Rcb vs Pbks dream11 prediction : రాయల్ ఛాలెంజర్స్ vs పంజాబ్ కింగ్స్ డ్రీమ్11 భవిష్యవాణి
ఐపీఎల్... క్రికెట్ ప్రేమికులను కనువిందు పరిచేందుకు రానుంది. బ్యాటింగ్ మెరుపులు, ఫీల్డర్ల విన్యాసాలు, బౌలర్ల బౌన్సర్లను తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ vs పంజాబ్ కింగ్స్ డ్రీమ్11 భవిష్యవాణి
ఐపీఎల్... క్రికెట్ ప్రేమికులను కనువిందు పరిచేందుకు రానుంది. బ్యాటింగ్ మెరుపులు, ఫీల్డర్ల విన్యాసాలు, బౌలర్ల బౌన్సర్లను తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు.
మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 వ సీజన్లో ఆడే 10 జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ XI కూడా ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో ఈ రెండు జట్లు తలపడిన సందర్భాలు, ఎవరు ఎక్కువ మ్యాచ్ లు గెలిచారు? హెడ్-టు-హెడ్ గణాంకాలను పరిశీలిద్దాం. మొత్తం మీద ఇరు జట్లూ 30 సార్లు తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 17 మ్యాచుల్లో, ఆర్సీబీ జట్టు 13 మ్యాచుల్లో గెలుపొందాయి.
ఆర్సీబీ vs పంజాబ్ కింగ్స్ డ్రీమ్11 31వ మ్యాచ్
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఈ ఏడాది 2023 మార్చ్ 26 వ తేదీన 31 వ సారి తలపడనున్నాయి. ఇరు జట్లలోనూ దిగ్గజ ఆటగాళ్లకు కొదవలేదు. అయితే ముఖాముఖీ తలపోరులో మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు పైచేయిగా ఉంది. 15 సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ గానీ పంజాబ్ కింగ్స్ గానీ టైటిల్ గెలవలేదు. ఇరుజట్లకూ సంబంధించిన డ్రీమ్11 భవిష్యవాణిని ఒకసారి పరిశీలిద్దాం.
పంజాబ్ కింగ్స్ XI
కోచ్ ల మార్పు టైటిల్ గెలిచేనా?
పంజాబ్ జట్టు 2014లో జార్జ్ బెయిలీ సారథ్యంలో ఫైనల్కు దూసుకెళ్లింది. ఆ తరువాత నుంచి జరిగిన 8 సీజన్లలో ఆ జట్టు ప్లేఆఫ్ దశకు కూడా చేరుకోలేదు. 2022 సీజన్లో జట్టు కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించాడు. ఈ 2023 సీజన్ కి శిఖర్ ధావన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. గతంలో పంజాబ్ కింగ్స్ కోచ్ బాధ్యతలను నిర్వహించిన అనిల్ కుంబ్లేని మార్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కోచ్ గా ఉన్న ట్రెవర్ బేలిస్ను ప్రధాన కోచ్గా నియమించారు. ఇంగ్లాండ్ జట్టు 2019లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆ జట్టుకి కూడా కోచ్ గా ఉన్నది బేలిస్ కావడం విశేషం. దీంతో తమ జట్టు ఈసారి విజయం సాధిస్తుందని ఫ్రాంచైజీ సహా యజమాని వాడియా ఆశాభావం వ్యక్తం చేశారు.
కెప్టెన్లను మార్చే పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక కెప్టెన్లను మార్చిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. టైటిల్ గెలవకపోవడంతోనే ఇలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. టోర్నీలో 14 సీజన్లలో ఈ జట్టు కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్కు చేరుకోగలిగింది. 2018 నుంచి పంజాబ్ కింగ్స్ రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ సారధ్యంలో మంచి ప్రదర్శన చేసింది.
ఆల్ రౌండర్లతో నిండిన పంజాబ్
పంజాబ్ జట్టులో బ్యాట్స్మెన్లకు, ఆల్ రౌండర్ల కొదవ లేదు. అయితే పంజాబ్ జట్టులో నిలకడ లోపించడంతో కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తుంది. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో రూ.18.50 కోట్లు వెచ్చించి సామ్ కరన్ ను దక్కించుకుంది. దిగ్గజ బ్యాట్స్మెన్లు శిఖర్ ధావన్, బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్, షారుఖ్ ఖాన్ వంటి వారు రాణిస్తే ఈసారి తాము టైటిల్ గెలుస్తామనే ధీమాతో ఫ్రాంచైజీ ఉంది.
అత్యల్ప, అత్యధిక స్కోర్లు
- అత్యల్ప స్కోర్ : 2015 మే 6న, 2018 మే 14న జరిగిన మ్యాచుల్లో 88 పరుగులకే రెండు సార్లు ఆలౌట్
- అత్యధిక స్కోర్ : 2011 మే 17న జరిగిన మ్యాచ్ లో 232/2 పరుగులు
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వీరులు
- శిఖర్ ధావన్ : 206 మ్యాచ్ లు 6244 పరుగులు. 2 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు
- బెయిర్స్టో : 39 మ్యాచ్ లు 1291 పరుగులు. ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు
- సామ్ కరన్ : 32 మ్యాచ్ లు, 337 పరుగులు, 32 వికెట్లు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
- పీయూష్ చావ్లా : 87 ఇన్నింగ్స్ లో 84 వికెట్లు. 4/17 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.
- సందీప్ శర్మ : 61 ఇన్నింగ్స్ లో 73 వికెట్లు. 4/20 ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.
టాప్ 5 రికార్డులు
- అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ : 122 (58 బాల్స్, 12 ఫోర్లు, 8 సిక్సులు)
- ప్లే ఆఫ్స్ కి 7 సీజను చేరుకోని ఏకైక జట్టుగా చెత్త రికార్డు
- సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 8 వికెట్లకు 214 పరుగులు (214/8)
- 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ పై అతి తక్కువ పరుగులకు ఆలౌట్ (88)
- 2009 సీజన్లో యువరాజ్ సింగ్ రెండు జట్లు ఆర్సీబీ, సీఎస్కే జట్లపై హ్యాట్రిక్ వికెట్లు
పంజాబ్ కింగ్స్ జట్టు..
శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ టైడ్, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI : శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబాడ, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప
పంజాబ్ కింగ్స్ XI ఐపీఎల్ 2023 జట్టు కూర్పు
- వికెట్ కీపర్లు : జానీ బెయిర్స్టో, ప్రభసిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.
- బ్యాటర్లు : శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, షారుక్ ఖాన్, అథర్వ తైదే, హర్ప్రీత్ భాటియా.
- ఆల్ రౌండర్లు: సామ్ కరన్, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికందర్ రజా, శివమ్ సింగ్, మోహిత్ రాథీ.
- బౌలర్లు : అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్,, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, విద్వాత్ కవేరప్ప.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)
ఈసారైనా టైటిల్ 'బెంగ' తీరుతుందా
ప్రతీ సారి ‘ఈ సాల కప్ నమదే’ (ఈ సారి కప్పు మాదే) అంటూ బరిలోకి దిగడం..కప్ రేసు నుంచి తప్పుకోవడం ఆర్సీబీకి అలవాడుగా మారింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందని ద్రాక్ష పండులాగానే ఉంది. ప్రతి సీజన్లో ఎన్నో ఆశలతో టోర్నమెంట్లో అడుగుపెట్టడం, తీరా పేలవ ప్రదర్శనతో చతికిలపడడం పరిపాటిగా మారింది. ప్రపంచ అగ్ర శ్రేణి బ్యాటర్లు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్, కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్ వంటి ఎందరో జట్టుతో కలిసి ఆడినా టైటిల్ మాత్రం నెగ్గలేదు.
