SRH vs PBKS IPL PREDICTION: ఎస్ ఆర్ హెచ్ vs పీబీకేఎస్ ప్రిడిక్షన్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ XI జట్లు తలపడినప్పుడు సన్ రైజర్స్ జట్టుదే పైచేయి. పంజాబ్ జట్టుతో తలపడిన 20 మ్యాచ్ ల్లో 13 సార్లు గెలుపొందింది.
SRH vs PBKS IPL PREDICTION: ఎస్ ఆర్ హెచ్ vs పీబీకేఎస్ ప్రిడిక్షన్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ XI జట్లు తలపడినప్పుడు సన్ రైజర్స్ జట్టుదే పైచేయి. పంజాబ్ జట్టుతో తలపడిన 20 మ్యాచ్ ల్లో 13 సార్లు గెలుపొందింది.
సన్ రైజర్స్ జట్టుదే పైచేయి
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ XI జట్లు తలపడినప్పుడు సన్ రైజర్స్ జట్టుదే పైచేయిగా ఉంది. పంజాబ్ జట్టుతో తలపడిన 20 మ్యాచ్ ల్లో 13 సార్లు గెలుపొందింది. ఈ ఏడాది 2023 లో 17 ఏప్రిల్, 22 మే న జరగనున్నాయి. పంజాబ్ జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా రెండు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం.
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)... గతంలో డెక్కన్ ఛార్జర్స్ గా ఉండేది. అయితే ఆ టీమ్ రద్దవడంతో సన్ నెట్వర్క్ 25 ఆక్టోబరు, 2012 న కొనుగోలు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గా మార్చింది.
తగిన మూల్యం చెల్లించుకున్న జట్టు
గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో వెనుక ముందు ఆలోచించకుండా కొన్న ఆటగాళ్ల వల్ల జట్టుకి ఏ ప్రయోజనం లేక తగిన మూల్యం చెల్లించుకుంది. కేన్ విలియమ్సన్ ను రిటెయిన్ చేసుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. సన్ రైజర్స్ పలు విభాగాల్లో బలహీనంగా ఉండేది. ముఖ్యంగా ఓపెనింగ్… ఫినిషర్… స్పిన్ విభాగాల్లో చాలా వీక్ గా ఉండేది. మినీ వేలం ద్వారా ఈ బలహీనతలను సన్ రైజర్స్ సరి చేసుకుంది. ఎప్పుడూ ఖర్చు పెట్టని ఫ్రాంచైజీ ఈసారి కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను దక్కించుకుంది.
మిడిలార్డర్ ను బలోపేతం చేయడానికి హ్యరీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ లను కొనుగోలు చేసింది. వీరిద్దరికీ మ్యాచ్ ఫినిషర్లుగా మంచి పేరుంది. ఓపెనింగ్ బలంగా ఉండడం కోసం భారత బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ను కొనుగోలు చేసి ఓపెనింగ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టు నుంచి వెళ్లిపోవడంతో స్పిన్నర్ స్థానాన్ని భర్తీ చేయడానికి మణికట్టు సిన్నర్ ఆదిల్ రషీద్ ను జట్టులోకి తీసుకుంది.
2012 డిసెంబర్ 18 న SRH ప్రయాణం ఐపీఎల్ లో మొదలయింది. 2013 సీజన్ నుంచి ఆడడం ప్రారంభించింది. అప్పటి నుంచి 2016 సీజన్లో మాత్రమే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2022 సీజన్లో పేలవ ప్రదర్శనతో 8వ స్థానంతో ముగించింది. 2023 సీజన్లో ఎలాగైనా టైటిల్ ని గెలవాలని భావించి క్రికెట్ లెజెండ్ బ్రెయిన్ లారాను వారి కొత్త ప్రధాన కోచ్గా నియమించింది. బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్ను, ముత్తయ్య మురళీధరన్ను స్పిన్ బౌలింగ్ కోచ్, స్ట్రాటజీ కోచ్గా నియమించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్
కేన్ విలియంసన్, నికోలస్ పూరన్, జగదీష్ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రోమారియో షెఫర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్, అబ్దుల్ సమద్, ఐడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫాజల్ హక్ ఫరూఖి, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టీ. నటరాజన్, ఉమ్రాన్ మలిక్.
2023 సీజన్ లో సన్ రైజర్స్ ప్లేయింగ్ XI (అంచనా) : అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, బ్రూక్స్, గ్లెన్ ఫిలిప్స్ లేదా సెన్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
SRH ఐపీఎల్ 2023 ఆటగాళ్ల కూర్పు
- వికెట్ కీపర్లు: గ్లెన్ ఫిలిప్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఉపేంద్ర సింగ్ యాదవ్, హెన్రిచ్ క్లాసిన్.
