డిస్నీ+లో అవతార్ 2 విడుదల తేదీ, సమయం : Avatar 2

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూసిన 'అవతార్ 2' (Avatar 2) గత ఏడాది 2022 లో విడుదలయింది. దాదాపు రూ.2000 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

డిస్నీ+లో అవతార్ 2 విడుదల తేదీ, సమయం : Avatar 2

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూసిన 'అవతార్ 2' (Avatar 2) గత ఏడాది 2022 లో విడుదలయింది. దాదాపు రూ.2000 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2009 లో విడుదలైన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘అవతార్’ మూవీకి సీక్వెల్. 2022 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు (Huge collections) సాధించింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఆర్నెళ్లు గడిచింది. డిస్నీ+ తాజాగా ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Disney+Hotstar) అవతార్ 2 జూన్ 7 నుంచి ఇంగ్లీష్ తో పాటు భారతీయ భాషలైన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా భారతదేశంలో ఇప్పటికే ఇప్పటికే ఐట్యూన్స్, గూగుల్ ప్లే, యూట్యూబ్ వంటి నాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినీ ప్రేమికులకు అందుబాటులో ఉంది. కానీ వీటిలో ఈ సినిమా చూడాలంటే మాత్రం కొనుగోలు చేయడమో లేదా రెంట్ చెల్లించడంలో చేయాలి. అయితే నేటి నుంచి హాట్‌స్టార్‌లో (Hotstar) ఈ సినిమా స్ట్రీమింగ్‌కు (streaming) వస్తుండటంతో ఎలాంటి చెల్లింపులు లేకుండా చూడొచ్చు.

అవతార్ 2' గురించి... about 'Avatar 2

'అవతార్ 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.24 వేల కోట్ల వసూళ్లు రాబట్టి హాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బడ్జెట్ కి దాదాపు 12 రేట్లు అత్యధిక వసూళ్లను ఈ చిత్రం సాధించింది. అంతేకాకుండా భారత్ లోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.

అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహంపై దర్శకుడు కామెరూన్ అడవులు, జంతువులతో కొత్త లోకాన్ని సృష్టించాడు. ఇప్పుడు విడుదలైన 'అవతార్ 2' లో సముద్రాపకు అడుగున చిత్రికరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో థ్రిల్లింగ్ కల్పించింది. దీనికి సీక్వెల్ గా 'అవతార్ 3' కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ నిర్మించిన ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాకి సైమన్ ఫ్రాగ్లెన్ సంగీతం అందించారు.

watch avatar 2 for free

అవతార్ 2' రివ్యూ : 'Avatar 2' review

మొదటి భాగం అవతార్ లో... మానవాళికి దూరంగా... అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్య పాండోరా అనే గ్రహం. ఇందులో ఒక 'నావీ' అనే విచిత్ర జాతి ఉన్న సంగతిని కనిపెట్టి, తమకున్న సాంకేతికత ఆయుధ బలంతో వారిని అక్కడి నుంచి నిర్మూలించి ఆ గ్రహాన్ని కబళించాలని మనుష్యులు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నావీ జాతి తమకున్న ప్రత్యేక శక్తులతో... సంకల్ప బలంతో మనుష్యులపై తిరగబడి చివరికి ఈ పోరాటంలో విజయం సాధిస్తారు. అయితే ఈ నావీల విజయంలో ఒక మనిషిది కీలక పాత్ర. తమ రహస్యాలు తెలుసుకునేందుకు తమ అవతారంలోకి మారి పాండోరాకు వచ్చిన జాక్ అనే మనిషి. ఆ తర్వాత నావీల్లో ఒకడిగా మారిపోయి వారికి నాయకత్వం వహిస్తాడు. మనుష్యులతో జరిగిన పోరాటంలో నావీలను గెలిపిస్తాడు. ఇది అవతార్ మొదటి భాగంలోని కథ. 'అవతార్-2' కథ విషయానికి వస్తే... తమపై నావీల విజయంలో కీలక పాత్ర పోషించడమే కాక… నావీల అమ్మాయినే పెళ్లాడి అక్కడే స్థిరపడ్డ జాక్ మీద మనుష్యులు పగబడతారు. జాక్ తో పాటు అతడి కుటుంబాన్నీ అంతమొందించాలని పరాయత్నిస్తారు. అయితే జాక్ దాన్ని ఎలా తిప్పికొట్టాడు... తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

avatar 2 rating on google

Also Check Out - Impressive trailer of Adi Purush

దర్శకుడు కామెరూన్ (Director Cameron) 'అవతార్' సినిమాలో కేవలం విజువల్ మాయాజాలంతో మాత్రమే మెప్పించలేదు. ఇందులో ఒక 'ఆత్మ' ఉందన్న కథను వర్ణించాడు. మనుష్యుల ఆశకు హద్దు లేదని... ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ తనకే సొంతం కావాలని ఆశపడతాడని... అలా అత్యాశకు పోయి ప్రకృతిని కబళించాలని చూస్తే వినాశనం తప్పదనే సందేశాన్ని ఎంతో అద్భుతంగా ప్రపంచానికి అందించాడు. అవతార్-2' (Avatar 2) లో మాత్రం హీరో జాక్ కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది. విజువల్స్ మాత్రం అత్యంత అద్భుతంగా చిత్రీకరించాడు. సముద్రం కేంద్రంగా 'అవతార్ 2' కథ నడుస్తుంది. సముద్ర వింత జీవి హీరో కుటుంబాన్ని రక్షిస్తూ విలన్ల మీద విరుచుకుపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు మన ఒళ్ళు గగుర్పొడిపిస్తాయి. దర్శకుడు కామెరూన్ ఈ 'అవతార్ 2'సినిమాని మొదటి భాగం విడుదలైన 13 సంవత్సరాల తరువాత విడుదల చేసారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసారు. విజువల్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉండడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సాధారణ సినిమా కథ లాగానే రెండో భాగం కథ కూడా ఉందని ఎంతగానో నిరాశ చెందారు.

Read all about bollywood, tollywood news there - Click Here