రేపటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ 2023 : 2023 Women Premier League (WPL)
మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ (WPL) సందడి చేయనుంది. పురుషులతో సమానంగా ధనాధన్ క్రికెట్ ఆడుతున్న మహిళలు తమ ఆటతో అలరించడానికి వస్తున్నారు. టైటిల్ కోసం (For Title) ఐదు జట్లు తలపడనున్నాయి.
రేపటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ 2023 : 2023 Women Premier League (WPL)
మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ (WPL) సందడి చేయనుంది. పురుషులతో సమానంగా ధనాధన్ క్రికెట్ ఆడుతున్న మహిళలు తమ ఆటతో అలరించడానికి వస్తున్నారు. టైటిల్ కోసం (For Title) ఐదు జట్లు తలపడనున్నాయి.
మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ (WPL) మొదటి సీజన్ (First Season) ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ (BCCI) సన్నాహాలు చేస్తోంది. ప్రారంభోత్సవంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ (Kiara Advani), కృతి సనన్ (Kriti Sanon) సందడి చేయనున్నారు. వీరితో పాటుగా ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ (Amrit pal Singh Dhillon) కూడా తన పాటలతో అభిమానులను అలరించనున్నాడు. 23 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నమెంట్ లో 22 మ్యాచ్ లు జరగనున్నాయి.
పాల్గొంటున్న జట్లు : Participating Teams
- ముంబై ఇండియన్స్ (Mumbai Indians)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)
- ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)
- గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)
- యూపీ వారియర్స్ (UP Warriors).
మ్యాచ్‌లు జరగనున్న స్టేడియమ్స్ : Where the matches will be held
మొదటి సీజన్లో జరిగే అన్ని మ్యాచ్‌లు ముంబైలో ఉన్న రెండు స్టేడియంలలో జరగనున్నాయి. డివై పాటిల్ స్టేడియంలో (DY Patil Stadium) 11 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ (Brabourne Stadium) స్టేడియంలో 11 మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య జరగనుంది. టోర్నమెంట్లో లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 26న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ (Final Match) జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు (Topper on Points Table) ఫైనల్స్‌లోకి నేరుగా ప్రవేశం పొందుతుంది. అక్కడ ఎలిమినేటర్ విజేతతో (Eliminator Winner) తలపడుతుంది.
వయాకామ్ 18 ప్రత్యక్ష ప్రసారం : Live streaming in Viacom 18
మహిళల ప్రీమియర్ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్, టీవీ ప్రసార హక్కులను వయాకామ్-18 దక్కించుకుంది. వయాకామ్-18 స్పోర్ట్స్ ఛానెల్స్ ‘స్పోర్ట్స్-18 1’, ‘స్పోర్ట్స్-18 1HD’, ‘స్పోర్ట్స్-18 ఖేల్’లో మొత్తం 22 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ Jio సినిమా యాప్‌లో (Jio Cinema App) అందుబాటులో ఉంటుంది.
మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ : Matches Full Schedule
మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్)
మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM), బ్రబౌర్న్)
మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM), DY పాటిల్)
మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, DY పాటిల్)
మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, DY పాటిల్)
మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్)
మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్)
మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్)
మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, DY పాటిల్)
మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, DY పాటిల్)
మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) మ్యాచ్ జరగనుంది.
WPL జట్ల పూర్తి వివరాలు : WPL Teams Full Squad
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : Royal Challengers Bangalore
స్మృతి మంధాన – రూ 3.4 కోట్లు
సోఫీ డివైన్ (New Zealand) - రూ. 50 లక్షలు