- బ్యాట్స్మెన్లు: అబ్దుల్ సమద్, ఐడెన్ మార్కరమ్, రాహుల్ త్రిపాఠి, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, హ్యారి బ్రూక్.
- ఆల్-రౌండర్లు: అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మయాంక్ డాగర్, సాన్వీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాన్త్ శర్మ.
- బౌలర్లు: ఫాజల్ హక్ ఫరూఖి, మార్కో జాన్సన్, కార్తీక్ త్యాగి, భువేశ్వర్ కుమార్, టీ. నటరాజన్, ఉమ్రాన్ మలిక్, అకిల్ హొసీన్, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్.
ఐపీఎల్ అన్ని సీజన్లలో SRH టీమ్ ప్రదర్శన
డేవిడ్ వార్నర్ సారధ్యంలోని జట్టు 2016 లో టైటిల్ సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టును ఫైనల్లో ఓడించింది. 2013 లో 4వ స్థానం, 2014, 2015 లో 6వ స్థానం, 2017 లో 3వ స్థానం, 2018 లో రన్నరప్, 2019 లో 4వ స్థానం, 2020 లో 3వ స్థానం, 2021, 2022 లో 8వ స్థానంలో నిలిచింది
టాప్ 5 రికార్డులు
- అత్యధిక టీమ్ టోటల్ రన్స్ : 2016 లో 7 వికెట్లను 208 పరుగులు (208/7)
- అత్యధిక అర్ధ శతకాలు (50) : 2016 లో డేవిడ్ వార్నర్ 17 మ్యాచ్ ల్లో 9 అర్ధ శతకాలు
- ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 60.57 సగటు, 151.42 స్ట్రయిక్ రేట్ తో 848 పరుగులు చేసాడు.
- మొదటి వికెట్ అత్యధిక భాగస్వామ్యం : 2019 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై 185 పరుగులు
- అత్యధిక 50+ స్కోర్స్ : డేవిడ్ వార్నర్ 150 ఐపీఎల్ గేమ్స్ లో 54 సార్లు 50+ స్కోర్స్ చేసాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.
సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ XI ముఖాముఖి
సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ XI జట్లు 20 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ జట్టు 13 సార్లు, పంజాబ్ జట్టు 7 సార్లు తలపడ్డాయి. హైదరాబాద్ అత్యధిక స్కోర్ 212 కాగా, పంజాబ్ స్కోర్ 211 పరుగులు. అత్యల్ప స్కోర్ హైదరాబాద్ 114 కాగా, పంజాబ్ జట్టు స్కోర్ 119 పరుగులు.
పంజాబ్ కింగ్స్ XI
కోచ్ ల మార్పు టైటిల్ గెలిచేనా?
పంజాబ్ జట్టు 2014లో జార్జ్ బెయిలీ సారథ్యంలో ఫైనల్కు దూసుకెళ్లింది. ఆ తరువాత నుంచి జరిగిన 8 సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్ దశకు కూడా చేరుకోలేదు. 2022 సీజన్లో జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించాడు. ఈ 2023 సీజన్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. గతంలో పంజాబ్ కింగ్స్ కోచ్ బాధ్యతలను నిర్వహించిన అనిల్ కుంబ్లేని మార్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కోచ్ గా ఉన్న ట్రెవర్ బేలిస్ను ప్రధాన కోచ్గా నియమించారు. ఇంగ్లాండ్ జట్టు 2019లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆ జట్టుకి కూడా కోచ్ గా ఉన్నది బేలిస్ కావడం విశేషం. దీంతో తమ జట్టు ఈసారి విజయం సాధిస్తుందని ఫ్రాంచైజీ సహా యజమాని వాడియా ఆశాభావం వ్యక్తం చేశారు.
కెప్టెన్లను మార్చే పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక కెప్టెన్లను మార్చిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. టైటిల్ గెలవకపోవడంతోనే ఇలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. టోర్నీలో 14 సీజన్లలో ఈ జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్కు చేరుకోగలిగింది. 2018 నుంచి పంజాబ్ కింగ్స్ రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ సారధ్యంలో మంచి ప్రదర్శన చేసింది.
