందుగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు (cricket experts) అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు హైదరాబాద్ టీమ్ సమాయత్తమైంది. ఈ హోరాహోరీ మ్యాచ్ రెండు జట్లకూ ప్రాణసంకటంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ప్రతీ జట్టుకూ తప్పక విజయం సాధించాల్సిన స్థితి నెలకొంది. హైదెరాడబ్ టీమ్ లోని ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు శుభ పరిణామంగా చెప్పవచ్చు. అయితే జట్టులోని కొందరు ఆటగాళ్లు ఫీల్డింగ్ లో గల్లీ క్రికెట్ ఆటగాళ్ల కంటే అధ్వాన్నంగా ఉండడం జట్టును ఆందోళనలో పడేస్తోంది. ప్రధానంగా చెప్పాలంటే ఆటలో ఫీల్డింగ్ అనేది చాల మ్కుఖ్యమైన అంశం. క్యాచ్ లే మ్యాచ్ విన్నర్లు అనేది క్రికెట్ లో సాధారణంగా వాడే పదం. ముంబై టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ తో ఉండడంతో ఆ జట్టు ఎంతో ఉత్సాహంతో ఉంది. ఇప్పటివరకూ రోహిత్ తన అసలైన నైపుణ్యాన్ని ఈ ఐపీఎల్ (IPL) లో ప్రదర్శించలేదు. దీంతో నేడు జరిగే మ్యాచ్ లో రోహిత్ హిట్ అయితే హైదరాబాద్ కు తిప్పలు తప్పవని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ కెప్టెన్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. ఇరు జట్లూ కూడా నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి.

 

ఐపీఎల్ అన్ని సీజన్లలో హైదరాబాద్, ముంబై జట్లు తలపడిన మ్యాచ్‌లలో ముంబై జట్టు దే అగ్రస్థానం అని చెప్పవచ్చు. రెండు జట్లూ తలపడిన మ్యాచ్‌లలో ముంబై జట్టు అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందింది. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో హైదరాబాద్, ముంబై జట్లు 19 సార్లు తలపడగా ఇందులో ముంబై జట్టు 10 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 9 మ్యాచ్‌లలో హైదరాబాద్ విజయం సాధించింది. ముంబై జట్టు అత్యధిక స్కోర్ 235 పరుగులు కాగా, హైదరాబాద్ జట్టు 193 పరుగులు అత్యధిక స్కోర్ సాధించింది. అత్యల్ప స్కోర్ విషయంలో ముంబై 87 పరుగులు, హైదరాబాద్ 96 పరుగులు చేశాయి. గత ఏడాది జరిగిన 15 వ సీజన్ ఐపీఎల్ లో ముంబై జట్టుపై హైదరాబాద్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే నేడు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరగనుండడం హైదరాబాద్ కి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నేడు జరిగే మ్యాచ్‌లో తుది జట్ల అంచనా (probable)...

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఆడే XI : SRH probable XI

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

 

ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఆడే XI : MI probable XI

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెమరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్

 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్కోర్ రికార్డ్స్

మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు: 196

రెండవ ఇన్నింగ్స్ సగటు స్కోరు: 198

అత్యధిక స్కోర్ ; 209/4