ఐసీసీ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్, జట్లు, వేదిక, టైమ్‌టేబుల్, అంచనాలు

ఈ ఏడాది 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు (ICC ODI World cup) భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఐసీసీ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్, జట్లు, వేదిక, టైమ్‌టేబుల్, అంచనాలు
ఐసీసీ ప్రపంచ కప్ 2023

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసే 13 వ వన్డే ప్రపంచ క్రికెట్ మరి కొద్ది నెలల్లో జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించే ఈ ప్రపంచ కప్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంది. 1975లో ప్రారంభమైన ఐసీసీ ప్రపంచ కప్ మొదటిసారిగా అన్ని మ్యాచ్‌లు భారత్ లోనే జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్న ఈ ప్రపంచ కప్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

ఈ ఏడాది 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు (ICC ODI World cup) భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచంలో వన్డే క్రికెట్ ఆడే 10 జట్లు (10 teams) ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించగా, మరో రెండు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. 10 జట్లను 5 గ్రూపులుగా విభజించారు. 10 జట్ల మధ్య మొతం 48 మ్యాచ్‌లు (48 matches) జరగనున్నాయి. ఒక్కో జట్టు గ్రూప్ దశలో 4 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి.

ఐసీసీ ప్రపంచ కప్ షెడ్యూల్ : ICC world cup schedule and timetable

ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 13 వ ఎడిషన్ ఈ ఏడాది 5 అక్టోబర్ 2023 నుంచి 19 నవంబర్ 2023 మధ్య జరగనుంది. 1987 లో పాకిస్తాన్‌తో, 1996 లో పాకిస్తాన్, శ్రీలంకతో, మరియు 2011 లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి ప్రపంచ కప్ కు ఉమ్మడిగా భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది మాత్రం అన్ని మ్యాచ్ లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐసీసీ త్వరలోనే షెడ్యూల్, టైం టేబుల్ విడుదల చేయనుంది.

Also Read - The WTC final will be fierce

ఇప్పటివరకూ క్వాలిఫై అయిన 8 జట్లు : 8 teams have qualified so far

భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్

క్వాలిఫయర్స్ లో తలపడే జట్లు : Teams to face off in the qualifiers

వెస్టిండీస్, శ్రీలంక, నేపాల్, యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఓమన్, స్కాంట్లాండ్. ఈ ఏడాది 2023 వన్డే ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ లో జరిగే మ్యాచ్ ల వేదికల వివరాలు : ICC ODI World cup Match venues

 

స్టేడియం

కెపాసిటీ

నగరం

1

MA చిదంబరం స్టేడియం

50000

చెన్నై

2

నరేంద్ర మోదీ స్టేడియం

132000

అహ్మదాబాద్

3

విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం

45000

నాగ్‌పూర్

4

అరుణ్ జైట్లీ స్టేడియం

41842

ఢిల్లీ

5

ఎం. చిన్నస్వామి స్టేడియం

40000

బెంగళూరు

6

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం

27000

మొహాలి

7

వాంఖడే స్టేడియం

33500

ముంబై

8

ఈడెన్ గార్డెన్స్

68000

కోల్‌కతా

ICC ప్రపంచ కప్ 2023 అంచనాలు : ICC World Cup 2023 Predictions

ఈ ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఆతిధ్య భారత జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అసమానతలు చెబుతున్నాయి. సొంత దేశంలో మ్యాచ్ లు అంటే ఏ జట్టుకైనా బలమే. అటు మైదానాలు, ఇటు అభిమానులు. అన్నీ అనుకూలంగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇండియాతో పాటుగా ఇంగ్లాండ్ జట్టు కూడా బలంగానే ఉంది. అందరూ భీకర ఫేమ్ లో ఉండడం కలసివచ్చే అంశంగా చెప్పవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ గత ప్రపంచ కప్ మాదిరిగానే ప్రదర్శన చేసి రెండో ఏడాది కప్ గెలవాలని చూస్తోంది. అయితే 5 సార్లు ప్రపంచ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా 6 వ సారి కప్ సాధించే జట్టుగా క్రికెట్ పండితులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ప్రపంచ కప్ గెలుచుకున్న జట్లు : World Cup winning teams so far

ఆస్ట్రేలియా టీమ్ ప్రపంచ కప్ ను రికార్డు స్థాయిలో అత్యధికంగా 5 సార్లు గెలుచుకుంది. 1996 లో ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. వెస్టిండీస్ రెండుసార్లు ఛాంపియన్ గా నిలవగా, ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. భారత్ సైతం 1983 లో కపిల్ దేవ్ నాయకత్వంలో ఒకసారి, 2011 లో ఎమ్మెస్ ధోనీ నాయకత్వంలో రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. 2003 లో రన్నరప్ గా నిలిచింది. అంతేకాకుండా పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్‌లు ఒక్కోసారి ప్రపంచ కప్ ను ఒడిసిపట్టాయి. న్యూజిలాండ్ రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఆయా సంవత్సరాలలో జరిగిన ప్రపంచ కప్ విజేత జట్ల పూర్తి వివరాలు…

ఎడిషన్

ICC ప్రపంచ కప్

ప్రారంభ తేదీ

చివరి తేదీ

విజేత జట్టు

రన్నరప్ జట్టు

12వ

2019 ప్రపంచ కప్

30-05-2019

14-07-2019

ఇంగ్లండ్

న్యూజిలాండ్

11వ

2015 ప్రపంచ కప్

14-02-2015

29-03-2015

ఆస్ట్రేలియా

న్యూజిలాండ్

10వ

2011 ప్రపంచ కప్

19-02-2011

02-04-2011

భారతదేశం

శ్రీలంక

9వ

2007 ప్రపంచ కప్

13-03-2007

28-04-2007

ఆస్ట్రేలియా

శ్రీలంక

8వ

2003 ప్రపంచ కప్

09-02-2003

23-03-2003

ఆస్ట్రేలియా

భారతదేశం

7వ

1999 ప్రపంచ కప్

14-05-1999

20-06-1999

ఆస్ట్రేలియా

పాకిస్తాన్

6వ

1996 ప్రపంచ కప్

14-02-1996

17-03-1996

శ్రీలంక

ఆస్ట్రేలియా

5వ

1992 ప్రపంచ కప్

22-02-1992

25-03-1992

పాకిస్తాన్

ఇంగ్లండ్

4వ

1987 ప్రపంచ కప్

08-10-1987

08-11-1987

ఆస్ట్రేలియా

ఇంగ్లండ్

3వ

1983 ప్రపంచ కప్

09-06-1983

25-06-1983

భారతదేశం

వెస్ట్ ఇండీస్

2వ

1979 ప్రపంచ కప్

09-06-1979

23-06-1979

వెస్ట్ ఇండీస్

ఇంగ్లండ్

1వ

1975 ప్రపంచ కప్

07-06-1975

21-06-1975

వెస్ట్ ఇండీస్

ఆస్ట్రేలియా

Check Out - Top Indian Online Betting Sites