అగ్రస్థానం కోల్పోయిన భారత జట్టు : Indian team lost 1st place
గత నాలుగేళ్లుగా వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు (Indian cricket men's team) తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తో పాటు తమ అగ్రస్థానాన్ని (lost number one place) సైతం కోల్పోయింది.
అగ్రస్థానం కోల్పోయిన భారత జట్టు : Indian team lost 1st place
గత నాలుగేళ్లుగా వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు (Indian cricket men's team) తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ తో పాటు తమ అగ్రస్థానాన్ని (lost number one place) సైతం కోల్పోయింది. 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మొదటి వన్డేను అతి కష్టంతో నెగ్గిన భారత్ మిగతా రెండు మ్యాచ్ ల్లో తేలిపోయింది. స్వదేశంలో వన్డే సిరీస్ ను నాలుగేళ్ల తరువాత (after 4 years) భారత్ కోల్పోవడం ఇదే మొదటిసారి. స్టీవ్ స్మిత్ సారధ్యం (captain smith) వహించిన ఆస్ట్రేలియా (Australia) జట్టు అద్భుత ప్రదర్శనతో వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. దీంతో ఐసీసీ (ICC) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ తమ అగ్రపీఠాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. 113 పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమానంగా ఉన్న భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
పేలవమైన ప్రదర్శన చేసిన జట్టు : Team performed poor
ఈ ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ (clean sweep New Zealand) చేసిన భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అనంతరం శ్రీలంకతో జరిగిన సిరీస్ ను సైతం 3-0 తో గెలుచుకుంది. కాగా ఆస్ట్రేలియాతో మొదలైన వన్డే సిరీస్ లో మొదటి వన్డే ని గెలిచి శుభారంభం చేసింది. అయితే అనంతరం విశాఖపట్నం, చెన్నై వేదికగా జరిగిన మిగతా రెండు వన్డేల్లోనూ పరాజయం (lost 2 matches) పాలవడంతో సిరీస్ ను కోల్పోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లోనూ భారత జట్టు పేలవమైన ప్రదర్శన కనబరిచింది. నమ్మకం ఉంచుకున్న బ్యాటర్లు (batsmens) చేతులెత్తేయడం భారత్ ను దెబ్బ తీసింది.
విఫలమైన ప్రపంచ నెంబర్ వన్ : Failed World Number One
టీ20ల్లో ప్రపంచ నెంబర్ వన్ గా (No.1 in T20's) కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ (SKY) వన్డేల్లోకి వచ్చేసరికి ఘోరంగా విఫలమయ్యాడు (failed). ఆడిన మూడు మ్యాచుల్లోనూ గోల్డెన్ డక్ గా అవుటయ్యాడు. దీంతో పాటుగా తన పేరున ఒక చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఇలా మూడు మ్యాచుల్లోనూ గోల్డెన్ డక్ (golden duck) గా వెనుదిరిగిన ఆరో భారత బ్యాట్స్మెన్ (6th batsmen) నిలిచాడు. సూర్య కుమార్ కంటే ముందుగా సచిన్ (Sachin) తెందూల్కర్ (1994), అనిల్ కుంబ్లే (Anil kumble) (1996), జహీర్ ఖాన్ (Zaheer Khan) (2003-04), ఇషాంత్ శర్మ (Ishant Sharma) (2010-11), జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumra) (2017-2019) ఈ జాబితాలో ఉన్నారు.
అగ్రస్థానం కోల్పోయిన సిరాజ్ : Siraj lost 1st place
బౌలింగ్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ గా కొనసాగుతున్న భారత బౌలర్ సిరాజ్ తాజా ఐసీసీ (ICC) ప్రకటించిన ర్యాంకింగ్స్ (rankings) లో మొదటి ర్యాంకింగ్ ను కోల్పోయి 702 పాయింట్లతో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో (Mitchell Starc) కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. 713 పాయింట్లతో హాజెల్‌వుడ్ ప్రథమ స్థానాన్ని (Hazelwood first place) సొంతం చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు ప్రదర్శన చూసి అభిమానులు ఎంతో నిరాశ చెందుతున్నారు. ఈ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తే ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారతాయని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
ఐపీఎల్ లో కొత్త రూల్ : New rule in IPL
మరికొద్ది రోజుల్లో జరగనున్న 16 వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఫ్రాంచైజీలు తమ తుది జట్లను (final squad), ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను (impact player details) టాస్ వేసిన తర్వాత (after toss) కూడా ప్రకటించే వెసులుబాటును బీసీసీఐ (BCCI) కల్పించింది. దీంతో టాస్ గెలుపోటములను బట్టి అత్యుత్తమ జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా టాస్కు ముందే ఇరుజట్ల కెప్టెన్లు తమ తుది జట్టు జాబితాను వెల్లడించాలన్న నిబంధన ఉంది. అలాగే ఓ జట్టు ఫీల్డర్ (fielder) లేదా వికెట్ కీపర్ (wicket keeper) అసమంజసమైన కదలికలకు పాల్పడితే బంతిని డెడ్బాల్గా (dead ball) ప్రకటించి, ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులను ఇస్తారు. ఈ సీజన్ ఐపీఎల్ (IPL) ఈనెల 31 నుంచి మే 28 వరకు జరగనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీల జట్లకు చెందిన క్రీడాకారులు కొందరు ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసారు.
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ : 2023 World cup schedule
ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) భారత్ లో జరగనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం బీసీసీఐ (BCCI) మ్యాచ్ ల షెడ్యూల్ (Schedule) ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లు జరిగే వేదికలను బీసీసీఐ (BCCI) షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (Biggest stadium) ఈ టోర్నీకి ప్రారంభ వేదిక కానుంది. ఈ స్టేడియంతో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై ఈ 12 వేదికలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ (shortlist) చేసినట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్‌లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్‌లతో (3 knockouts) సహా 48 మ్యాచ్‌లు (48 matches) జరుగుతాయి.
మూడు స్థానాలకు తీవ్ర పోటీ : Competition for three places
బరిలో 10 జట్లు (total 10 teams) పాల్గొంటాయి. ఇప్పటికే 7 జట్లు (7 teams) ప్రపంచ కప్ కోసం అర్హత సాధించాయి. మిగిలిన మూడు స్థానాల కోసం ఆయా జట్లు పోటీ పడుతున్నాయి (Competition for three place). ముఖ్యంగా దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, శ్రీలంక ఇంకా తమ బెర్తులు ఖరారు చేసుకోలేదు. ఐసీసీ పురుషుల ప్రపంచకప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్ లో మొదటి ఎనిమిది జట్లు నేరుగా ఫైనల్ కి అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకూ ప్రపంచ కప్ కోసం అర్హత సాధించిన జట్లలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు మిగిలిన మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి.