2022లో భారత్ లో అగ్రశ్రేణి క్రికెటర్లు : Top Indian Cricketers in 2022

భారత్ ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఆడినా దానికి ఉన్న క్రేజే వేరు. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఎగబడతారు. అందుకు తగ్గట్టుగా ఆటగాళ్లు కూడా తమ అద్భుతమైన ఆటతో అలరిస్తుంటారు.

2022లో భారత్ లో అగ్రశ్రేణి క్రికెటర్లు : Top Indian Cricketers in 2022

2022లో భారత్ లో అగ్రశ్రేణి క్రికెటర్లు : Top Indian Cricketers in 2022

భారత్ ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఆడినా దానికి ఉన్న క్రేజే వేరు. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఎగబడతారు. అందుకు తగ్గట్టుగా ఆటగాళ్లు కూడా తమ అద్భుతమైన ఆటతో అలరిస్తుంటారు.

 

పరుగుల వరద పారించిన యువ క్రికెటర్లు : Young Cricketers made Tons of runs

  ఏడాది 2022 క్యాలెండర్ సంవత్సరంలో శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లు వెయ్యికి పైగా పరుగులను సాధించారు. సీనియర్ క్రికెటర్లు సైతం తమ బ్యాట్లకు పదును చెప్పారు. బౌలర్లు సైతం తమ బంతులతో హడలెత్తించి జట్టు విజయాల్లో భాగస్వాములయ్యారు. మేజర్ టోర్నమెంట్లలో (ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్) ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అయితే ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం అద్భుత ప్రదర్శనతో మంచి విజయాలు నమోదు చేసింది.

 

భారత క్రికెటర్లు 2022 లో టెస్టులు, వన్డేలు, టీ20 లు మొత్తం మూడు ఫార్మాట్లు కలిపి 71 మ్యాచ్ లు ఆడారు. ఎంతో మంది యువ ఆటగాళ్లు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అభిమానులను అలరించారు. మరి కొందరు జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకునే అవకాశం కల్పించుకున్నారు.

 

విజయాలు... ఓటములు...

 

ఆసియా కప్ టోర్నమెంట్లో గ్రూప్ దశలోనే నాక్ అవుట్ అయింది. టీ20 ప్రపంచ కప్ లో సెమి ఫైనల్ లో ఓడి టైటిల్ రేస్ నుండి నిష్క్రమించింది.

 

ఆసియా కప్

 గ్రూప్ స్టేజ్

ఆడినవి : 2

గెలిచినవి : 2

 

సూపర్ ఫోర్:

ఆడినవి : 3

గెలిచినవి : 1

ఓడినవి : 2

  •  సూపర్ ఫోర్ లో కీలకమైన పోరులో పాకిస్థాన్ పై ఓటమి ఎదురవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 

ఐసీసీ టీ20 ప్రపంచ కప్...

 ఆడినవి : 5 

గెలిచినవి : 4

ఓడినవి : 1

 

  • ఇంగ్లాండ్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓటమి చెందింది. దీంతో ఫైనల్ కు చేరలేక టోర్నీ నుంచి వెనుదిరిగింది.
  •  భారత్ ఏడాది ఆడిన 40 టీ20 మ్యాచుల్లో 28 మ్యాచులు గెలిచింది. 7 టెస్టుల్లో 4 మ్యాచ్ ల్లో గెలిచింది. 24 వన్డేలు ఆడి 14 మ్యాచుల్లో గెలిచింది.

