వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు : Fastest Centuries in ODI's

సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ నేటి తరం యువ క్రికెటర్లు తమ ధనాధన్ బ్యాటింగ్ తో సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నారు.

వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు : Fastest Centuries in ODI's

 

వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు : Fastest Centuries in ODI's

 

సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ నేటి తరం యువ క్రికెటర్లు తమ ధనాధన్ బ్యాటింగ్ తో సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నారు.

 

సెంచరీలు కొట్టే వయస్సు మాది

వన్డే క్రికెట్... ఎప్పటికీ క్రికెట్ ప్రేమికులకు ఆనందాన్ని అందిస్తుంది. తమ అభిమాన బ్యాట్స్మెన్ సాధించే సెంచరీ కోసం టీవీలకు అతుక్కుపోతారు. అదే సెంచరీని తక్కువ బంతుల్లోనే వేగంగా సాధిస్తే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు. సంబరాల్లో మునిగి పోతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

 

1. ఏబీ డివిలియర్స్ (ఏబీడీ)

దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్మెన్ మిస్టర్ 360 గా క్రికెట్ ప్రేమికులకు సుపరిచితుడు. తన బ్యాటింగ్ స్టయిల్ తో బౌలర్లను ఉతికారేయడం ఏబీడీ స్పెషల్. వెస్టిండీస్ తో జోహన్నెస్బర్గ్లో జరిగిన వన్డేలో చెలరేగి తక్కువ బంతుల్లోనే సెంచరీని నమోదు చేసాడు. మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 300 దాటింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో మిగిలిన 8 ఓవర్లలో ఏబీడీ చెలరేగడంతో స్కోర్ 439 పరుగులకు చేరుకుంది. కేవలం 31 బంతుల్లోనే ఏబీడీ సెంచరీని పూర్తి చేసాడు. మొత్తం మీద 44 బంతుల్లో 338.63 స్ట్రైక్ రేట్తో 149 పరుగులు చేశాడు. ఇందులో 16 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.

డివిలియర్స్ బ్యాటింగ్ గణాంకాలు

డివిలియర్స్ సెంచరీ హైలైట్స్

కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ డివిలియర్స్ పేరున ఎన్నో రికార్డులున్నాయి. టెస్టుల్లో 22 సెంచరీలు, 46 అర్ధసెంచరీలతో సహా 8,000 పరుగులు చేశాడు. 78 టెస్టుల్లో ఒక్కసారి కూడా డకౌట్ కాకుండా ఉన్న రికార్డు డివిలియర్స్ పేరు మీదనే ఉంది. డివిలియర్స్ క్రికెట్ మాత్రమే కాకుండా రగ్బీ, గోల్ఫ్, టెన్నిస్ కూడా ఆడతాడు.

 

2. కోరే ఆండర్సన్

న్యూజిలాండ్కు చెందిన కోరీ ఆండర్సన్ 2014 లో వన్డేల్లో రెండవ వేగవంతమైన సెంచరీ వెస్టిండీస్పై చేసాడు. కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఆండర్సన్ 47 బంతుల్లో 14 సిక్సర్లు, 6 ఫోర్లతో 278.72 స్ట్రైక్ రేట్తో మొత్తం 131 పరుగులతో ఇన్నింగ్స్లో నాటౌట్గా నిలిచాడు.

 

ఆండర్సన్ మంచి ఆల్ రౌండర్. తన జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. వన్డేలో ఒక ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు కొట్టిన క్రికెటర్లలో 7 స్థానంలో ఉన్నాడు. టీ20 ల్లో ఒక ఇన్నింగ్స్ లో నాలుగు క్యాచ్ లు పట్టి మొదటి స్థానంలో ఉన్నాడు.

అండర్సన్ బ్యాటింగ్ గణాంకాలు

అండర్సన్ సెంచరీ హైలైట్స్

3. షాహిద్ అఫ్రిది

వన్డేల్లో మొదటి సారిగా అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్ అఫ్రిది. రికార్డును 18 ఏళ్ళ తర్వాత అండర్సన్ బద్దలు కొట్టాడు. అఫ్రిది 1996లో కేవలం 37 బంతుల్లోనే తానాడిన రెండవ వన్డేలోనే ఘనత సాధించాడు. సెంచరీని శ్రీలంకపై చేసాడు. అఫ్రిది స్కోర్ లో 6 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. మరోసారి 45 బంతుల్లోనే శతకాన్ని భారత్ పై చేసాడు. ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి.

