ఐపీఎల్-2023 సీజన్ ఫేవరేట్ టీమ్స్ : Favorite Teams in IPL-2023

పొట్టి క్రికెట్ లో గత 15 సీజన్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మరికొద్ది నెలల్లో సందడి చేయనుంది.

ఐపీఎల్-2023 సీజన్ ఫేవరేట్ టీమ్స్ : Favorite Teams in IPL-2023

ఐపీఎల్-2023 సీజన్ ఫేవరేట్ టీమ్స్ : Favorite Teams in IPL-2023

 

పొట్టి క్రికెట్ లో గత 15 సీజన్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మరికొద్ది నెలల్లో సందడి చేయనుంది.

 

ఐపీఎల్ లో రూ. కోట్లు పెట్టుబడి : Crores of Rupees Invested in IPL

ఐపీఎల్ 16 సీజన్ కోసం అన్ని జట్లూ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ పూర్తయింది. 2023 మార్చ్ 20 ప్రారంభం కానుంది. ఇందులో 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. దీని కోసం ఇప్పటి నుంచే కొన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాయి. ఆశ్చర్యకరంగా ఈసారి ఇంగ్లాండ్ కి చెందిన సామ్ కర్రన్ 18.5 కోట్లకు వేలంలో అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాకి చెందిన కేమరాన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ జట్టు 17.50 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఐపీఎల్ లో ఇదే అతి ఎక్కువ మొత్తం. వేలంతోనే రికార్డులు సృష్టించిన రాబోయే 16 సీజన్ ఐపీఎల్ ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

 

మూడేళ్ళ కాలానికి ఉండే కాట్రాక్టు తో ఆటగాళ్లను ఐపీఎల్ లోకి ఆయా ఫ్రాంచైజీలు తీసుకుంటాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటాయి. ఆయా ఫ్రాంఛైజీల బిడ్డింగ్ ఈవిధంగా ఉన్నాయి.

 

జట్టు పేరు                                                                       కోట్లలో

 

లక్నో                                                                                7090

అహ్మదాబాద్                                                                    5600

ముంబై ఇండియన్స్                                                           839

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు                                       837

చెన్నై సూపర్ కింగ్స్                                                           683

ఢిల్లీ క్యాపిటల్స్                                                                  630

సన్ రైజర్స్ హైదరాబాద్                                                    596

పంజాబ్ కింగ్స్                                                                   570

కోల్కతా నైట్ రైడర్స్                                                          563

రాజస్థాన్ రాయల్స్                                                            503

గుజరాత్ టైటాన్స్ (GT)

ఏడాది 2022 లో జరిగిన ఐపీఎల్ 15 సీజన్లో ఆరంగ్రేటం చేసిన గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి ట్రోఫీని ఎగరేసుకు పోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడు. పాండ్యా (487), శుభమన్ గిల్ (483), డేవిడ్ మిల్లర్ (481) పరుగులు చేసి అద్భుత బ్యాటింగ్ తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. బౌలింగ్ లో మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ ఆధ్వరంలోని బౌలర్ల ద్వయం ప్రత్యర్థులను కట్టడి చేసింది. 14 మ్యాచ్ లు ఆడిన జట్టు కేవలం 4 మ్యాచుల్లోనే ఓడి 10 మ్యాచుల్లో గెలుపొందింది. దీంతో 2023 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

శుభమన్ గిల్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్య, రాహుల్ తేవాతియా, వోడియన్ స్మిత్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాళ్, మొహమ్మద్ షమీ, జాషువా లిటిల్.

 

ముంబై ఇండియన్స్ (MI)

ముంబై ఇండియన్స్ జట్టు ఎక్కువ సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టుగా నిలిచింది. రోహిత్ శర్మ సారధ్యంలోని జట్టు 2013, 2015, 2017, 2019 మరియు 2020 మొత్తం ఐదు సార్లు ట్రోఫీ నెగ్గింది. జట్టులో విధ్వంసకర బ్యాట్స్ మన్లు ఉండడంతో ఈసారి జట్టు ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముంబై ఇండియన్స్ మొత్తం ఐపీఎల్ 15 సీజన్లలో 231 మ్యాచ్ లు ఆడి 129 మ్యాచులు గెలుపొందింది. 98 మ్యాచుల్లో ఓటమి చవి చూసింది. విజయ శాతం 56.7 గా ఉంది. ఈసారి ముంబై జట్టు కూడా టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా ఉంది.

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేమెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, డేవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.

 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఆడిన మొదటి సీజన్లో రన్నరప్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరువాత 4 సార్లు టైటిల్ సాధించింది. 2010, 2011, 2018, 2021 లో ట్రోఫీ నెగ్గింది. 2008, 2012, 2013, 2015, 2019 లో రన్నర్స్ గా నిలిచారు. అత్యధిక సార్లు ఫైనల్స్ ఆడిన జట్టుగా సీఎస్కే జట్టు ఘనత వహించింది. జట్టులో హేమాహేమీలు ఉన్నా 2022 సీజన్లో అంతగా రాణించకపోవడంతో పాయింట్ల పట్టికలో ఆడిన 10 టీమ్స్ లో 9 స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది.

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

రుతురాజ్ గైక్యాయిడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, ఎమ్మెస్ ధోని, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ముకేశ్ చౌదరి, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ.

 

రాజస్థాన్ రాయల్స్ (RR)

మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008 లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టును ఓడించి టైటిల్ నెగ్గింది. అనంతరం 2022 లో ఫైనల్ చేరినప్పటికీ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. టీమ్ లో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. నిలకడలేమి జట్టుని వేధిస్తోంది. 2022 సీజన్లో ఫైనల్ చేరిన ఉత్సాహంతో 16 సీజన్ 2023 లో జరగనున్న ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేయాలనే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

జాస్ బట్లర్, యశశ్వి జైస్వాల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్.

