క్రికెట్ అభిమానులను అలరించనున్న 2023 : 2023 will entertain cricket fans

కోట్లాది మందిని అలరిస్తున్న క్రీడల్లో Cricket (క్రికెట్) ఒకటి. ఫుట్ బాల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన క్రీడ. 14వ శతాబ్దం నుంచి ఆడుతున్న క్రికెట్ ను 100 పైగా దేశాలు ఆడుతున్నాయి. కూకాబురా అనే చెక్క తో తయారు చేసిన బ్యాటు, బంతితో క్రికెట్ ఆడతారు.

క్రికెట్ అభిమానులను అలరించనున్న 2023 : 2023 will entertain cricket fans

క్రికెట్ అభిమానులను అలరించనున్న 2023 : 2023 will entertain cricket fans

కోట్లాది మందిని అలరిస్తున్న క్రీడల్లో Cricket (క్రికెట్) ఒకటి. ఫుట్ బాల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన క్రీడ. 14 శతాబ్దం నుంచి ఆడుతున్న క్రికెట్ ను 100 పైగా దేశాలు ఆడుతున్నాయి. కూకాబురా అనే చెక్క తో తయారు చేసిన బ్యాటు, బంతితో క్రికెట్ ఆడతారు.

 

జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ : Cricket is a Gentlemen Game

పచ్చిక మైదానాల్లో ఆడే క్రికెట్ టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లో జరుగుతుంటాయి. టెస్టులు ఐదు రోజులపాటు ఆడతారు. దీనిని సుదీర్ఘ క్రికెట్ అంటారు. 50 ఓవర్ల పాటు ఆడే క్రికెట్ ను వన్డేలని, 20 ఓవర్ల పాటు ఆడే దానిని పొట్టి క్రికెట్ లేదా టీ20 (T20) లు అంటారు. ఒక్కో టీమ్ లో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో వికెట్ కీపర్, బౌలర్లు, బ్యాట్స్మెన్లు ఉంటారు. ఇంగ్లాండ్ లో మొదటిసారి ఆడినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే క్రికెట్ కి ఇంగ్లాండ్ పుట్టినిల్లు అంటారు. జెంటిల్మెన్ గేమ్ గా ఇది ప్రసిద్ధి చెందింది. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ను 19 శతాబ్దపు రెండవ భాగంలో ఆడారు.

 

కోట్లాది మందిని అలరిస్తున్నక్రికెట్ లో ఆటగాళ్లను అభిమానించి, వారిని దేవుళ్లుగా కూడా కొలుస్తుంటారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను వీక్షించేందుకు గ్రౌండ్స్ కి వెళ్ళేవాళ్ళు కొందరైతే, టీవీలు, మొబైళ్ళలో చూసేవారు మరికొందరు ఉంటారు. క్రికెట్ కి సంబంధించి వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఆసియా కప్, టెస్ట్ సిరీస్ లు, వన్డే సిరీస్ లు అలరిస్తుంటాయి. వీటన్నింటిని మించి విభిన్న దేశాల క్రీడాకారులతో కలిసి భారతీయ క్రికెటర్లు కలిసికట్టుగా ఆడుతున్న ఐపీఎల్ కోట్లాది మందిని అలరిస్తోంది. క్రికెటర్లకు కోట్లు కుమ్మరిస్తోంది.

 

క్రికెట్లో వాడే సాంకేతిక పదాలు : Technical terms used in cricket

కోట్లాది మంది క్రికెట్ ను చూస్తున్నప్పటికీ ఎంతోమందికి క్రికెట్లో వాడే సాంకేతిక పదాలు (technical words) తెలిసుండవు. సాధారణంగా ఒక బ్యాట్స్మెన్ (batsmen) ను అవుట్ అయ్యేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.

 

1. క్యాచ్ అవుట్ (catch out)

బ్యాట్స్మెన్ బంతిని కొట్టిన తరువాత అది గాల్లోకి లేచినపుడు ఫీల్డర్ దానిని గాల్లో ఉండగానే చేతులతో ఒడిసి పట్టుకుంటే క్యాచ్ అవుట్ గా పరిగణిస్తారు. బ్యాట్స్మెన్లు ఎక్కువగా క్యాచ్ అవుట్ (catch out) అవుతుంటారు.

 

2. బౌల్డ్ (bowled)

బౌలర్ విసిరే బంతి నేరుగా వికెట్లను తాకినా, బ్యాట్స్మెన్ బ్యాట్ కి బాల్ తగిలి వికెట్లను గిరాటు వేసినా బౌల్డ్ (bowled) గానే పరిగణిస్తారు.

 

3. హిట్ వికెట్ (hit wicket)

బ్యాట్స్మెన్ ఉద్దేశ్యపూర్వకంగా వికెట్లను చేతితో తాకినా, లేదా బ్యాట్ వెళ్లి వికెట్లను తాకినా ... అంటే వికెట్లు బ్యాట్స్మెన్ వల్ల బెయిల్స్ పడితే దానిని హిట్ వికెట్ (hit wicket) గా పరిగణిస్తారు. కొన్ని సార్లు బ్యాట్స్మెన్ బంతిని చేతితో ఆపినా దానిని అవుట్ గానే పరిగణిస్తారు.

 

4. ఎల్బీడబ్ల్యూ (LBW)

బౌలర్ విసిరిన బంతి నేరుగా బ్యాట్స్మెన్ ప్యాడ్స్ ని తాకితే దానిని ఎల్బీడబ్ల్యూ (LBW) అంటారు. క్రికెట్లో అంపైర్లకు అంత్యంత కఠినమైన పరీక్ష ఇక్కడే ఎదురవుతుంది. ఎందుకంటే అది నేరుగా వికెట్లను తాకిందా? బ్యాట్ కి టచ్ అవుతూ ప్యాడ్ కి తగిలిందా? అని నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకే ఆధునిక సాంకేతికతను జోడించి అవుట్ కోసం, ఇతర ఔట్స్ కోసం మూడో అంపైర్ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రవేశపెట్టింది.

 

5. స్టంప్ అవుట్ (stump out)

బౌలర్ విసిరిన బంతిని కొట్టేందుకు బ్యాట్స్మెన్ తనకు నిర్దేశించిన క్రీజ్ ను వదిలి ముందుకు వచ్చి దానిని కొట్టలేక మిస్ అయినప్పుడు వికెట్ కీపర్ బాల్ తో బెయిల్స్ ను గిరాటు వేస్తాడు. దీనినే స్టంప్ అవుట్ (stump out) అంటారు.

 

6. రన్ అవుట్ (runout)

బ్యాట్స్మెన్లు ఇద్దరూ పిచ్ మధ్య పరుగులు తీస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ క్రీజ్ ని చేరకముందే బాల్ తో వికెట్లను గిరాటు వేస్తె దానిని రన్ అవుట్ (runout) అంటారు.

 

వన్డే ప్రపంచ కప్ విన్నర్స్ : One Day World Cup Winners

మనం ముందు చెప్పుకున్నట్లుగా క్రికెట్లో వన్డే ప్రపంచ కప్, టెస్టుల ప్రపంచ కప్, ఆసియా కప్ వంటివి కోట్లాది మందికి వినోదాన్ని అందిస్తున్నాయి. ఒక్కసారి వీటి చరిత్ర గురించి, ఇందులో ఉండే రికార్డుల గురించి తెలుసుకుందాం.

 

1975 సంవత్సరం నుంచి వన్డే ప్రపంచ కప్ ని నిర్వహిస్తున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి టోర్నమెంట్ జరుగుతుంది. 10 జట్ల మధ్య జరిగినప్పటి నుంచి ఇప్పుడు 14 జట్లకు పెరిగింది. దీనికోసం క్వాలిఫై మ్యాచ్ లు కూడా నిర్వహిస్తారు.

