ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ vs పంజాబ్ మ్యాచ్ : RR vs PBKS match in IPL today

అందరి అంచనాలను (expectations) తలక్రిందులు చేస్తూ గెలుపొందుతాయని అనుకున్న జట్లు చతికిలపడుతున్నాయి. నమ్మకం లేని జట్లు దూసుకుపోతున్నాయి. అందుకే ధనాధన్ క్రికెట్లో ఏదైనా అసాధ్యమనే అంటారు. అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్ మ్యాచ్ (IPL matches) లు జరుగుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ vs పంజాబ్ మ్యాచ్ : RR vs PBKS match in IPL today

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ vs పంజాబ్ మ్యాచ్ : RR vs PBKS match in IPL today

అందరి అంచనాలను (expectations) తలక్రిందులు చేస్తూ గెలుపొందుతాయని అనుకున్న జట్లు చతికిలపడుతున్నాయి. నమ్మకం లేని జట్లు దూసుకుపోతున్నాయి. అందుకే ధనాధన్ క్రికెట్లో ఏదైనా అసాధ్యమనే అంటారు. అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్ మ్యాచ్ (IPL matches) లు జరుగుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.

 

ఐపీఎల్ 16 సీజన్లో (IPL 16th season) ఆడిన తొలి మ్యాచుల్లో విజయం సాధించిన రెండు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి సీజన్ 2008 లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయం సాధించింది. తరువాత చెప్పుకోదగిన ఆట తీరు లేదు. అయితే గత ఏడాది జరిగిన 15 సీజన్ ఐపీఎల్ లో రన్నరప్ గా (15th season runner-up) రాజస్థాన్ నిలిచింది. ఏడాది తాము ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. పంజాబ్ జట్టు (Punjab kings) అయితే ఇప్పటివరకూ ఐపీఎల్ లో టైటిల్ సాధించలేదు. కేవలం 2014 లో మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన చేసి రన్నరప్ (PBKS 2014 runner-up) గా నిలిచింది పంజాబ్ టీమ్. అయితే ఏడాది పంజాబ్ టీమ్ విజయంతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒకరు గత ఏడాది రన్నరప్ స్థానాన్ని విజేతగా నిలవాలని ఎదురు చూస్తుంటే... ఏడాది అయినా ఐపీఎల్ టైటిల్ (IPL title) నెగ్గాలని చూస్తోంది. మరి రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 15 ఐపీఎల్ సీజన్లలో తలపడిన మ్యాచ్ లు (15 seasons head to head), వాటి జయాపజయాలు, ఆటగాళ్ల వివరాలు, మ్యాచ్ జరిగే ప్రదేశాలను ఒకసారి పరిశీలిద్దాం.

రాజస్థాన్ vs పంజాబ్ హెడ్ టు హెడ్ : RR vs PBKS head to head

రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ (PBKS) జట్లు ఇప్పటివరకూ జరిగిన మొత్తం 15 ఐపీఎల్ సీజన్లలో 24 సార్లు (faced 24 times) తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ టీమ్ అత్యధికంగా 14 (RR wins 14 matches) సార్లు గెలుపొందింది. 10 మ్యాచుల్లో పంజాబ్ జట్టు (PBKS wins 10 matches) విజయం సాధించింది. రాజస్థాన్ టీమ్ అత్యధిక స్కోర్ 226 పరుగులు. 112 అత్యల్ప స్కోర్. ఇక పంజాబ్ టీమ్ అత్యధిక స్కోర్ 223 (highest score) పరుగులు కాగా, 124 పరుగులు అత్యల్ప స్కోర్ (lowest score). గత ఏడాది ఇరు జట్లు తలపడిన మ్యాచ్ లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గువాహటీ (Guwahati) వేదికగా రోజు సాయంత్రం 7:30 మ్యాచ్జరుగనుంది. ఇరు జట్లూ కూడా తమ రెండో విజయం సాధించాలని ఎదురు చూస్తున్నాయి.

