ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్లు : 2 matches in IPL today
వీకెండ్ లో నేడు ఐపీఎల్ (IPL) రెండు మ్యాచ్లు (2 matches) అభిమానులను అలరించనున్నాయి. నాలుగు జట్లూ (4 teams) కూడా విజయం కోసం పోరాడనున్నాయి.
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్లు : 2 matches in IPL today
వీకెండ్ లో నేడు ఐపీఎల్ (IPL) రెండు మ్యాచ్లు (2 matches) అభిమానులను అలరించనున్నాయి. నాలుగు జట్లూ (4 teams) కూడా విజయం కోసం పోరాడనున్నాయి.
విజయమే లక్ష్యంగా ఇరుజట్లు : Both teams are aiming for victory
ఐపీఎల్ 16 వ సీజన్లో 11వ మ్యాచ్లో నేడు రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్ జరగనుంది. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో (Barsapara stadium) ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఢిల్లీ జట్టు మాత్రం తొలి విజయం కోసం పోరాడనుండి.
మ్యాచ్ అంచనా : Match prediction
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ దే పైచేయిగా కనిపిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ ఇప్పటివరకు అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ దే పైచేయిగా కనిపిస్తోంది.పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 5 పరుగుల తేడాతో ఓటమి చెందింది. అయినా విజయం కోసం చివరి వరకూ పోరాడింది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ తమ అత్యుత్తమ ఆట తీరును కనబరచలేదు. వార్నర్ సారథ్యంలోని (captain warner) ఈ జట్టు మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లోనూ బలహీనంగా DC weak in bowling & batting కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్తో మ్యాచ్ గెలుపు అంత సులువు కాదు.
పిచ్ నివేదిక : pitch report
గౌహతిలోని బర్సాపరా స్టేడియం (Barsapara stadium, Guwahati) పిచ్ బ్యాటింగ్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై భారీ స్కోర్ (highest score) నమోదు ఖాయమని చెప్పవచ్చు. గత మ్యాచ్లో ఫాస్ట్బౌలర్లకు ఈ పిచ్ సహకరించింది. ఈ పరిస్థితిలో ఫాస్ట్ బౌలర్లకు (fast bowlers) కూడా అనుకూలించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడం మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య హెడ్ టు హెడ్ (head to head) రికార్డు సమానంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 26 సార్లు తలపడగా ఇరు జట్లూ చెరో 13 సార్లు విజయం సాధించాయి.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI : RR playing XI
యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ఒబెడ్ మెక్కాయ్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయింగ్ XI : DC playing XI
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
12 వ మ్యాచ్లో : 12th match
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో భాగంగా 12 వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడతాయి.
ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఈ సీజన్లో తొలిసారి తలపడుతున్నాయి. 5 సార్లు ఐపీఎల్ (IPL) ఛాంపియన్ ముంబై జట్టు ఆడిన తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) చేతిలో ఓటమి పాలయింది. చెన్నై ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి ఓడి, రెండోది నెగ్గింది. రాత్రి 7. 30 గంటలకు (7:30 PM) ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhede stadium, Mumbai) మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఓటమి చెందిన ముంబై టీమ్ రెండో మ్యాచ్లో గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో విజయం సాధించి రెండో గెలుపు తమ ఖాతాలో వేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎదురు చూస్తోంది.
పిచ్ నివేదిక : Pitch report
వాంఖడే స్టేడియం పిచ్ బ్యాట్స్మెన్కు (support for batsmen) అనుకూలంగా ఉంటుంది. బాల్ బ్యాట్ పైకి బౌన్స్ అవుతుందని పిచ్ క్యూరేటర్ చెబుతున్నారు. బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది. ముందుగా ఫీల్డింగ్ చేసే జట్టుకు (first fielding best) లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. బౌలర్లు మాత్రం ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ లో ఇరు జట్లూ రాణింపు : Both the teams excelled in IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు నిలకడగా రాణిస్తూ అగ్రభాగాన నిలిచాయి. ముంబై ఇండియన్స్ 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీ (IPL Trophy) గెలిచాయి. రెండు జట్ల మధ్య ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు అభిమానులను అలరించాయి. మొదటి మ్యాచ్లో ఇరు జట్లూ ఓడినా, చెన్నై (CSK) తన రెండో మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో చెన్నై టీమ్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే హోమ్ గ్రౌండ్ లో ఆడడం ముంబై (Mumbai home ground) కి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI : MI playing XI
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSKI playing XI
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, RS హంగర్గేకర్
Points table
జట్లు (Team) |
Matches |
Wins |
Loss |
Pts |
NRR |
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) |
3 |
2 |
1 |
4 |
1.358 |
గుజరాత్ టైటాన్స్ (GT) |
2 |
2 |
0 |
4 |
0.700 |
పంజాబ్ కింగ్స్ (PBKS) |
2 |
2 |
0 |
4 |
0.333 |
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) |
2 |
1 |
1 |
2 |
2.056 |
రాజస్థాన్ రాయల్స్ (RR) |
2 |
1 |
1 |
2 |
1.675 |
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) |
2 |
1 |
1 |
2 |
0.036 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) |
2 |
1 |
1 |
2 |
- 1.256 |
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) |
2 |
0 |
2 |
0 |
-1.703 |
ముంబై ఇండియన్స్ (MI) |
1 |
0 |
1 |
0 |
-1.981 |
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) |
2 |
0 |
2 |
0 |
-2.867 |