 

ఇప్పటివరకు 12 ప్రపంచ కప్ లు జరిగాయి. ఇందులో మొట్టమొదటి కప్ ను 1975 లో వెస్టిండీస్ గెలుచుకుంది. అనంతరం 1979 లో రెండోసారి గెలుపొందింది. అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు గెలుచుకుంది. భారత్ 1983, 2011 లో రెండు సార్లు గెలుచుకుంది. శ్రీలంక, పాకిసాన్, ఇంగ్లాండ్ ఒక్కోసారి ట్రోఫీలు గెలుచుకున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అన్ని ప్రపంచ కప్స్ లో విజయం సాధించిన ఆయా దేశాల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

 

వెస్టిండీస్ (1975)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1975 జూన్ 21
  • మ్యాచ్ జరిగిన వేదిక : లార్డ్స్ క్రికెట్ స్టేడియం
  • ఫైనల్ : ఆస్ట్రేలియా vs వెస్టిండీస్
  • వెస్టిండీస్ స్కోర్ : 291/8 (60)
  • ఆస్ట్రేలియా స్కోర్ : 274 (58.4)
  • విజేత : వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : క్లయివ్ లాయిడ్ (102 పరుగులు, ఒక వికెట్)

 

వెస్టిండీస్ (1979)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1975 జూన్ 23
  • మ్యాచ్ జరిగిన వేదిక : లార్డ్స్ క్రికెట్ స్టేడియం
  • ఫైనల్ : ఇంగ్లాండ్ vs వెస్టిండీస్
  • వెస్టిండీస్ స్కోర్ : 286/9 (60)
  • ఇంగ్లాండ్ స్కోర్ : 194 (51)
  • విజేత : వెస్టిండీస్ 92 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : వివియన్ రిచర్డ్స్ (138 పరుగులు)

 

ఇండియా (1983)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1983 జూన్ 25
  • మ్యాచ్ జరిగిన వేదిక : లార్డ్స్ క్రికెట్ స్టేడియం
  • ఫైనల్ : ఇండియా vs వెస్టిండీస్
  • ఇండియా స్కోర్ : 183 (54.4)
  • వెస్టిండీస్ స్కోర్ : 140 (52)
  • విజేత : ఇండియా 143 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : మొహిందర్ అమర్నాథ్ (26 పరుగులు, 3 వికెట్లు)

 

ఆస్ట్రేలియా (1987)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1987 నవంబర్ 8
  • మ్యాచ్ జరిగిన వేదిక : ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
  • ఫైనల్ : ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
  • ఆస్ట్రేలియా స్కోర్ : 253/5 (50)
  • ఇంగ్లాండ్ స్కోర్ : 246/8 (50)
  • విజేత : ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : డేవిడ్ బూన్ (75 పరుగులు)

 

పాకిస్తాన్ (1992)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1992 మార్చి 25 
  • మ్యాచ్ జరిగిన వేదిక : మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం, ఆస్ట్రేలియా
  • ఫైనల్ : పాకిస్తాన్ vs ఇంగ్లాండ్
  • పాకిస్తాన్ స్కోర్ : 249/6 (50)
  • ఇంగ్లాండ్ స్కోర్ :227 (49.2)
  • విజేత : పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : వసీం అక్రమ్ (33 పరుగులు. 3 వికెట్లు)

 

శ్రీలంక (1996)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1996 మార్చి 17 
  • మ్యాచ్ జరిగిన వేదిక : గడ్డాఫీ స్టేడియం, లాహోర్
  • ఫైనల్ : శ్రీలంక vs ఆస్ట్రేలియా
  • ఆస్ట్రేలియా స్కోర్ : 241 (50)
  • శ్రీలంక స్కోర్ :245/3 (46.2)
  • విజేత : శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : అరవింద డిసిల్వ (107 పరుగులు. 3 వికెట్లు)

 

ఆస్ట్రేలియా (1999)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 1999 జూన్ 20 
  • మ్యాచ్ జరిగిన వేదిక : లార్డ్స్ క్రికెట్ స్టేడియం
  • ఫైనల్ : పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా
  • పాకిస్తాన్ స్కోర్ : 132 (39)
  • ఆస్ట్రేలియా స్కోర్ :133/2 (20.1)
  • విజేత : ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : షేన్ వార్న్  (4 వికెట్లు)

 