ఎల్లీస్ పెర్రీ (Australia) – రూ. 1.7 కోట్లు
రేణుకా సింగ్ - రూ. 1.5 కోట్లు
రిచా ఘోష్ - రూ. 1.9 కోట్లు
ఎరిన్ బర్న్స్ (Australia) – రూ. 30 లక్షలు
దిశా కసత్ - రూ. 10 లక్షలు
ఇంద్రాణి రాయ్ - రూ. 10 లక్షలు
శ్రేయాంక పాటిల్ – రూ. 10 లక్షలు
కనికా అహుజా – రూ. 35 లక్షలు
ఆశా శోబన – రూ. 10 లక్షలు
హీథర్ నైట్ - రూ. 40 లక్షలు
డేన్ వాన్ నీకెర్క్ - రూ. 30 లక్షలు
ప్రీతి బోస్ - రూ. 30 లక్షలు
పూనమ్ ఖేమ్నార్ - రూ. 10 లక్షలు
కోమల్ జంజాద్ - రూ. 25 లక్షలు
ముంబై ఇండియన్స్ : Mumbai Indians
హర్మన్‌ప్రీత్ కౌర్ - రూ. 1.8 కోట్లు
నాట్ స్కీవర్-బ్రంట్ (England) – రూ. 3.2 కోట్లు
అమేలియా కెర్ (New Zealand) – రూ. 1 కోట్లు
పూజా వస్త్రాకర్ - రూ 1.9 కోట్లు
యాస్తిక భాటియా - రూ 1.5 కోట్లు
హీథర్ గ్రాహం (Australia) – రూ. 30 లక్షలు
ఇస్సీ వాంగ్ - రూ. 30 లక్షలు
అమంజోత్ కౌర్ - రూ. 50 లక్షలు
ధారా గుజ్జర్ - రూ. 10 లక్షలు
సైకా ఇషాక్ - రూ. 10 లక్షలు
హీలీ మాథ్యూస్ (Westindies) – రూ. 40 లక్షలు
క్లో ట్రయాన్ - రూ. 30 లక్షలు
హుమైరా కాజీ – రూ. 10 లక్షలు
ప్రియాంక బాల - రూ. 20 లక్షలు
గుజరాత్ జెయింట్స్ : Gujarat Giants
ఆష్ లక్షలు గార్డనర్ (Australia) – రూ. 3.2 కోట్లు
బెత్ మూనీ (Australia) – రూ. 2 కోట్లు
సోఫియా డంక్ లక్షలు (England) - రూ. 60 లక్షలు
స్నేహ రానా - రూ 75 లక్షలు
అన్నాబెల్ సదర్లాండ్ (Australia) - రూ. 70 లక్షలు
డియాండ్రా డాటిన్ (West Indies) - రూ. 60 లక్షలు
హర్లీన్ డియోల్ - రూ. 40 లక్షలు
సబ్బినేని మేఘన - రూ. 40 లక్షలు
మాన్సీ జోషి – రూ. 30 లక్షలు
దయాళన్ హేమలత – రూ. 30 లక్షలు
మోనికా పటేల్ - రూ. 30 లక్షలు
జార్జియా వేర్‌హామ్ (Australia) – రూ. 75 లక్షలు
దయాళన్ హేమలత – రూ. 30 లక్షలు
తనూజా కన్వర్ – రూ. 50 లక్షలు
సుష్మా వర్మ - రూ. 60 లక్షలు
హర్లీ గాలా – రూ. 10 లక్షలు
అశ్వని కుమారి – రూ. 35 లక్షలు
పరుణికా సిసోడియా – రూ. 10 లక్షలు
యూపీ వారియర్స్ (UP Warriors)
సోఫీ ఎక్లెస్టోన్ (England)- రూ. 1.8 కోట్లు
దీప్తి శర్మ – రూ. 2.6 కోట్లు
తహ్లియా మెక్‌గ్రాత్ (Australia) – రూ. 1.4 కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ (South Africa) – రూ. 1 కోట్లు
అలిస్సా హీలీ (Australia) - రూ. 70 లక్షలు
అంజలి సర్వాణి - రూ. 55 లక్షలు
రాజేశ్వరి గయాక్వాడ్ - రూ. 40 లక్షలు
శ్వేతా సెహ్రావత్ - రూ. 40 లక్షలు
పార్షవి చోప్రా - రూ. 10 లక్షలు
ఎస్ యశశ్రీ - రూ 10 లక్షలు
కిరణ్ నవ్‌గిరే - రూ. 30 లక్షలు
గ్రేస్ హారిస్ (Australia) – రూ. 75 లక్షలు
దేవికా వైద్య - రూ. 1.4 కోట్లు
లారెన్ బెల్ - రూ. 30 లక్షలు
లక్ష్మీ యాదవ్ - రూ. 10 లక్షలు
సిమ్రాన్ షేక్ - రూ. 10 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్ : Delhi Capitals
జెమిమా రోడ్రిగ్స్ - రూ. 2.2 కోట్లు
మెగ్ లానింగ్ (Australia) – రూ. 1.1 కోట్లు
షఫా లక్షలు వర్మ – రూ. 2 కోట్లు
టిటాస్ సాధు - రూ. 25 లక్షలు
రాధా యాదవ్ - రూ. 40 లక్షలు
శిఖా పాండే - రూ. 60 లక్షలు
మారిజానే కాప్ (South Africa) - రూ 1.5 కోట్లు
ఆలిస్ క్యాప్సీ - రూ. 30 లక్షలు
తారా నోరిస్ - రూ. 10 లక్షలు
లారా హారిస్ (Australia) – రూ. 45 లక్షలు
జసియా అక్తర్ - రూ. 20 లక్షలు
మిన్ను మణి – రూ. 30 లక్షలు
తానియా భాటియా – రూ. 30 లక్షలు
పూనమ్ యాదవ్ – రూ.30 లక్షలు
జెస్ జోనాసెన్ - రూ. 50 లక్షలు
స్నేహ దీప్తి – రూ. 30 లక్షలు
అరుంధతి రెడ్డి – రూ. 30 లక్షలు
అపర్ణ మండల్ - రూ. 10 లక్షలు
ప్రచార మస్కట్ ను విడుదల చేసిన జై షా : Jai Shah released the campaign Mascot
ఈ మెగా టోర్నీకి మరింత ప్రచారాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ (BCCI) కార్యదర్శి జై షా మస్కట్‌ను (Mascot) విడుదల చేసారు. ఒకచేత్తో బ్యాట్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకుని రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న చీతా ఈ మస్కట్ లో కనబడుతుంది. దానికి శక్తి (Shakti) అని పేరు పెట్టారు. ‘అతను రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రారంభం మాత్రమే’ అని ఇందులో క్యాప్షన్ గా (The Caption on Mascot is : "He is ready to take the field. This is just the beginning') రాశారు.