రికార్డుల వేటలో ఆటగాళ్లు : Players waiting to create the records

ధనాధన్ పొట్టి క్రికెట్ ఐపీఎల్ 16వ సీజన్ (IPL 16th season) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా రికార్డుల (records) కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

రికార్డుల వేటలో ఆటగాళ్లు : Players waiting to create the records

రికార్డుల వేటలో ఆటగాళ్లు : Players waiting to create the records 

ధనాధన్ పొట్టి క్రికెట్ ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతి సీజన్ మాదిరిగానే సీజన్లో కూడా రికార్డుల (records) కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

రికార్డులపై కన్నేసిన ధోని : Dhoni waiting for records

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)... ఐపీఎల్ లో ముంబై తరువాత విజయవంతమైన జట్టుగా (successful team) పేరొందింది. జట్టును ముందుంచి నడిపించడంలో కెప్టెన్ ధోని (Dhoni) ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికి నాలుగు ఐపీఎల్ టైటిళ్లు (4 IPL titles) జట్టుకు అందించాడు. మిస్టర్ కూల్ (Mr. Cool) ధోని అంటే చెన్నైలోని క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచం నలుమూలల (worldwide) నుండి కోట్లలో అభిమానిస్తారు. ధోని ముందు కూడా కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.

 

ఐపీఎల్లో ఇప్పటివరకు ధోనీ (Dhoni) 39.19 బ్యాటింగ్ సగటుతో (batting average) 4,978 పరుగులు చేశాడు. వీటిలో 23 అర్ధసెంచరీలు (23 half-centuries) ఉన్నాయి.అత్యధికంగా 84 పరుగుల స్కోరు చేశాడు. 5వేల పరుగులు పూర్తి చేయడానికి ధోని ఇంకా 22 పరుగులు దూరంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకూ మొత్తం 196 మ్యాచ్లకు నాయకత్వం (196 matches as a captain) వహించాడు. మరో నాలుగు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరిస్తే మొత్తం 200 మ్యాచ్లకు నాయకత్వం వహించిన మొట్టమొదటి ఆటగాడిగా (1st captain) ధోని నిలవనున్నాడు.

 

ఐపీఎల్ లో ధోని సాధించిన రికార్డులు : Dhoni records in IPL

కెప్టెన్గా ఐపీఎల్లో 4,500కు పైగా పరుగులు (4,556) చేసిన ఆటగాళ్లలో ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. చైన్నై సూపర్ కింగ్స్ (CSK) తరుపున ధోని 199 సిక్సర్లను (Dhoni 199 sixes) బాదాడు. ఇంకో సిక్సర్ కొడితే 200 సిక్సులు కొట్టిన నాలుగో బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టిస్తాడు. ఆర్సీబీకి (RCB) చెందిన క్రిస్ గేల్ (Gayle) 239, ఎబి డివిలియర్స్ (AB De Villiers) 238, ముంబై ఇండియన్స్ కి (MI) చెందిన  కీరన్ పొలార్డ్ (Polard) 223 సిక్సర్లను కొట్టారు. ఒక టీమ్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ధోనీ పేరునే ఉంది. ధోని ఆర్సీబీపై (RCB) అత్యధికంగా 31 ఇన్నింగ్స్లో 838 పరుగులు చేశాడు (31 innings, 838 runs). అతని తరువాతి స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ (Warner) 820 పరుగులు చేశాడు. మార్చి 31 డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో (Gujarat Titans) జరిగే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ (starting match) లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

 

రికార్డులకు చేరువలో రోహిత్ : Rohit nearing the records

ఐపీఎల్ లో ధోని కంటే ముందు అత్యధిక టైటిళ్లను (most IPL titles) తన జట్టుకు అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ (Rohit Sharma) నిలిచాడు. ముంబై ఇండియన్స్ (MI) కు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ ఐపీఎల్ లో పలు రికార్డులకు (IPL records) చేరువలో ఉన్నాడు. అత్యధికంగా తన జట్టుకు 5 టైటిళ్లు అందించిన కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహి శర్మ ఇప్పటివరకూ 227 ఐపీఎల్ మ్యాచ్ల్లో (227 IPL matches) 30.30 బ్యాటింగ్ సగటుతో 5,879 పరుగులు చేశాడు. ఇందులో 40 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ 2012 లో కోల్కతా నైట్రైడర్స్తో (KKR) జరిగిన మ్యాచ్లో సెంచరీ (109) సాధించాడు. రోహిత్ 6,000 పరుగుల మైలు రాయిని చేరుకోవడానికి మరో 121 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ కంటే పరుగుల పరంగా కోహ్లీ (Kohli) 6,624, శిఖర్ధావన్ (Shikhar) 6,244 పరుగులతో ముందున్నారు.