ఆస్ట్రేలియా (2003)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 2003 మార్చి 23
  • మ్యాచ్ జరిగిన వేదిక : న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్బర్గ్
  • ఫైనల్ : ఆస్ట్రేలియా vs ఇండియా
  • ఆస్ట్రేలియా స్కోర్ : 359/2 (50)
  • ఇండియా స్కోర్ : 234 (39.2)
  • విజేత : ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : రికీ పాంటింగ్ (140 పరుగులు)

 

ఆస్ట్రేలియా (2007)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 2007 ఏప్రిల్ 28
  • మ్యాచ్ జరిగిన వేదిక : ఓవల్ గ్రౌండ్
  • ఫైనల్ : ఆస్ట్రేలియా vs శ్రీలంక
  • ఆస్ట్రేలియా స్కోర్ : 281/4 (38)
  • శ్రీలంక స్కోర్ : 215/8 (36)
  • విజేత : ఆస్ట్రేలియా 53 పరుగుల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ఆడమ్ గిల్క్రిస్ట్ (149 పరుగులు)

 

ఇండియా (2011)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 2011 ఏప్రిల్ 2
  • మ్యాచ్ జరిగిన వేదిక : వాంఖడే స్టేడియం, ముంబై
  • ఫైనల్ : ఇండియా vs శ్రీలంక
  • శ్రీలంక స్కోర్ : 274/6 (50)
  • ఇండియా స్కోర్ : 277/4 (48.2)
  • విజేత : ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : ఎమ్మెస్ ధోని (91 పరుగులు)

 

ఆస్ట్రేలియా (2015)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 2015 మార్చి 29
  • మ్యాచ్ జరిగిన వేదిక : మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, ఆస్ట్రేలియా
  • ఫైనల్ : ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్
  • న్యూజిలాండ్ స్కోర్ : 183 (45)
  • ఆస్ట్రేలియా స్కోర్ : 186/3 (33.1)
  • విజేత : ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : జేమ్స్ ఫాల్కనర్ (3 వికెట్లు)

 

ఇంగ్లాండ్ (2019)

  • మ్యాచ్ జరిగిన తేదీ : 2019 జులై 14 
  • మ్యాచ్ జరిగిన వేదిక : లార్డ్స్, లండన్
  • ఫైనల్ : ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్
  • న్యూజిలాండ్ స్కోర్ : 241/8 , 15/1
  • ఇంగ్లాండ్ స్కోర్ : 1241, 15/0
  • విజేత : మ్యాచ్ టై (Tie) కావడంతో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్లో విజయం
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : బెన్ స్టోక్స్ (84 పరుగులు, సూపర్ ఓవర్లో 8 పరుగులు)

 

ప్రపంచ క్రికెట్ రికార్డులు : World Cricket Records

 

వన్డేలు : One Days

  • అత్యధిక పరుగులు : సచిన్ టెండూల్కర్, ఇండియా (18426 పరుగులు. 452 ఇన్నింగ్స్, 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు. అత్యధిక స్కోర్ 200 పరుగులు)
  • అత్యధిక సెంచరీలు : 49, సచిన్ టెండూల్కర్ (ఇండియా)
  • అత్యధిక అర్ధ సెంచరీలు : 96, సచిన్ టెండూల్కర్ (ఇండియా)
  • అత్యధిక బ్యాటింగ్ సగటు : 69.31, HE వాన్ డెర్ డస్సెన్, దక్షిణాఫ్రికా (32 ఇన్నింగ్స్, 1525 పరుగులు)
  • అత్యధిక భాగస్వామ్యం : క్రిస్ గేల్-శామ్యూల్స్, వెస్టిండిస్ (2 వికెట్, 372 పరుగులు, జింబాబ్వేపై)
  • వేగవంతమైన 10000 పరుగులు : విరాట్ కోహ్లీ, భారత్ (205 ఇన్నింగ్స్)
  • అత్యధిక వికెట్లు : ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక (350 మ్యాచ్ లు, 534 వికెట్లు)
  • ఉత్తమ బౌలింగ్ : చమిందా వాస్, శ్రీలంక (8 ఓవర్లు, 3 మెయిడిన్లు, 19 రన్స్, 8 వికెట్లు, జింబాబ్వేపై)
  • అత్యధిక పరుగులు ఇచ్చిన వారు : లూయిస్, ఆస్ట్రేలియా (10 ఓవర్లలో 113 రన్స్. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా)
  • అత్యధిక టీమ్ స్కోర్ : ఇంగ్లాండ్ (498/4). ప్రత్యర్థి నెదర్లాండ్స్
  • అత్యధిక రన్స్ ఛేజింగ్ : దక్షిణాఫ్రికా (438/9). ప్రత్యర్థి ఆస్ట్రేలియా
  • అత్యల్ప స్కోర్ : జింబాబ్వే (35). ప్రత్యర్థి శ్రీలంక
  • యూఎస్ఏ  (35). ప్రత్యర్థి నేపాల్