 

తన 16 ఏళ్ళ వయసులోనే పాకిస్తాన్ తరపున వన్డేల్లో ప్రవేశించాడు. ఒక మంచి ఆల్ రౌండర్. బౌలింగ్ లో కూడా వికెట్లు తీసి తన జట్టును ఎన్నో మ్యాచుల్లో గెలిపించాడు. 4000 పరుగులు, 300 వికెట్లు తీసిన ఆల్ రౌండర్లలో జయసూరియా, అఫ్రిది మాత్రమే ఉన్నారు. 2010 లో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డేలో బాల్ టాంపరింగ్ వివాదంతో అఫ్రిది అభాసుపాలయ్యాడు.

షాహిద్ అఫ్రిది బ్యాటింగ్ గణాంకాలు

షాహిద్ అఫ్రిది సెంచరీ హైలైట్స్

4. మార్క్ బౌచర్

దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మార్క్ బౌచర్ కేవలం 44 బంతుల్లోనే శతకం సాధించాడు. శతకంలో 8 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జింబాబ్వే పై స్కోర్ ను సాధించిన బౌచర్ మ్యాచ్ లో మొత్తం మీద 68 బంతుల్లో 147 పరుగులు చేసాడు. దీంతో దక్షిణాఫ్రికా 418 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా 2006 లో  రెండోసారి కూడా చేసిన 400 పైగా చేసిన వన్డేలో కూడా బౌచర్ సెంచరీ సాధించాడు.

మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా కోచ్ గా ఉన్నాడు. వికెట్ల వెనుక కీపర్ గా జట్టు కోసం ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.వికెట్ కీపర్ గా అంతర్జాతీయ మ్యాచుల్లో 998 మందిని అవుట్ చేసాడు. ఇందులో 147 టెస్ట్ మ్యాచుల్లో 555 మందిని అవుట్ చేసాడు. టెస్టుల్లో 500 క్యాచ్ లు పట్టిన కీపర్ గా ఖ్యాతి గడించాడు.

బౌచర్ బ్యాటింగ్ గణాంకాలు

బౌచర్ సెంచరీ హైలైట్స్

5. బ్రియాన్ లారా

టెస్ట్ మ్యాచ్ లు, వన్డేల్లో లారా పేరున ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. 1999లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ లో కేవలం 45 బంతుల్లోనే అతని వేగవంతమైన సెంచరీని సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు, 18 ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ లో మొత్తం మీద లారా 190 స్ట్రైక్ రేట్తో 62 బంతుల్లో 117 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించాడు. టెస్ట్ మ్యాచ్ లో కూడా 400 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మన్ గా లారా పేరునే రికార్డు ఉంది.

వెస్టిండీస్ కి చెందిన లారా 1994 లో రెండు నెలల వ్యవధిలో టెస్ట్ లో 375, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 501 స్కోర్లు సాధించి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. 131 టెస్ట్ మ్యాచుల్లో 232 ఇన్నింగ్స్ ఆడి 11953 పరుగులు, వన్డేల్లో 299 మ్యాచ్ లు ఆడి 10405 పరుగులు చేసాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 440 ఇన్నింగ్స్ ఆడి 22156 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 501 కావడం విశేషం.

లారా బ్యాటింగ్ గణాంకాలు

లారా సెంచరీ హైలైట్స్

6. జెస్సీ రైడర్

న్యూజిలాండ్ కి చెందిన రైడర్ 2014 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. 46 బంతుల్లోనే శతక్కొట్టాడు. శతకంలో 5 సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. దీన్ని 203 స్ట్రైక్ రేట్ తో సాధించాడు. మ్యాచ్ లోనే కోరీ అండర్సన్ కూడా తన వేగవంతమైన సెంచరీ చేయడం విశేషం.

 

జెస్సీ రైడర్ అన్ని రకాల ఫార్మాట్ లను ఆడాడు. అతను టెస్ట్లకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్. వన్డేలలో ఓపెనింగ్ బ్యాట్స్మన్. రైడర్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. గతంలో 2002 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 18 టెస్ట్ మ్యాచుల్లో 1269 పరుగులు, 42 వన్డే ఇన్నింగ్స్ లో 1362 పరుగులు చేసాడు.

