ఐపీఎల్ లో నేడు ఢిల్లీ v గుజరాత్ పోరు : Today in IPL, Delhi vs Gujarat
ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న 7 వ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.
ఐపీఎల్ లో నేడు ఢిల్లీ v గుజరాత్ పోరు : Today in IPL, Delhi vs Gujarat
ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న 7 వ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.
ఐపీఎల్ (IPL) లీగ్ మ్యాచ్ల్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు పోటీ పడనున్నాయి. ఢిల్లీ టీమ్ ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి చెందింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను ఓడించి మంచి జోరు మీద ఉంది. దీంతో నేడు జరిగే మ్యాచ్ను గెలవాలని గుజరాత్ టీమ్, రెండో మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఢిల్లీ టీమ్ ఆశిస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య ఐపీఎల్ (IPL) లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ల్లోని గణాంకాలను (stats), ఆయా టీమ్స్ కి సంబంధించిన ఆటగాళ్ల వివరాలు, తుది జట్టులో ఆడేందుకు అవకాశం ఉన్న ఆటగాళ్లు, మ్యాచ్ జరిగే స్టేడియంకి సంబంధించిన అన్ని వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఢిల్లీ vs గుజరాత్ హెడ్ టు హెడ్ : DC vs GT head to head
ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు గత సీజన్లో (15th season, 2022) ఒకసారి తలపడ్డాయి. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టు విజయం (Titans win) సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు (171/6) చేసింది. శుభమన్ గిల్ (Shubman Gill) 84, హార్థిక్ పాండ్యా 31, డేవిడ్ మిల్లర్ 20 పరుగులు చేసారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే (157/9) పరిమితమయింది. ఢిల్లీ జట్టులోని రిషబ్ పంత్ 43 పరుగులు చేసాడు. గుజరాత్ జట్టు బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) 4/28 (4 వికెట్లు) తీసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ (Man of the match) అందుకున్నాడు. ఈ ఏడాది ఢిల్లీ టీమ్ కి డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా (DC captain David warner) వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ జట్టు లక్నో జట్టుపై (LSG) 50 పరుగుల తేడాతో తమ మొదటి మ్యాచ్లో ఓటమి చెందింది.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI : GT playing XI
శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, మహ్మద్ షమీ, యష్ దయాల్/సాయి సుదర్శన్
గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : Gujarat Titans full Squad
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్, యష్ దయాల్, అల్జారీ జోసెఫ్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, శ్రీకర్ భరత్, అభినవ్ మనోహర్, ప్రదీప్ సాంగ్వాన్, మాథ్యూ వేడ్, ఓడియన్ స్మిత్, డేవిడ్ మిల్లర్, R సాయి కిషోర్, శివమ్ మావి, దర్శన్ నల్కండే, ఉర్విల్ పటేల్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI : DC playing XI
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మన్ పావెల్, అమన్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్/మనీష్ పాండే
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ స్క్వాడ్ : Delhi Capitals full Squad
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రిలీ రోసౌవ్, రోవ్మన్ పావెల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, మనీష్ పాండే, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ, కమలేష్ నాగర్కోటి, రిపాల్ పటేల్, యష్ ధుల్, విక్కీ ఓస్త్వాల్
మ్యాచ్ జరిగే మైదానం (Match playing ground) : అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
మ్యాచ్ మొదలయ్యే సమయం (Match will start) : 7:30 PM
లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : స్టార్ స్పోర్ట్స్ (Star Sports), జియో సినిమా (Jio Cinema)
2023 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో రుతురాజ్ : Ruthuraj is in race 2023 IPL Orange Cap
ఏ ఏడాది 16 వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకూ 2 మ్యాచ్లు ఆడి 149 పరుగులు చేసాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. స్ట్రయిక్ రేట్ 183 గా ఉంది. 92 పరుగులు రుతురాజ్ అత్యధిక స్కోర్. 74 యావరేజ్ తో ఈ పరుగులు సాధించాడు. రెండు మ్యాచ్ల్లో కలిపి 13 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విజేతలు : IPL orange Cap winners
ఐపీఎల్ (IPL) మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కు (Highest runs) ఆరెంజ్ క్యాప్ (Orange cap) ను అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకూ 15 సీజన్లు ముగిసాయి. ప్రస్తుతం ఈ ఏడాది 16 వ సీజన్ ప్రారంభమయ్యింది. తమ ధనాధన్ బ్యాటింగ్ తో బ్యాట్స్మెన్లు (batsmen) పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆరెంజ్ క్యాప్ ను అవార్డుగా అందుకున్న వారి వివరాలు, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16 వ సీజన్లో (IPL 16th season) అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న బ్యాట్స్మెన్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
సంవత్సరం (Year) |
ఆరెంజ్ క్యాప్ హోల్డర్ (Orange cap holder) |
మ్యాచ్‌లు (Matches) |
పరుగులు (Runs) |
2008 |
షాన్ మార్ష్ (Shaun Marsh) |
11 |
616 |
2009 |
మాథ్యూ హెడెన్ (Mathew Hayden) |
12 |
572 |
2010 |
సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) |
15 |
618 |
2011 |
క్రిస్ గేల్ (Chris Gayle) |
12 |
608 |
2012 |
క్రిస్ గేల్ (Chris Gayle) |
15 |
733 |
2013 |
మైకేల్ హస్సీ (Michel Hussey) |
17 |
733 |
2014 |
రాబిన్ ఊతప్ప (Robin Utappa) |
16 |
660 |
2015 |
డేవిడ్ వార్నర్ (David Warner) |
14 |
562 |
2016 |
విరాట్ కోహ్లీ (Virat Kohli) |
16 |
973 |
2017 |
డేవిడ్ వార్నర్ (David Warner) |
14 |
641 |
2018 |
కేన్ విలియమ్సన్ (Kane Williamson) |
17 |
735 |
2019 |
డేవిడ్ వార్నర్ (David Warner) |
12 |
692 |
2020 |
కేఎల్ రాహుల్ (KL Rahul) |
14 |
670 |
2021 |
రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) |
16 |
635 |
2022 |
జాస్ బట్లర్ (Jos Buttler) |
17 |
863 |