 

ఫామ్ లో రాజస్థాన్ రాయల్స్ : Rajasthan Royals in form

ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) ఆరంభ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR) చెలరేగిపోయింది. సన్రైజర్స్హైదరాబాద్ (SRH) తో జరిగిన మ్యాచ్ లో 200 కి పైగా స్కోర్ సాధించింది. టీమ్ లోని ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. రాయల్స్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) తన బ్యాటింగ్ (bating) తో జట్టుకి మూలస్తంభంలా నిలిచాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో సంజూ బాదిన సిక్సర్లు (Sanju sixers) అందరినీ అలరించాయి. సంజూకి తోడుగా హెట్మైయిర్‌, దేవదత్పడిక్కల్‌, జేసన్హోల్డర్‌, రియాన్పరాగ్‌, అక్షత్వశిష్ట మిడిలార్డర్లో (middle order) బ్యాటింగ్ చేయగల సమర్థులు. ఇక బౌలింగ్ విభాగం ట్రెంట్బౌల్ట్‌, యజువేంద్ర చాహల్‌, కేఎం ఆసిఫ్‌, హోల్డర్‌, పరాగ్‌, సందీప్శర్మతో పటిష్ఠంగా ఉంది.

ధావన్ బ్యాచ్ మెరుపులు : Dhawan batch in swing

భారత్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ (Shikar Dhawan) సారథ్యంలోని పంజాబ్ జట్టు (PBKS) తాము ఆడిన మొదటి మ్యాచ్ లో దుమ్ము రేపింది. ప్రత్యర్థి జట్టుపై తమ బ్యాటింగ్ ఆధిపత్యాన్ని కనబరిచింది. సీజన్లో ఆడిన తొలి మ్యాచ్ (first match) లో మెరుపు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా దిగిన ప్రభు సిమ్రన్‌, శిఖర్ ధావన్అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. శ్రీలంక బ్యాట్స్మెన్ భానుక రాజపక్స (Bhanuka Rajapaksa) బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. టీమ్ లోని మిగతా ఆటగాళ్లు జితేశ్‌, సికిందర్రజా, సామ్కర్రాన్, షారుఖ్ఖాన్అందరూ మంచి ఫామ్ లో (in form) ఉన్నారు. అర్షదీప్‌, నాథన్ ఎలిస్‌, రాహుల్చాహర్‌, సికిందర్రజా బౌలింగ్మెరుగ్గానే ఉంది. అయితే సామ్ కర్రాన్ (Sam Curran), రిషి ధావన్ బౌలింగ్ లో ఇంకా మెరుగ్గా రాణిస్తే రాజస్థాన్ కు తిప్పలు తప్పవు. లియామ్లివింగ్స్టోన్ జట్టులోకి వస్తే పంజాబ్ జట్టు మరింత పటిష్ఠంగా ఉంటుందని చెప్పవచ్చు.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI : PBKS playing XI

శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుకా రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్

 

పంజాబ్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్ : PBKS full squad

శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ టైడే, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడా, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్, సామ్ కర్రాన్, సికందర్ రజా, హర్ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, మోహిత్ రాథీ, శివమ్ సింగ్

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI : Royals playing XI

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

 

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు : RR full squad

సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, ఆర్. యుజ్వేంద్ర చాహల్, KC కరియప్ప, జాసన్ హోల్డర్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ P A, జో రూట్

పిచ్ రిపోర్ట్ : Pitch report

బర్సపరా క్రికెట్ స్టేడియంలోని (Barsapara Cricket Stadium) పిచ్ బ్యాటింగ్ (batting) కి అనుకూలంగా ఉంటుంది. దీంతో నేడు జరిగే మ్యాచ్ లో అధిక స్కోర్లు (highest scores) నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా అయితే ఫ్యాన్స్ కి నిజంగా పండగే అని చెప్పవచ్చు. అయితే ఆట జరిగేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు (spinners) అనుకూలిస్తుంది చెబుతున్నారు.

 

మ్యాచ్ జరిగే స్టేడియం : గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం (Barsapara Cricket Stadium, Guwahati)

మ్యాచ్ జరిగే సమయం (match timing) : సాయంత్రం 7:30 PM

లైవ్ స్ట్రీమింగ్ (Live streaming) : జియో సినిమా (Jio cinema)

లైవ్ మ్యాచ్ (Live match) : Star sports (స్టార్ స్పోర్ట్స్)