 

అత్యధిక పరుగుల వీరులు

 

1. శ్రేయాస్ అయ్యర్

 ఆడిన ఇన్నింగ్స్  : 40

పరుగులు : 1609

సెంచరీలు : 1

అర్ధ సెంచరీలు : 14

అత్యధిక స్కోర్ : 113

 

2. సూర్య కుమార్ యాదవ్

 ఆడిన ఇన్నింగ్స్  : 43

పరుగులు : 1424

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 10

అత్యధిక స్కోర్ : 117

 

3. రిషబ్ పంత్

 ఆడిన ఇన్నింగ్స్  : 43

పరుగులు : 1380

సెంచరీలు : 3

అర్ధ సెంచరీలు : 7

అత్యధిక స్కోర్ : 146

 

4. విరాట్ కోహ్లీ

 ఆడిన ఇన్నింగ్స్  : 42

పరుగులు : 1348

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 11

అత్యధిక స్కోర్ : 122

 

5. రోహిత్ శర్మ

 ఆడిన ఇన్నింగ్స్  : 40

పరుగులు : 995

సెంచరీలు : 0

అర్ధ సెంచరీలు : 6

అత్యధిక స్కోర్ : 76

 

6. ఇషాన్ కిషన్

 ఆడిన ఇన్నింగ్స్  : 23

పరుగులు : 893

సెంచరీలు : 1

అర్ధ సెంచరీలు : 5

అత్యధిక స్కోర్ : 210

 

7. కేఎల్ రాహుల్

 ఆడిన ఇన్నింగ్స్  : 33

పరుగులు : 822

సెంచరీలు : 0

అర్ధ సెంచరీలు : 9

అత్యధిక స్కోర్ : 73

 

8. శుభమన్ గిల్

 ఆడిన ఇన్నింగ్స్  : 18

పరుగులు : 816

సెంచరీలు : 2

అర్ధ సెంచరీలు : 4

అత్యధిక స్కోర్ : 130

 

వీరే కాకుండా హార్దిక్ పాండ్యా 707 పరుగులు, శిఖర్ ధావన్ 688 పరుగులు చేసారు. వచ్చే ఏడాది ఆసియా కప్, ప్రపంచ కప్ వంటి మేజర్ టోర్నమెంట్లు మాత్రమే కాకుండా వివిధ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడనుంది.

2022 లో భారత బౌలర్ల గణాంకాలు : Indian Team Bowlers 2022 

మ్యాచ్ గెలవాలంటే బ్యాట్ తో పాటు బంతితో కూడా అద్భుతాలు జరగాలి. నిప్పులు చెరిగే బంతులు, బొంగరంలా గింగరాలు తిప్పి వికెట్లు సాధించే స్పిన్నర్లు భారత్ సొంతం. ప్రత్యర్థులను తమ బౌలింగ్ తో నియంత్రించి భారత్ కు విజయాలను అందించడంలో బౌలర్లు విశేషమైన ప్రతిభను కనబరుసున్నారు. భారత క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన కొందరు బౌలర్ల గణాంకాలను ఒకసారి పరిశీలిద్దాం.

  • అనిల్ కుంబ్లే 619 వికెట్లు (ఒక టెస్టు మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్ 14/149) తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 35 సార్లు, 10 వికెట్ల ఫీట్ ను 8 సార్లు సాధించి అత్యుత్తమ బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.
  • ఆర్.అశ్విన్ 457 వికెట్లు (ఒక టెస్టు మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్ 13/140) తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 31 సార్లు, 10 వికెట్ల ఫీట్ ను 7 సార్లు సాధించి అత్యుత్తమ బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు.
  • కపిల్ దేవ్ 434 వికెట్లు (ఒక టెస్టు మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్ 11/146) తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 23 సార్లు, 10 వికెట్ల ఫీట్ ను 2 సార్లు సాధించాడు.
  • హర్భజన్ సింగ్ 417 వికెట్లు (ఒక టెస్టు మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్ 15/217) తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 25 సార్లు, 510వికెట్ల ఫీట్ ను 5 సార్లు సాధించాడు.
  • ఇషాంత్ శర్మ 311 వికెట్లు (ఒక టెస్టు మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్ 10/108) తీసాడు. 5 వికెట్ల ఫీట్ ను 11 సార్లు, 10వికెట్ల ఫీట్ ను ఒకసారి తీసాడు.