ఆల్ రౌండర్లతో నిండిన పంజాబ్
పంజాబ్ జట్టులో బ్యాట్స్మెన్లకు, ఆల్ రౌండర్ల కొదవ లేదు. అయితే పంజాబ్ జట్టులో నిలకడ లోపించడంతో కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తుంది. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో రూ.18.50 కోట్లు వెచ్చించి సామ్ కరన్ ను దక్కించుకుంది. దిగ్గజ బ్యాట్స్మెన్లు శిఖర్ ధావన్, బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్, షారుఖ్ ఖాన్ వంటి వారు రాణిస్తే ఈసారి తాము టైటిల్ గెలుస్తామనే ధీమాతో ఫ్రాంచైజీ ఉంది.
అత్యల్ప, అత్యధిక స్కోర్లు
- అత్యల్ప స్కోర్ : 2015 మే 6న, 2018 మే 14న జరిగిన మ్యాచుల్లో 88 పరుగులకే రెండు సార్లు ఆలౌట్
- అత్యధిక స్కోర్ : 2011 మే 17న జరిగిన మ్యాచ్ లో 232/2 పరుగులు
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వీరులు
- శిఖర్ ధావన్ : 206 మ్యాచ్ లు 6244 పరుగులు. 2 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు
- బెయిర్స్టో : 39 మ్యాచ్ లు 1291 పరుగులు. ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు
- సామ్ కరన్ : 32 మ్యాచ్ లు, 337 పరుగులు, 32 వికెట్లు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
- పీయూష్ చావ్లా : 87 ఇన్నింగ్స్ లో 84 వికెట్లు. 4/17 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.
- సందీప్ శర్మ : 61 ఇన్నింగ్స్ లో 73 వికెట్లు. 4/20 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.
టాప్ 5 రికార్డులు
- అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ : 122 (58 బాల్స్, 12 ఫోర్లు, 8 సిక్సులు)
- ప్లే ఆఫ్స్ కి 7 సీజను చేరుకోని ఏకైక జట్టుగా చెత్త రికార్డు
- సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 8 వికెట్లకు 214 పరుగులు (214/8)
- 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ పై అతి తక్కువ పరుగులకు ఆలౌట్ (88)
- 2009 సీజన్లో యువరాజ్ సింగ్ రెండు జట్లు ఆర్సీబీ, సీఎస్కే జట్లపై హ్యాట్రిక్ వికెట్లు
పంజాబ్ కింగ్స్ జట్టు..
శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ టైడ్, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI (అంచనా) : శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబాడ, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప
పంజాబ్ కింగ్స్ XI ఐపీఎల్ 2023 జట్టు కూర్పు
- వికెట్ కీపర్లు : జానీ బెయిర్స్టో, ప్రభసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.
- బ్యాటర్లు : శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, షారుక్ ఖాన్, అథర్వ తైదే, హర్ప్రీత్ భాటియా.
- ఆల్ రౌండర్లు: సామ్ కరన్, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికందర్ రజా, శివమ్ సింగ్, మోహిత్ రాథీ.
- బౌలర్లు : అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్,, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, విద్వాత్ కవేరప్ప.
పంజాబ్ కింగ్స్ XI 2023 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. రెండు జట్లలోనూ అగ్ర శ్రేణి బ్యాట్స్మెన్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారు. హైదరాబాద్ జట్టు ఒకసారి టైటిల్ నెగ్గి మరోసారి ఫైనల్ కి చేరుకుంది. పంజాబ్ జట్టు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేక పోయింది. అయితే ఈసారి మాత్రం గట్టిగానే ప్రయత్నించి టైటిల్ గెలవాలని రెండు జట్లూ, అభిమానులు ఆశిస్తున్నారు.
crickplayers ని డ్రీమ్11 కి ప్రత్యామ్నాయంగా ఎందుకు ఎంచుకోవాలి
crickplayers లో మీరు క్రికెట్కు సంబంధించిన అన్ని వివరాలను పొందుతారు. మీరు ఏ ఇతర వెబ్సైట్లో లభించని సలహాలు, ఆటగాళ్ల వివరాలు, గత మ్యాచ్ ల విజయాలు, ఓటములు అన్నీ కూడా సంబంధిత నిపుణలచే అందిస్తారు. మ్యాచ్ కి సంబంధించి విజయాల అంచనా (భవిష్యవాణి) అన్ని సైట్ల కంటే ఖచ్చితమైన వివరణ అందిస్తుంది. ఇక్కడ వారి కస్టమర్ సపోర్ట్ 24/7 అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా వాటిని పరిష్కరిస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి గేమ్ను ఆడే అవకాశాన్ని ఇస్తుంది.