 

టెస్టులు : Tests

  • అత్యధిక పరుగులు : సచిన్ టెండూల్కర్, ఇండియా (15921 పరుగులు. 329 ఇన్నింగ్స్, 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు. అత్యధిక స్కోర్ 248 పరుగులు)
  • అత్యధిక సెంచరీలు : 51, సచిన్ టెండూల్కర్ (ఇండియా)
  • అత్యధిక అర్ధ సెంచరీలు : 68, సచిన్ టెండూల్కర్ (ఇండియా)
  • అత్యధిక డబల్ సెంచరీలు : 12, బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా)
  • అత్యధిక ట్రిపుల్ సెంచరీలు : 2, బ్రాడ్మాన్ (ఆస్ట్రేలియా)
  • అత్యధిక డకౌట్లు : 45, కట్ని వాల్ష్ (వెస్టిండీస్)
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్ : 400 పరుగులు, బ్రియాన్ లారా (వెస్టిండీస్)
  • అత్యధిక వికెట్లు : ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక (133 మ్యాచ్ లు, 800 వికెట్లు)
  • ఉత్తమ బౌలింగ్ : జేసీ లేకర్, ఇంగ్లాండ్ (51.2 ఓవర్లు, 23 మెయిడెన్లు, 53 రన్స్, 10 వికెట్లు. ఎకానమీ 1.03). ప్రత్యర్థి ఆస్ట్రేలియా.
  • వేగవంతమైన 10000 పరుగులు : బ్రియాన్ లారా, వెస్టిండీస్ (111 మ్యాచ్ లు, 195 ఇన్నింగ్స్)
  • అత్యధిక వికెట్లు : ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక (133 మ్యాచ్ లు, 800 వికెట్లు)
  • ఒక ఇన్నింగ్స్ లో 10 వికెట్లు : జేసీ లేకర్, ఇంగ్లాండ్ (51.2 ఓవర్లు, 23 మెయిడెన్లు, 53 రన్స్, 10 వికెట్లు. ఎకానమీ 1.03). ప్రత్యర్థి ఆస్ట్రేలియా.

 

మేజర్ టోర్నమ్నెట్స్ 2023 : 2023 Major Tournaments

ఏడాది ప్రపంచ కప్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. దీనిని ఇండియాలోనే నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆసియా కప్, ఐపీఎల్ కూడా జరగనుంది. దీంతో పాటు వరల్డ్టెస్ట్ఛాంపియన్షిప్ఫైనల్కూడా ఉంది. ఒకసారి షెడ్యూల్ ని పరిశీలిద్దాం.

 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్ : మార్చి-మే 2023

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ : జూన్‌ 2023

ఆసియా కప్‌ 2023 : సెప్టెంబర్‌ 2023 (పాకిస్థాన్‌లో..)

ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ : అక్టోబర్‌/నవంబర్‌ 2023

 

ఈసారి క్రికెట్ వన్డే ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో క్రికెట్ ను అమితంగా ఇష్టపడే భారత అభిమానులకు కనువిందు కలగనుంది. గతంలో 1987, 1996, 2011లలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లతో కలిసి ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈసారి మొత్తం మ్యాచ్ లన్నీ ఇండియాలోనే జరగనున్నాయి. విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడంతో పాటు బౌలర్లు కూడా  రాణిస్తున్నారు. అయితే నిలకడలేమి అనేది వేధిస్తోంది. ఇండియా ఈసారి ప్రపంచ కప్ గెలవాలని కోట్లాది మంది ఆకాంక్షిస్తున్నారు.