గత ఏడాది 2022 సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరినప్పటికీ నాకౌట్ దశలో తేలిపోయింది. ఇదే సీజన్లో ఒక జట్టు తరపున టాప్-3 బ్యాట్స్మెన్ ఎక్కువసార్లు డకౌట్ అయిన జట్టుగా 'చెత్త' రికార్డు మూటకట్టుకుంది. టాప్-3 బ్యాట్స్మెన్లు ఆరుసార్లు డకౌట్ అయ్యారు. ఇందులో అనూజ్ రావత్ మూడుసార్లు, కోహ్లి రెండుసార్లు, డుప్లెసిస్ ఒకసారి డకౌట్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు రెండుసార్లు నమోదు చేసిన జట్టుగా ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది. అత్యల్ప స్కోర్ లో కూడా ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.
అత్యధిక టీమ్ స్కోర్
- 2013లో పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు (263/5) చేసింది.
- 2016లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు (2248/5) చేసింది.
అత్యల్ప టీమ్ స్కోర్
- 2017లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 49 పరుగులకు ఆలౌట్ (1st)
- 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 68 పరుగులకు ఆలౌట్ (6th)
అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లు
- విరాట్ కోహ్లీ : 223 మ్యాచ్ లు, 6624 పరుగులు, 5 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు. 113 అత్యధిక స్కోర్
- ఫాఫ్ డుప్లెసిస్ : 116 మ్యాచ్ లు, 3403 పరుగులు, 25 అర్ధ సెంచరీలు, 96 అత్యధిక స్కోర్
- మాక్స్వెల్ : 110 మ్యాచు లు, 2319 పరుగులు, 13 అర్ధ సెంచరీలు, 23 వికెట్లు
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
- యజువేంద్ర చాహల్ : 113 మ్యాచ్ లు, 139 వికెట్లు.
- హర్షల్ పటేల్ : 66 మ్యాచ్ లు, 85 వికెట్లు.
టాప్ 5 రికార్డులు
- 1. అత్యధిక టీమ్ టోటల్ : 263/5 (పూణే వారియర్స్ పై)
- 2. వ్యక్తిగత స్కోరు : క్రిస్ గేల్ : 175 నాటౌట్ (66 బాల్స్, 13 ఫోర్లు, 17 సిక్సర్లు)
- 3. అత్యల్ప టీమ్ స్కోర్ : 49 ఆలౌట్ (9.4 ఓవర్లకు. ప్రత్యర్థి : కోల్కతా నైట్ రైడర్స్)
- 4. ఒక సీజన్లో అత్యధిక పరుగులు : విరాట్ కోహ్లీ (16 మ్యాచుల్లో 973 పరుగులు)
- 5. అత్యధిక పార్టనర్ షిప్ : 229 (2016, డివిలియర్స్, కోహ్లీ. ప్రత్యర్థి : గుజరాత్ లయన్స్)
ఆర్సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, వానిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ , మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హెజిల్వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్స్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
ఆర్సీబీ ఐపీఎల్ 2023 జట్టు కూర్పు
- వికెట్ కీపర్లు : అనూజ్ రావత్, దినేష్ కార్తీక్.
- బ్యాటర్లు : ఫాఫ్ డుప్లెసిస్, ఫిన్ అలెన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సుయాశ్ ప్రభు దేశాయ్, విల్ జాక్స్.
- ఆల్-రౌండర్స్ : వనిందు హసరంగా, మహిపాల్ లామ్రార్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, సోను యాదవ్, మనోజ్ భాండగే.
- బౌలర్లు : ఆకాష్ డీప్, జోష్ హాజిల్వుడ్, సిద్దార్థ్ కౌల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, డేవిడ్ విల్లీ, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, రీస్ టోప్లే, హిమాన్షు శర్మ.
ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI : ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లామ్రార్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్వుడ్, మహమ్మద్ సిరాజ్.
పంజాబ్ కింగ్స్ XI మార్చి 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మొదటి రెండు మ్యాచ్ లు ఆడిన తరువాత తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. ముంబైలోని డా. డివై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. రెండు జట్లలోనూ అగ్ర శ్రేణి బ్యాట్స్మెన్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే రెండు జట్లకూ నిలకడలేమి కారణంగా ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయాయి. అయితే ఈసారి మాత్రం గట్టిగానే ప్రయత్నించి టైటిల్ నెగ్గాలని ఇరుజట్లూ, అభిమానులు సైతం తమ జట్లు ఈసారైనా టైటిల్ నెగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు.