పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేతలు : Men's ODI World Cup winners

క్రికెట్... ఫుట్ బాల్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ఎన్నో రికార్డులు... ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ గురించి ఎన్నో విశేషాలు రోజుల తరబడి చెప్పుకోవాల్సి ఉంటుంది.

పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేతలు : Men's ODI World Cup winners

క్రికెట్... ఫుట్ బాల్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ఎన్నో రికార్డులు... ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ గురించి ఎన్నో విశేషాలు రోజుల తరబడి చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత గొప్పగా ఆదరణ పొందింది. ఇప్పటివరకూ జరిగిన పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేతలు, అందుకు సంబంధించిన విశేషాలను ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇప్పటివరకూ జరిగిన టోర్నీల్లో ఐదు సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకుంది. మరో రెండుసార్లు రన్నరప్గా నిలిచింది. భారత్ సైతం రెండు సార్లు విజేతగా నిలిచింది.

 

1975 క్రికెట్ ప్రపంచ కప్

ఇంగ్లండ్ తొలి క్రికెట్ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చింది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ మొదటి ఎడిషన్లో 8 జట్లు పాల్గొన్నాయి. ప్రపంచకప్ ప్రారంభ సీజన్లో వెస్టిండీస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి మొట్టమొదటి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇందులో ఆస్ట్రేలియా రన్నరప్ గా నిలిచింది. ఇది 60 ఓవర్ల ప్రపంచకప్. వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ప్రపంచకప్ గెలిచిన మొదటి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.

 

1979 క్రికెట్ ప్రపంచ కప్

ఇంగ్లండ్ రెండో సారి కూడా ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చింది. సారి కూడా 8 జట్లు ఇందులో పాల్గొన్నాయి. మునుపటి టోర్నమెంట్ మాదిరిగానే, ప్రతి జట్టు అద్భుత ప్రదర్శన ఇచ్చాయి. అయితే తూర్పు ఆఫ్రికా స్థానంలో కెనడా టోర్నీలో పాల్గొంది. టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు జరిగాయి. క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో వెస్టిండీస్ రెండోసారి టైటిల్ గెలుచుకుంది.

 

1983 క్రికెట్ ప్రపంచ కప్

వరుసగా మూడోసారి ఇంగ్లండ్ ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది. టోర్నీలో ఎనిమిది జట్లు మొత్తం 27 మ్యాచ్లు ఆడాయి. ఈసారి కెనడా స్థానంలో జింబాబ్వే ప్రపంచకప్లో పాల్గొంది. సారి టోర్నీలో మొదటి సారిగా భారత్ వెస్టిండీస్ ని ఖంగు తినిపించి విజేతగా నిలిచింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి తొలిసారిగా ప్రపంచ కప్ ను ముద్దాడింది.

 

1987 క్రికెట్ ప్రపంచ కప్

1987 ప్రపంచ కప్ 4 ఎడిషన్, దీనిని రిలయన్స్ కప్ అని కూడా పిలుస్తారు. భారత్‌, పాకిస్థాన్లు ప్రపంచ కప్ కు సంయుక్తంగా నిర్వహించాయి. గత ప్రపంచ కప్ లో పాల్గొన్న దేశాలే సారి కూడా పాల్గొన్నాయి. ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను 7 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

1992 క్రికెట్ ప్రపంచ కప్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా క్రికెట్ ప్రపంచ కప్ 5 ఎడిషన్ను నిర్వహించాయి. టోర్నీలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొన్నాయి. మొత్తం 39 మ్యాచ్ లు జరిగాయి. తొమ్మిది దేశాల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మరియు శ్రీలంక జట్లు ఉన్నాయి. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఇంగ్లాండ్ జట్టును 22 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

1996 క్రికెట్ ప్రపంచ కప్

1996 ప్రపంచ కప్ను "విల్స్ వరల్డ్ కప్ 1996" అని కూడా పిలుస్తారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చాయి. సారి జరిగిన ప్రపంచకప్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి. శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది. కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో శ్రీలంక ప్రపంచకప్ గెలవడం ఇదే తొలిసారి.

 

1999 క్రికెట్ ప్రపంచ కప్

ప్రపంచ కప్ కి ఇంగ్లాండ్, వేల్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్జట్లు ఆతిథ్యం ఇచ్చాయి. ఇది 7 క్రికెట్ ప్రపంచ కప్. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను ఓడించి విజేతగా నిలిచింది. స్టీవ్ వా ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

 

2003 క్రికెట్ ప్రపంచ కప్

ఇది ఐసిసి క్రికెట్ 8 ప్రపంచ కప్. దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వేలు సారి జరిగిన ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చాయి. ప్రపంచకప్లో 673 పరుగులతో అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసిన సచిన్ టెండూల్కర్కు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియా, భారత్  జట్లు ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా భారత్ ను 125 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

2007 క్రికెట్ ప్రపంచ కప్

కరేబియన్ దేశాలు 2007 క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చాయి. ప్రపంచ కప్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. టోర్నీలో మొత్తం 51 మ్యాచ్లు జరిగాయి. శ్రీలంక, ఆస్ట్రేలియా ఫైనల్స్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకను 53 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

2011 ఐసీసీ ప్రపంచ కప్

ఏడాది ప్రపంచకప్ను భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించాయి. టోర్నీలో మొత్తం 14 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం 49 మ్యాచ్ లు జరిగాయి. MS ధోని సారథ్యంలోని భారత్ జట్టు శ్రీలంకపై ఫైనల్స్ లో గెలిచి 28 ఏళ్ల సుదీర్ఘ ఓటమి తర్వాత  ప్రపంచకప్ను గెలుచుకుంది. ఫైనల్స్ లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

2015 క్రికెట్ ప్రపంచ కప్

11 ప్రపంచకప్ ను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. ప్రపంచకప్లో మొత్తం 14 జట్లు పాల్గొన్నాయి. జట్లు 49 మ్యాచ్లు ఆడాయి. మైఖేల్ క్లార్క్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ను ఓడించి, ఫైనల్స్లో ఆస్ట్రేలియా టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.

 

2019 ICC ప్రపంచ కప్

ప్రపంచకప్ 12 ఎడిషన్కు ఇంగ్లండ్, వేల్స్ ఆతిథ్యం ఇచ్చింది. సిరీస్లో ప్రపంచం నలుమూలల నుంచి 10 జట్లు తలపడ్డాయి. 48 మ్యాచ్ లు జరిగాయి. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ తర్వాత కూడా మ్యాచ్ టై అయింది. దీంతో బౌండరీల లెక్కింపులో న్యూజిలాండ్పై ఇంగ్లండ్విజయం సాధించి తొలిసారి విజేతగా నిలిచింది.