జెస్సీ రైడర్ బ్యాటింగ్ గణాంకాలు

జెస్సీ రైడర్ సెంచరీ హైలైట్స్

7. జాస్ బట్లర్

ఇంగ్లాండ్ క్రికెట్ కి ఇప్పటి తరంలో ఒక ఆధునిక క్రికెటర్ బట్లర్ రూపంలో దొరికాడని చెప్పవచ్చు. మిడిలార్డర్ లో ఆడే బట్లర్ బౌలర్లను ఊచకోత కోస్తూ 2015 లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన వన్డేలో కేవలం 46 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. ఇందులో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. 223.08 బట్లర్ స్ట్రైక్ రేట్

టీ20 లకి సరిగ్గా సరిపోయే క్రికెటర్ బట్లర్. 21 శతాబ్దానికి ఇంగ్లాండ్ ని పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఉన్నత స్థానంలో నిలిపాడు. 2016 నుండి ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. 57 టెస్టుల్లో 100 ఇన్నింగ్స్ ఆడి 2907 పరుగులు, వన్డేల్లో 132 ఇన్నింగ్స్ ఆడి 4275 పరుగులు చేసాడు. వన్డేల్లో 10 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

బట్లర్ బ్యాటింగ్ గణాంకాలు

జాస్ బట్లర్ సెంచరీ హైలైట్స్

8. సనత్ జయసూరియ

శ్రీలంక కి చెందిన సనత్ జయసూరియ ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో టన్నుల కొద్దీ పరుగులు చేసాడు. 1996 లో సింగపూర్ లో జరిగిన మ్యాచ్ లో 48 బంతుల్లో సెంచరీ చేసాడు. మ్యాచ్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 65 బంతుల్లో 132 పరుగులు సాధ్నచాడు. బౌలింగ్ లో కూడా తన 10 ఓవర్ల పూర్తి కోటాను పూర్తి చేసి 45 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.

ఆధునిక క్రికెట్ లో హార్డ్ హిట్టర్ గా, ఆల్ రౌండర్ గా పేరుగాంచిన జయసూరియ తన అద్భుతమైన ప్రతిభతో శ్రీలంక కు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ నుంచి మిడిలార్డర్ ఆడి అనంతరం ఓపెనర్ గా స్థిరపడ్డాడు. 110 టెస్టుల్లో 188 ఇన్నింగ్స్ ఆడి 6973 పరుగులు చేసాడు. ఇందులో 14 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలున్నాయి. వన్డేల్లో 433 ఇన్నింగ్స్ ఆడి 13430 పరుగులు చేసాడు. 368 వన్డేల్లో 323 వికెట్లు తీసాడు. గణాంకాలే జయసూరియాను మంచి ఆల్ రౌండర్ గా నిరూపిస్తాయి.

జయసూరియ బ్యాటింగ్ గణాంకాలు

జయసూరియ సెంచరీ హైలైట్స్

9. కెవిన్ ఓబ్రియన్

ఐర్లాండ్ కి చెందిన కెవిన్ జోసెఫ్ 'బ్రియన్ 50 ఓవర్ల ప్రపంచ కప్లో అత్యంత వేగవంతమైన సెంచరీని 2 మార్చి 2011 ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో సాధించాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో శతక్కొట్టాడు.

ఓబ్రియన్ బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ రాణించి వికెట్లు తీస్తుంటాడు. 144 వన్డే ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో 3619 పరుగులు, 116 వన్డేల్లో బౌలింగ్ చేసి 114 వికెట్లు తీసాడు. టీ20 ల్లో 103 ఇన్నింగ్స్ లో 1973 పరుగులు చేసాడు. 52 టీ20 ల్లో 58 వికెట్లు తీసాడు.

కెవిన్ ఓబ్రియన్ బ్యాటింగ్ గణాంకాలు

కెవిన్ ఓబ్రియన్ సెంచరీ హైలైట్స్

10. గ్లెన్ మాక్స్వెల్

ఆస్ట్రేలియా కి చెందిన మాక్స్వెల్ శ్రీలంకతో జరిగిన వన్డేలో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇది క్రికెట్ ప్రపంచ కప్ లో వేగవంతమైన సెంచరీలో రెండోది.

మాక్స్వెల్ మంచి ఆల్ రౌండర్. టీ20 ల్లో తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లను ఆడుకుంటాడు. ఐపీఎల్ లో ఆడుతూ భారత్ లో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. 2022 బిగ్ బాష్ లీగ్ (BBL)లో 41 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని చేసి లీగ్ లో చరిత్ర సృష్టించాడు. మొత్తమ్మీద 64 బంతుల్లోనే 154 పరుగులు చేసాడు.

మాక్స్‌వెల్ బ్యాటింగ్ గణాంకాలు

మాక్స్‌వెల్ సెంచరీ హైలైట్స్

క్రికెట్ అంటేనే రికార్డుల పర్వం. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు రికార్డులను సవరిస్తూనే ఉంటారు. అయితే ఎవరెన్ని రికార్డులు సృష్టించినా చివరికి గెలిచేది క్రికెట్ మాత్రమే. అభిమానించేది క్రికెట్ నే. 2023 లో జరగనున్న ఆసియా కప్, ప్రపంచ కప్, ఐపీఎల్ లో ఇంకా ఎన్ని రికార్డులు నమోదవుతాయో వేచి చూద్దాం.