ఐపీఎల్‌లో మేటి ప్రత్యర్థులు : Big rivals in IPL

పొట్టి క్రికెట్ గా పిలవబడే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో అతిపెద్ద పోటీ అంటే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్యనే జరుగుతుంది, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇది ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.

ఐపీఎల్‌లో మేటి ప్రత్యర్థులు : Big rivals in IPL

ఐపీఎల్‌లో మేటి ప్రత్యర్థులు : Big rivals in IPL

పొట్టి క్రికెట్ గా పిలవబడే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో అతిపెద్ద పోటీ అంటే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్యనే జరుగుతుంది, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇది ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.

 

అభిమానుల్లో ఉత్కంఠ కలిగించే మ్యాచ్ లు : Matches that excite the fans 

పొట్టి క్రికెట్ గా పిలవబడే IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో అతిపెద్ద పోటీ అంటే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్యనే జరుగుతుంది, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇది ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. IPL లో అత్యంత విజయవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి MI, CSK జట్లే కావడం గమనార్హం. ముంబై జట్టు 5 సార్లు, చెన్నై జట్టు 4 సార్లు టైటిల్ గెలుపొందాయి. దీంతో ఐపీఎల్ చరిత్ర (history) లోనే గొప్ప జట్లుగా ఈ రెండు నిలిచాయి.

 

తలపడిన మ్యాచ్ లు : 34

ముంబై (MI)గెలిచినవి : 20

చెన్నై (CSK) గెలిచినవి : 14

 

5 టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ : Mumbai Indians who won 5 titles

ఐపీఎల్ (IPL) చరిత్రలో ముంబై జట్టు 5 సార్లు అత్యధికంగా టైటిళ్లు గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019 మరియు 2020 సీజన్లలో MI జట్టు టైటిళ్లు (titles) సాధించింది. 2010 లో ఒకసారి రన్నరప్ గా నిలిచింది. అయితే ఐపీఎల్ (IPL) మొదలు పెట్టిన 5 సంవత్సరాలకి గాని MI (ముంబై) జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 2010 లో ఫైనల్ కి చేరినప్పటికీ CSK చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అనంతరం 3 సార్లు ఫైనల్లో CSK తో తలపడి టైటిల్స్ గెలుచుకుని ఆధిపత్యం చెలాయించింది. రోహిత్ శర్మ సారధ్యంలోని ఈ జట్టు ఐపీఎల్ (IPL)లో విజయవంతమైన జట్టుగా దూసుకుపోతోంది.

 

MI టైటిల్స్ : MI Titles

2013 : ఫైనల్స్ లో CSK ను 23 పరుగులతో ఓడించింది

2015 : ఫైనల్స్ లో CSK ను 41 పరుగులతో ఓడించింది

2017 : ఫైనల్స్ లో పూణె జెయింట్స్ పై 1 పరుగు తేడాతో గెలుపు

2019 : ఫైనల్స్ లో CSK పై 1 పరుగు తేడాతో గెలుపు

2020 : ఫైనల్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 1 పరుగు తేడాతో గెలుపు

ముంబై ఇండియన్స్ టీమ్ : MI Team Squad

వికెట్ కీపర్లు : ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్ (South Africa), విష్ణు వినోద్.

బ్యాట్స్‌మెన్లు : రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ (Australia), రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రీవిస్ (South Africa).

ఆల్ రౌండర్లు : నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, డువాన్ జాన్సన్ (South Africa), కామెరాన్ గ్రీన్ (Australia).

బౌలర్లు : జోఫ్రా ఆర్చర్ (England), జస్ప్రీత్ బుమ్రా, అర్షద్ ఖాన్, జాసన్ బెహ్రెండార్ఫ్ (Australia), కుమార్ కార్తికేయ, ఆకాష్ మాధ్వల్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, రాఘవ్ గోయల్, పీయూష్ చావ్లా, ఝే రిచర్డ్సన్ (Australia)

 

MI ప్లేయింగ్ XI ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లు : రోహిత్ శర్మ (captain), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, ఝే రిచర్డ్‌సన్/జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.

 

CSK 4 టైటిల్స్... 5 ఫైనల్స్... 11 ప్లే ఆఫ్స్ : CSK 4 titles... 5 finals... 11 play offs

ఐపీఎల్ మొదలుపెట్టిన సంవత్సరంలోనే ఫైనల్ కి చేరి రన్నరప్ గా సరిపెట్టుకున్నప్పటికీ, ఆ తరువాత జరిగిన సీజన్లలో తనదైన ముద్ర వేసింది చెన్నై (CSK) జట్టు. ధనాధన్ ధోనీ సారధ్యంలోని జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో 4 టైటిల్స్ గెలవడమే కాకుండా, 5 సార్లు ఫైనల్ కి చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. 14 సీజన్లలో రెండు సీజన్లు మ్యాచ్ ఫిక్సింగ్ (match fixing) కారణంగా 2016, 2017 సీజన్లలో సస్పెన్షన్ కి గురై ఆడలేదు. మిగిలిన అన్ని సీజన్లలో ఆడి 11 సార్లు ప్లే ఆఫ్స్ కి చేరిన జట్టుగా నిలిచింది. 2010, 2011, 2018, 2021 లో టైటిల్స్ సాధించింది. 2008, 2012, 2013, 2015, 2019 లో ఫైనల్స్ కి చేరి రన్నరప్ (runner-up) గా నిలిచింది.

 

CSK టైటిల్స్ : CSK Titles

2010 : ఫైనల్స్ లో MI ను 22 పరుగులతో ఓడించింది

2011 : ఫైనల్స్ లో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు) ను 58 పరుగులతో ఓడించింది

2018 : ఫైనల్స్ లో SRH (సన్ రైజర్స్ హైదరాబాద్) పై 8 వికెట్లతో గెలుపు

2021 : ఫైనల్స్ లో KKR (కోల్కతా నైట్ రైడర్స్) పై 27 పరుగుల తేడాతో గెలుపు

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ : CSK Team Squad

వికెట్ కీపర్లు : MS ధోని (captain), డెవాన్ కాన్వే (New Zealand).

బ్యాట్స్‌మెన్లు : రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే.

ఆల్ రౌండర్లు : మొయిన్ అలీ (England), శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్ (South Africa), మిచెల్ సాంట్నర్ (New Zealand), బెన్ స్టోక్స్ (England), కైల్ జామీసన్ (New Zealand), అజయ్ మండల్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.

బౌలర్లు : దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ (Srilanka), సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ (Srilanka).

 

CSK ప్లేయింగ్ XI ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లు : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, అజింక్యా రహానే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, MS ధోని (captain), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ.