రేసులో నిలవాలంటే గెలవాలి : must have to win to stay in the race
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ (eliminator match) జరగనుంది. పాయింట్ల పట్టికలో 3, 4వ స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబయి ఇండియన్స్ (MI) ఈ మ్యాచులో నువ్వానేనా అని తేల్చుకోనున్నాయి.
రేసులో నిలవాలంటే గెలవాలి : Must have to win to stay in the race
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) భాగంగా నేడు ఎలిమినేటర్ మ్యాచ్ (eliminator match) జరగనుంది. పాయింట్ల పట్టికలో 3, 4వ స్థానాల్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబయి ఇండియన్స్ (MI) ఈ మ్యాచులో నువ్వానేనా అని తేల్చుకోనున్నాయి. గతేడాది ఐపీఎల్ సీజన్లో (last season) ఎలిమినేటర్ మ్యాచులో ఓడి ఇంటిదారి పట్టిన లక్నో ఈసారి ఆ గండం దాటాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో రెండో అంచెలో రాణించి ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. నేడు జరిగే మ్యాచులో గెలిచే జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్ అడుతుంది. ఓడితే జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనుంది.
నేడు జరగనున్న మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయనుందనడంలో సందేహమే లేదు. ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ఛాంపియన్ (5 times champion) ముంబయి ఇండియన్స్ (MI), గతేడాది లీగ్‌లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనున్నాయి. లక్నో, ముంబయి జట్లు బ్యాటింగ్ పరంగా సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నా... బౌలింగ్‌లో మాత్రం లక్నో జట్టుదే పైచేయిగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో జరిగిన లీగ్ మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్ జట్టుతో మూడు సార్లు తలపడ్డ లక్నో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓటమి పాలైన గుజరాత్ టైటాన్స్‌తో (GT) క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఓడిపోతే మాత్రం లీగ్‌నుంచి నిష్క్రమించక తప్పదు.
గత ఐపీఎల్ (IPL) సీజన్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో వరుసగా రెండో ఏడాది కూడా ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచిన లక్నో 17 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. గత ఏడాది ఎదురైన చేదు అనుభవాన్ని ఈసారి ఎలాగైనా అధిగమించాలనే పట్టుదలతో లక్నో జట్టు ఉంది. టీమ్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 16 వికెట్లు తీసి జట్టులో మిగతా బౌలర్లలో స్ఫూర్తిని నింపుతున్నాడు. బ్యాటింగ్ విభాగం సైతం ఎంతో పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకూ స్టోయినిస్ 368 పరుగులు, మేయర్స్ 361 పరుగులు, పూరన్ 358 పరుగులు చేశారు. గత ఐపీఎల్ సీజన్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో లక్నో జట్టు ఓటమి పాలయింది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైన తరువాత మొదటి అంచెలో రాణించలేకపోయిన 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) రెండో అంచెలో మాత్రం అద్భుత ఆటతీరుతో ప్లేఆఫ్స్ కి చేరుకుంది. మరింత మెరుగ్గా రాణించి ఫైనల్ కి చేరాలని పట్టుదలతో ఉంది. గత ఏడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడి ఎనిమిదింటిలో గెలిచింది. ముంబై టీమ్ 200+ పరుగుల లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తోంది. జట్టులోని బ్యాట్స్‌మన్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, గ్రీన్, డేవిడ్, నేహాల్ వధేరా, తిలక్ వర్మ అద్భుత ఫామ్ లో ఉండి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో పీయూష్ చావ్లా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లకు కళ్లెం వేస్తున్నాడు. ఇప్పటికే 20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మిగతా బౌలర్లు అంతగా రాణించక పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తుండడం జట్టుని ఆందోళన పరుస్తోంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ సీజన్లో అంతగా రాణించకపోయినా జట్టు నాయకత్వం విషయంలో అద్భుతమైన ప్రణాళికలతో ముందుండి నడిపిస్తున్నాడు. రోహిత్ తో పాటుగా బౌలర్లు కూడా రాణిస్తే లక్నో జట్టుకు ముంబై జట్టుని నిలువరించడం కష్టమే అవుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI : LSG playing XI
కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), పెరాక్ మన్‌కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుద్ బదోనీ, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్
ముంబయి ఇండియన్స్ ప్లేయింగ్ XI : MI playing XI
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లేదా విష్ణు వినోద్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్దాన్, పీయుష్ చావ్లా, ఆకాస్ మధ్వాల్, హృతిక్ షోకీన్