అంతే కాకుండా కెప్టెన్గా 150 ఐపీఎల్ మ్యాచ్లు (150 IPL matches) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా (second player) రోహిత్ నిలవడానికి మరో ఏడు మ్యాచ్ దూరంలో ఉన్నాడు. ఫీల్డింగ్లో ఎంతో చురుగ్గా ఉండే రోహిత్ శర్మ 100 క్యాచ్ల (100 catches) మార్కును అందుకోవడానికి మరో మూడు మ్యాచ్ దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటి వరకూ వంద క్యాచ్ మైలురాయిని అందుకున్న వారిలో సురేశ్ రైనా (Suresh Raina) 109, కీరన్ పొలార్డ్ (Polard) 103 మాత్రమే ఉన్నారు.

 

ప్రాక్టీస్ లో శ్రమిస్తున్న ఆటగాళ్లు : Players working hard in practice

ఐపీఎల్ లో పాల్గొంటున్న అన్ని జట్లకు చెందిన ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ (net practice) లో మునిగి తేలుతున్నారు. దీంతో ఏడాది కూడా పలు రికార్డులు బద్దలవుతాయని క్రికెట్ అభిమానులు (cricket fans) ఎదురు చూస్తున్నారు. ఏడాది బద్దలయ్యేందుకు అవకాశం ఉన్న రికార్డుల వివరాలను పరిశీలిస్తే...

 

అత్యధిక వికెట్లు (Most wickets) : ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బ్రావో (Bravo) కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటి వరకూ 183 వికెట్లు తీసాడు. 166 వికెట్లతో తరువాతి స్థానంలో చాహల్ (Chahal) ఉన్నాడు. చాహల్ మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బద్దలు అవుతుంది.

 

అత్యధిక సెంచరీలు (Most centuries) : ఐపీఎల్ లో ఇప్పటి వరకూ అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు క్రిస్ గేల్ (Chris Gayle) పేరున ఉంది. గేల్ ఐపీఎల్ లో ఇప్పటి వరకూ ఆరు సెంచరీలు (six centuries) చేసాడు. అయితే రికార్డును బ్రేక్ చేసే అవకాశం బట్లర్ (Jos Butler) (5), విరాట్ కోహ్లీ (Virat Kohli) (5), కేఎల్ రాహుల్ (KL Rahul) (4), డేవిడ్ వార్నర్ (4) కు ఉంది.

 

అత్యధిక సిక్సర్లు (Most sixes) : ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (Gayle) (357) పేరున ఉంది. తరువాతి స్థానంలో మిస్టర్ 360 ఎబి డివిలియర్స్ (AB De Villiers) 250 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) 240 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో 10 సిక్సర్లు (10 sixers more) కొడితే రోహిత్ డివిలియర్స్ ను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటాడు.

 

అత్యధిక డకౌట్స్ (Most ducks) : ఐపీఎల్ లో ఇప్పటి వరకూ అత్యధిక సార్లు డకౌట్ (Ducks) అయిన రికార్డు మన్దీప్ సింగ్ (Mandeep Singh), రోహిత్ శర్మ (Rohit Sharma) పేరున ఉన్నాయి. వీరిద్దరూ 14 సార్లు డకౌట్ (14 times) అయ్యారు. రోహిత్ మరో మ్యాచ్లో డకౌట్ అయితే అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.

అత్యధిక మ్యాచ్లు (Most matches) : మొత్తమ్మీద ఐపీఎల్ ఇప్పటివరకు 15 సీజన్లు (15 seasons) జరిగింది. అన్ని సీజన్లు కలుపుకుని అత్యధిక మ్యాచ్లు (most matches) ఆడిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సారథి ఎమ్మెస్ ధోని (Dhoni) నిలిచాడు. ధోని ఇప్పటిదాకా 234 మ్యాచ్లు (234 matches) ఆడాడు. ఇప్పుడు జరగనున్న 16 సీజన్లో (16th season) ధోని గనుక అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటే 250 మ్యాచ్లు పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

 

మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 సీజన్లో (16th season) ప్రారంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న సీజన్లో అసాధ్యం (impossible) కాని రికార్డులను సుసాధ్యం (possible) చేసేందుకు ఆటగాళ్లు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్ లో తమ అభిమాన ఆటగాళ్ల ప్రాక్టీస్ చూస్తున్న అభిమానులు (fans) ఏడాది రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సంబర పడుతున్నారు.