భారత దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియమ్స్ : Biggest Cricket Stadiums in India

క్రికెట్ స్టేడియంలో వేలాది మంది మధ్యన కూర్చుని మ్యాచ్ ను వీక్షించడంలో ఉన్న మజాయే వేరు. ఈలలు, అరుపులు, కేకలు ప్రేక్షకుల మధ్యన ఆ అనుభూతిని వర్ణించలేము.

భారత దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియమ్స్ : Biggest Cricket Stadiums in India

భారత దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియమ్స్ : Biggest Cricket Stadiums in India

 

క్రికెట్ స్టేడియంలో వేలాది మంది మధ్యన కూర్చుని మ్యాచ్ ను వీక్షించడంలో ఉన్న మజాయే వేరు. ఈలలు, అరుపులు, కేకలు ప్రేక్షకుల మధ్యన అనుభూతిని వర్ణించలేము.

 

క్రికెట్ అభిమానుల్లో చాలామంది తమ అభిమాన క్రీడాకారులను చూసేందుకు వారు ఆడే మైదానాలకు వెళ్లి ఆయా మ్యాచులను వీక్షిస్తుంటారు. అక్కడికి వెళ్లలేనివారు మొబైల్స్ లోనూ, టీవీల్లోనూ చూసి ఆనందిస్తుంటారు. భారతదేశంలో ఒకప్పుడు ఈడెన్ గార్డెన్స్ విదేశాల్లోని లార్డ్స్ మైదానంలా అత్యంత సుందరంగా ఉండేది. అయితే ఈ ఏడాది ప్రారంభోత్సవం చేసుకున్న గుజరాత్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అతి పెద్దదిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం గా దీనికి నరేంద్ర మోడీ స్టేడియం అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోని క్రికెట్ స్టేడియంలలో అతి పెద్దది. 1,32,000 మంది కూర్చునే సామర్ధ్యం ఈ స్టేడియం సొంతం. 

 

భారత దేశంలోని అతి పెద్ద స్టేడియమ్స్ వివరాలు పరిశీలిస్తే...

 

1. నరేంద్ర మోడీ స్టేడియం

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న స్టేడియం భారత్ లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.  స్టేడియంలో 1,32,000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంది.

 

2. ఈడెన్ గార్డెన్స్

అత్యంత సుందరమైన స్టేడియం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉంది. దీని సిటింగ్ సామర్ధ్యం 66,000.

 

3. షహీద్ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో ఉన్న స్టేడియంలో 65,000 మంది కూర్చునే సామర్ధ్యం కలిగి ఉంది.

 

4. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్న స్టేడియంలో 60,000 మంది కూర్చుని క్రికెట్ ని వీక్షించే సౌకర్యం ఉంది.

 

5. డీవై పాటిల్ స్టేడియం

మహారాష్ట్రలోని నవీ ముంబైలో స్టేడియం ఉంది. ఇందులో 55,000 మందికి కూర్చునే సౌకర్యం ఉంది.

 

6. ఎకానా ఇంటర్నేషనల్ స్టేడియం

యూపీలోని లక్నోలో ఉన్న స్టేడియంలో 50 వేల మంది కూర్చుని క్రికెట్ ను వీక్షించవచ్చు.

 

7. కేడీ సింగ్ బాబు స్టేడియం

యూపీలోని లక్నోలో ఉన్న మరో స్టేడియం కేడీ సింగ్ బాబు స్టేడియంలో కూడా 50 వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది.

 

8. ఎం.. చిదంబరం స్టేడియం

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న స్టేడియం కూడా 50 వేల మందికి కూర్చునే సామర్ధ్యం కలిగి ఉంది.

 

9. జేఎస్సీఏ (JSCA) ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్న స్టేడియంలో కూడా 50 వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది.

 

10. బారాబతి స్టేడియం

ఒడిశాలోని కటక్ లో ఉన్న బారాబతి స్టేడియం సామర్ధ్యం 45 వేలు.