సంక్రాంతిలో కోహ్లీ సెంచరీల మోత : Kohli's Centuries in Sankranti

సంక్రాతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద... అన్నట్లుగా సంక్రాతి పండుగ వచ్చిందంటే విరాట్ కోహ్లీకి సెంచరీలు (centuries) వస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కోహ్లీ జీవితంలో జనవరి 15 నిజమైన సంక్రాంతిని ఇస్తోంది.

సంక్రాంతిలో కోహ్లీ సెంచరీల మోత : Kohli's Centuries in Sankranti

సంక్రాంతిలో కోహ్లీ సెంచరీల మోత : Kohli's Centuries in Sankranti

సంక్రాతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద... అన్నట్లుగా సంక్రాతి పండుగ వచ్చిందంటే విరాట్ కోహ్లీకి సెంచరీలు (centuries) వస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కోహ్లీ జీవితంలో జనవరి 15 నిజమైన సంక్రాంతిని ఇస్తోంది.

 

రన్ మెషిన్ బిరుదు సార్ధకం : The Run Machine title is apt

రెండేళ్లపాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ తిరిగి తన మునుపటి ఆటతీరుతో ఫామ్ (form) లోకి వచ్చి అభిమానులను అలరిస్తున్నాడు. ఫామ్ లోకి వచ్చాక సెంచరీల మీద సెంచరీలు చేస్తూ రికార్డులు (records) సృష్టిస్తున్నాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో ఆఫ్ఘానిస్తాన్ పై సెంచరీతో తన లయను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా 'రన్ మెషిన్' (Run machine) లా పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసి యా కప్ లో చేసిన ఈ సెంచరీ తరువాత మరో మూడు సెంచరీలు సాధించి మొత్తంగా 74 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో 2 సెంచరీలు చేసాడు.

 

సంక్రాంతికి సినిమాల జోరు... కోహ్లీకి సెంచరీల హోరు : Sankranti is full of movies... Kohli is full of centuries

సంక్రాతి (Sankranti) అంటే అందరికీ పండగే. ఆరోజు తమ అభిమాన హీరోల సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. హీరోలు కూడా సంవత్సరంలో మొదటి పండగ రోజును పురస్కరించుకుని తమ సినిమాలు (movies) రిలీజ్ చేస్తుంటారు. అయితే కోహ్లీకి కూడా సంక్రాతి (Sankranti) ప్రత్యేకమైనది. ఎందుకంటే జనవరి 15 న వచ్చే సంక్రాంతి పండగ రోజున కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు (centuries) సాధించాడు. ఇది 4 సార్లు జరిగింది. ఆరోజు మ్యాచ్ ఉందంటే కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రావాల్సిందే.

2017 జనవరి 15 : 2017 January 15

కోహ్లీ మొట్టమొదట చేసిన సెంచరీ 15 జనవరి 2017లో సంక్రాంతి (Sankranti) రోజున జరిగింది. ఇంగ్లండ్‌తో పూణేలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అద్భుతమైన సెంచరీ (century) సాధించాడు. భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు.  మొత్తం 105 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసాడు. ఈ సెంచరీతో కోహ్లీ 27 సెంచరీల మార్క్ ను అందుకున్నాడు.

 

2018 జనవరి 15 : 2018 January 15

ఆ మరుసటి ఏడాది 2018 జనవరి 15 న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీని (century) సాధించాడు. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరిగిన ఈ టెస్టులో 2018 ఏడాది ప్రారంభంలో తన మొదటి సెంచరీని చేసాడు. మొత్తం 217 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 153 పరుగులను చేసాడు. మొత్తం 15 ఫోర్ల సాయంతో ఈ స్కోర్ ను సాధించాడు.

 

2019 జనవరి 15 : 2019 January 15

వరుసగా మూడో ఏడాది కూడా కోహ్లీ జనవరి 15 న సెంచరీని (century) సాధించాడు. తనకి జనవరి 15 ఎలా కలసివస్తుందో ఈ మ్యాచ్ లో నిరూపించాడు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్‌లో  ఆస్ట్రేలియాతోనే 2019 జనవరి 15 జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. మొత్తం 112 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ (Kohli) 104 పరుగులు చేసాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

 

2023 జనవరి 15 : 2023 January 15

భీకర ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ (virat kohli) ఈ ఏడాది 2023 జనవరి 15 న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. రన్ మెషిన్ గా తనకున్న బిరుదును సార్ధకం చేస్తూ అద్భుతమైన సెంచరీని సాధించాడు. మొత్తం 110 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 166 పరుగులు చేసాడు. ఇందులో 13 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. సంక్రాంతికి సినిమా (cinema) హీరోలే కాదు, తాను కూడా హీరోనే (hero) అని, తనకూ సంక్రాంతి కలిసి వస్తుందని నిరూపించాడు.

అత్యధిక సెంచరీల్లో 2వ స్థానం : 2nd most centuries scored

అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఘనత సచిన్ (100) పేరున ఉంది. సచిన్ తరువాత స్థానంలో ఉన్న రికి పాంటింగ్ (Ricky Ponting) చేసిన అత్యధిక సెంచరీల (71) రికార్డును కోహ్లీ (74) అధిగమించి రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ ఈ రకమైన ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ రికార్డును (sachin record) బద్దలు కొట్టగలడు. కోహ్లీ ప్రస్తుత వయస్సు 34 సంవత్సరాలు. ఫిట్నెస్ (fitness) పై శ్రద్ధ చూపించే కోహ్లీకి మరి కొన్నాళ్ళు క్రికెట్ ఆడగల సత్తా ఉంది. సచిన్ రికార్డును అధిగమించడానికి సమకాలీన క్రికెట్లో కోహ్లీ తప్ప ఆ దరిదాపుల్లో ఎవ్వరూ లేరు.

 

46 మ్యాచ్‌ల్లో 38 గెలుపు : 38 wins out of 46 matches

విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో 46 సెంచరీలు చేసాడు. విరాట్ తాను సాధించిన 46 సెంచరీలతో 38 మ్యాచ్‌లు గెలిపించాడు. ఒక మ్యాచ్ టై కాగా, 7 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. ఇండియా తరపున విరాట్ వన్డే సెంచరీని చేసినప్పుడు దాని విజయ శాతం 82% గా ఉంది.

 

అన్ని ఫార్మాట్లలో విరాట్ సెంచరీలు : Virat centuries in all formats

టెస్టులు, వన్డేలు, టీ20 లు ఇలా మొత్తం అన్ని ఫార్మాట్లలో విరాట్ సాధించిన సెంచరీల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం.

 

టెస్టులు (Tests) : 104 మ్యాచ్‌ల్లో 177 ఇన్నింగ్స్, 8119 పరుగులు. 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు

వన్డేలు (ODI) : 268 మ్యాచ్‌ల్లో 259 ఇన్నింగ్స్, 12754 పరుగులు. 46 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు

టీ20 లు (T20I) : 115 మ్యాచ్‌ల్లో 107 ఇన్నింగ్స్, 4008 పరుగులు. 1 సెంచరీ, 37 అర్ధ సెంచరీలు.

Recommended Reads 

Female Cricketers of India

IPL 2023 Schedule

IPL Matches Prediction

Kohlis Centuries in sankranti