ఐపీఎల్ లో నేడు లక్నో, ఢిల్లీ మ్యాచ్ : LSG vs DC face today in IPL

ఐపీఎల్ లో నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 16 వ సీజన్లో భాగంగా రెండో రోజు లక్నో (LSG), ఢిల్లీ (DC) జట్లు తలపడనున్నాయి. లక్నో జట్టు హోమ్ గ్రౌండ్ (Lucknow home ground) అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో (Ekana stadium) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ లో నేడు లక్నో, ఢిల్లీ మ్యాచ్ : LSG vs DC face today in IPL

ఐపీఎల్ లో నేడు లక్నో, ఢిల్లీ మ్యాచ్ : LSG vs DC face today in IPL

ఐపీఎల్ లో నేడు మరో రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 16 సీజన్లో భాగంగా రెండో రోజు లక్నో (LSG), ఢిల్లీ (DC) జట్లు తలపడనున్నాయి. లక్నో జట్టు హోమ్ గ్రౌండ్ (Lucknow home ground) అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో (Ekana stadium) రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అయితే కీలక ఆటగాళ్లు క్వింటన్ డి కాక్ (Quinton DE Kock), మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) అందుబాటులో ఉండడం లేదు. అదేవిధంగా ఢిల్లీ జట్టుకు చెందిన రిషబ్ పంత్ (Pant) కారు ప్రమాదంలో గాయపడడంతో జట్టుకి దూరమయ్యాడు.

 

కేఎల్ రాహుల్రాణిస్తాడా : Will KL Rahul perform well?

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని (Captain KL Rahul) లక్నో జట్టు గత ఏడాది జరిగిన 15 సీజన్ ఐపీఎల్ లో ప్రవేశించింది. ఏడాది మంచి ప్రదర్శనే చేసింది. అయితే గత కొంత కాలంగా ఫామ్ లో లేక (out of form) తంటాలు పడుతున్న రాహుల్ కి మ్యాచ్ అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు. విమర్శకుల దాడి నుంచి తప్పించుకోవాలంటే మ్యాచ్ని గెలిపించడమే కాకుండా తన బ్యాట్ కి పని చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్తో పాటు కైల్ మేయర్స్ (Kyle Mayors), నికోలస్ పూరన్ (Nicholas Pooran) వంటి హిట్టర్లు, దీపక్ హుడా (Huda), స్టోయినిస్‌ (Stoinis), కృనాల్ పాండ్య లాంటి ఆల్ రౌండర్లతో క్నో సూపర్ జెయింట్స్ టీమ్టిష్టంగా ఉంది. ఐపీఎల్ సీజన్లో జరిగిన వేలంలో నికోలస్ పూరన్ను రూ. 16 కోట్లకు (16 crores) క్నో టీమ్ దక్కించుకుంది. మరి నికోలస్ ధరకు ఎంతవరకు న్యాయం చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా జట్టులోని ప్రధాన బౌలర్లు దేవ్ ఉనద్కత్‌, ఆవేష్ఖాన్ రాణిస్తే ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పవని చెప్పవచ్చు.

KL రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రన్-మెషీన్గా (run machine rahul) ఉన్నాడు. ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ లో 109 మ్యాచ్లు ఆడి 136.22 స్ట్రైక్ రేట్తో (strike rate) 3889 పరుగులు చేశాడు. మంచి స్ట్రోక్ ప్లేయర్ అయిన రాహుల్ తన మునుపటి బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు.

 

ఢిల్లీ కెప్టెన్ గా వార్నర్ : Warner will lead DC

కారు ప్రమాదంలో (car accident) గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ రిషబ్ పంత్ (Pant) స్థానంలో డేవిడ్ వార్నర్ (warner) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జట్టులో పంత్ లేకపోవడం పెద్ద లోటు అని చెప్పవచ్చు. ఎంతో అనుభవమున్న వార్నర్ నాయకత్వంలో ఢిల్లీ రాణించి టైటిల్ (title) గెలవాలనే పట్టుదలతో ఉంది. వార్నర్ పై ఖచ్చితంగా భారం ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవల దేశవాళీ క్రికెట్లో (domestic cricket) రాణించిన పృథ్వీ షా (Prithvi Shaw), ర్ఫరాజ్ఖాన్ (Sarfaraz Khan) తమ మెరుపులను ఐపీఎల్ లో (IPL) ఎంతవరకూ మెరిపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాప్ స్పిన్నర్లు (spinners) అక్షర్ టేల్‌, కుల్దీప్ యాదవ్ క్నోను ట్టడి చేసే అవకాశం ఉంది.

 

ఐపీఎల్ రెండో సీజన్ (IPL second season) నుంచి ఆడుతున్న వార్నర్ warner ఇప్పటివరకూ 162 మ్యాచ్లు ఆడి 5881 పరుగులు చేసాడు. ఇందులో 4 సెంచరీలు (made 4 centuries) కూడా ఉన్నాయి. అత్యధిక స్కోరు 126 పరుగులు. ఐపీఎల్ లో అడుగుపెట్టిన ఏడాదే సెంచరీని సాధించాడు. మునుపటి ఫామ్ ను ప్రదర్శిస్తే వార్నర్ బ్యాట్ నుండి భారీ స్కోర్లు నమోదవుతాయని చెప్పవచ్చు.

ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ లు : head to head

గత సీజన్లోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన లక్నో (Lucknow team entered 15th season) టీమ్ రెండు మ్యాచ్లలో ఢిల్లీ (DC) జట్టుతో తలపడింది. రెండు మ్యాచ్లలోనూ (2 matches win against DC) లక్నో జట్టు విజయం సాధించింది. దీంతో ఏడాది కూడా ఢిల్లీ జట్టుపై విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సాధించాలని ఎదురు చూస్తోంది.

 

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్ : LSG full squad

మనన్ వోరా, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్, కరణ్ శర్మ, కె గౌతమ్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ చరక్

 

లక్నో జట్టులో ఆడే ప్లేయింగ్ XI : Lucknow Playing XI in Final Team

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జయదేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.

 

ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : DC full squad

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్. ఇషాన్పోరెల్

 

ఢిల్లీ జట్టులో ఆడే ప్లేయింగ్ XI : Delhi Playing XI in Final Team

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్