నేడు తొలి ప్లేఆఫ్ పోరు : Today is the first playoff match
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు (70 matches) ముగియడంతో ప్లేఆఫ్ మ్యాచ్‌లకు తెర లేచింది. మొత్తం నాలుగు టీమ్‌లు (4 teams) ఐపీఎల్ 2023 (IPL 2023) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ప్లేఆఫ్స్ కి చేరుకున్న జట్లలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా నేడు మొదటి ప్లేఆఫ్ మ్యాచ్ (1st playoff match) జరగనుంది.
నేడు తొలి ప్లేఆఫ్ పోరు : Today is the first playoff match
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో లీగ్ మ్యాచ్‌లు (70 matches) ముగియడంతో ప్లేఆఫ్ మ్యాచ్‌లకు తెర లేచింది. మొత్తం నాలుగు టీమ్‌లు (4 teams) ఐపీఎల్ 2023 (IPL 2023) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ప్లేఆఫ్స్ కి చేరుకున్న జట్లలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా నేడు మొదటి ప్లేఆఫ్ మ్యాచ్ (1st playoff match) జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. లీగ్ దశలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది.
ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) తొలి మ్యాచ్‌లో తలపడిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ప్లేఆఫ్ మ్యాచ్ ఆడుతుండడం గమనార్హం. నేడు చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు కూడా ఫైనల్స్‌కు చేరడమే కాకుండా నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో ఐపీఎల్ ట్రోఫీ కోసం తలపడుతుంది.
చెన్నైపై గుజరాత్ దే ఆధిపత్యం : Gujarat dominates over Chennai
గత ఏడాది జరిగిన 15 వ సీజన్ (2022) లో ఆరంగేట్రం (Debut) చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) సంచలన ప్రదర్శనతో కప్ ఎగరేసుకుపోయింది. ఆ సీజన్ తో పాటుగా ఈ సీజన్లో కూడా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్‌ల్లో గుజరాత్ (GT) జట్టుదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ తలపడిన మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టే గెలిచింది. నేడు జరిగే మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ (home ground) లో జరుగుతుండడంతో చెన్నై గెలుపుపై అభిమానులు ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ : Chennai Super Kings
ఐపీఎల్ చరిత్రలో 4 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ జత ఏడాది జరిగిన 15 వ సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ 8 విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. గుజరాత్ టీమ్ లాగానే చెన్నై టీమ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నారు. అజింక్య రహానే, శివమ్ దూబే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. అంబటి రాయుడు, మొయిన్ అలీ గనుక ఫామ్ లోకి వస్తే మాత్రం బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం. కెప్టెన్ ధోని, జడేజా అద్భుతమైన మ్యాచ్ ఫినిషింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జడేజా అటు బ్యాట్, బంతితో కీలక పాత్ర పోషిస్తుండగా తుషార్ దేశ్‌పాండే, మహిషా తీక్షన్, మతీషా పతిరానా, మొయిన్ అలీ బౌలింగ్ సేవలు అందిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ : Gujarat Titans
డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (GT) ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ ఆసాంతం కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ 16 వ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. గుజరాత్ టీమ్ అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అత్యంత పటిష్టంగా ఉంది. వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్‌లు టీమ్‌కి మంచి ఆరంభాన్ని అందించగలుగుతున్నారు. శుభ్‌మన్ గిల్ అయితే ఈ టోర్నీలో 2 సెంచరీలతో సహా మొత్తం 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో డుప్లెసిస్ తరువాతి స్థానంలో ఉన్నాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియాలతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. పాండ్యాతో పాటు రషీద్ ఖాన్ కూడా ఆల్ రౌండర్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. బౌలింగ్ లో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ లతో పటిష్టంగా ఉండి బ్యాట్స్‌మన్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్ల అభిమానులకు కనువిందు చేయనుందని చెప్పవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : CSK playing XI
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్& వికెట్ కీపర్ ), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI : GT playing XI
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, యశ్ దయాల్, విజయ్ శంకర్