 

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)

గతంలో డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్న జట్టును డెక్కన్ క్రానికల్ ఫ్రాంచైజీగా ఉండేది. అనంతరం దీనిని సన్ గ్రూప్ ఖరీదు చేయడంతో బీసీసీఐ (BCCI) అనుమతితో 2012 అక్టోబర్ 25 తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ గా నామకరణం చేశారు. ఐపీఎల్ 2016 సీజన్లో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ కు చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై నెగ్గి టైటిల్ నెగ్గింది. తిరిగి 2018 లో ఫైనల్ కి చేరినా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి చెంది రన్నరప్ తో సరిపెట్టుకుంది. జట్టుకి అత్యుత్తమ ప్రదర్శనకు బౌలర్లే మూల కారణం..

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మలిక్, టీ.నటరాజన్

 

కోల్కతా నైట్ రైడర్స్ (KKR)

సైలెంట్ గా తమ పని తాము చేసుకుని అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న జట్టుగా కేకేఆర్ జట్టు నిలిచింది. బాలీవుడ్ బాద్షాగా పేరొందిన హీరో షారుఖ్ ఖాన్ కి చెందిన కేకేఆర్ జట్టు 2012 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, 2014 లో కింగ్స్ XI పంజాబ్ జట్టును ఓడించి టైటిల్ ఎగరేసుకు పోయింది. అనంతరం 2021 లో ఫైనల్ కి చేరినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. జట్టులో మంచి ఆల్-రౌండర్లు ఉన్నారు. ఈసారి జరగనున్న 16 సీజన్ ఐపీఎల్ లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది.

 

జట్టులోని టాప్-XI ఆటగాళ్లు

వెంకటేష్ అయ్యర్, ఎన్. జగదీశన్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, శార్ధూల్ ఠాకూర్, లోకీ ఫెర్గుసన్, ఉమేష్ యాదవ్

 

జట్టులో కాకుండా పోటీలో ఇంకా ఉన్న మిగతా జట్లు గట్టి పోటీని ఇవ్వడానికి సాయి అంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లలో అగ్ర శ్రేణి బ్యాట్స్ మన్లు, బౌలరు ఉన్నప్పటికీ ట్రోఫీ ఆమడ దూరంలో నిలిచిపోయారు. మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయిన జట్టుగా నిలిచింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ని జట్టు ఈసారి ట్రోఫీని గెలవాలనే నిశ్చయంతో ఉంది. మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన జట్టుకే టైటిల్ దక్కనుంది. దీనికోసం ఆయా జట్ల అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతతో ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు.

అగ్రస్థానంలో ముంబై, చెన్నై : Mumbai and Chennai in Top

 మొత్తం ఐపీఎల్ 15 సీజన్లలో (15 seasons) అత్యధికసార్లు టైటిల్స్ గెలిచిన జట్లుగా ముంబై, చెన్నై జట్లు నిలిచాయి. ముంబై జట్టు ఐదు సార్లు (MI 5 times), చెన్నై జట్టు నాలుగు సార్లు (CSK 4 Times) విజేతలుగా నిలిచాయి. మొత్తం 10 జట్లలో ఈ రెండు జట్లే 9 సార్లు విజేతలుగా (Both Teams Win 9 Titles) నిలిచి ట్రోఫీలను ఎగరేసుకుపోయాయి.

 

ముంబై ఇండియన్స్ (MI) జట్టు అత్యధికంగా 5 సార్లు 2013, 2015, 2017, 2019, 2020 లో టైటిల్స్ గెలుచుకుంది. MI జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోని ఈ జట్టు ఈ 16వ ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉంది.

 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 4 సార్లు 2010, 2011, 2018, 2021 లో టైటిల్ గెలుచుకుంది. అంతే కాకుండా చెన్నై జట్టు 5 సార్లు 2008, 2012, 2013, 2015, 2019 రన్నరప్ (5 Times Runners) గా నిలిచింది. ధోని సారధ్యంలోని CSK ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు జరగబోయే 16వ సీజన్ ధోనీకి ఆఖరి సీజన్ కావొచ్చని విశ్లేషకులు (Analysts), అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ (Dhoni announced Retirement for all formats) ప్రకటించిన ధోని గత ఐపీఎల్ సీజన్లో T20 లకు కూడా రిటైర్మెంట్ చెబుతాడని భావించారు.

ఈ ఏడాది కూడా జట్టుతోనే ఉన్న ధోనీ ఎలాగైనా 16వ సీజన్ (16th season) ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎల్లప్పుడూ ఫిట్నెస్ (Fitness) పైన శ్రద్ధ చూపించే ధోనీ మరికొన్నాళ్లు ఐపీఎల్ (IPL) ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిమానులు అంటున్నారు. ధోనీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ (Net practice videos went viral) అవుతున్నాయి. ప్రాక్టీస్ లో సిక్సర్ల వర్షం (Sixes in Practice) కురిపించడంతో ఇంకా అసలు మ్యాచ్ ల్లో చెలరేగిపోతాడని అభిమానులు (Fans) సంబర పడిపోతున్నారు. ప్రతీ సీజన్లో ఎన్నో రికార్డులను (records) సృష్టిస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ (IPL 16th season) మరిన్ని రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ సామ్ కరన్ (Sam Curran) ను పంజాబ్ జట్టు (PBKS) యాజమాన్యం ఐపీఎల్ చరిత్రలోనే (IPL History) అత్యధిక ధర రూ.18.25 (18.25 Crores) కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది.