ఐపీఎల్ చరిత్రలో రికార్డులు : Records in IPL History

విభిన్న దేశాలకు చెందిన క్రికెటర్లు మిళితమై ఆడే ఒకే ఒక్క క్రీడగా ఐపీఎల్ ఘనత వహించింది. 20 ఓవర్ల పాటు సాగే ఈ క్రికెట్ మ్యాచ్ అత్యంత అద్భుతంగా అందరి ఆదరాభిమానాన్ని పొందుతోంది.

ఐపీఎల్ చరిత్రలో రికార్డులు : Records in IPL History

ఐపీఎల్ చరిత్రలో రికార్డులు : Records in IPL History

విభిన్న దేశాలకు చెందిన క్రికెటర్లు మిళితమై ఆడే ఒకే ఒక్క క్రీడగా ఐపీఎల్ ఘనత వహించింది. 20 ఓవర్ల పాటు సాగే క్రికెట్ మ్యాచ్ అత్యంత అద్భుతంగా అందరి ఆదరాభిమానాన్ని పొందుతోంది.

 

క్రికెట్... ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే క్రీడ. 5 రోజుల పాటు జరిగే టెస్ట్ మ్యాచులు, 50 ఓవర్ల పాటు సాగే వన్డేలు, 20 ఓవర్ల టీ20 మ్యాచులు అభిమానులను అలరిస్తుంటాయి. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తుంటారు. చాలా దేశాల్లో దీనికి ఎంతో క్రేజ్ ఉంది. ఇక ఇండియా ఆడే మ్యాచులు అంటే అందరూ టీవీలకు అతుక్కుపోతారు. అది పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ అయితే ఇక చెప్పనవసరం లేదు. నరాలు తెగే ఉత్ఖంఠ కలుగుతుంది.

 

ఐపీఎల్ లో రికార్డులే రికార్డులు

 

ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో వైపు క్రికెట్ అభిమానులను అలరించడానికి 2008 లో రూపొందిన క్రికెట్ ప్రభంజనం ఏదైనా ఉందంటే అదే ఐపీఎల్. ప్రతి ఏడాది నిర్వహించే మెగా టోర్నీలో దేశ విదేశాలకు చెందిన సుప్రసిద్ధ క్రికెటర్లు పాల్గొంటారు. అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు మిళితమై ఆడే ఒకే ఒక్క క్రీడగా ఐపీఎల్ ఘనత వహించింది. 20 ఓవర్ల పాటు సాగే క్రికెట్ మ్యాచ్ అత్యంత అద్భుతంగా అందరి ఆదరాభిమానాన్ని పొందుతోంది.

 

వన్డేల్లో 50 ఓవర్ల మ్యాచ్ లో సాధ్యమయ్యే సెంచరీని ఐపీఎల్ లో 20 ఓవర్ల పాటు సాగే మ్యాచ్ లో కూడా సాధిస్తుండడం విశేషం. అటు ధనా ధన్ బ్యాటింగ్, నిప్పులు చెరిగే బౌలర్ల బంతులు, ఫీల్డింగ్ విన్యాసాలు, అత్యధిక, అత్యల్ప స్కోర్లు, భారీ లక్ష్య ఛేదనలు ఇలా ఎన్నో విన్యాసాలను మనం ఐపీఎల్ లో చూడవచ్చు. 15 సీజన్ల నుంచి నిరాటంకంగా కొనసాగుతున్న ఐపీఎల్ వచ్చే ఏడాది 16 సీజన్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ వేలం ముగిసింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ లో కొన్ని ఘనమైన రికార్డులను పరిశీలిద్దాం.

 

సుడిగాలిలా చెలరేగిన గేల్

మొట్టమొదటి ఐపీఎల్ 2008 లో ప్రారంభమయింది. మొదటి సీజన్లో అత్యధిక బ్యాటింగ్ స్కోర్ ను కోల్కతా నైట్ రైడర్స్ కు చెందిన బ్రాండన్ మెక్కల్లమ్ సాధించాడు. కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై సాధించాడు. అనంతరం రికార్డు ఐదేళ్ల పాటు ఉంది. అనంతరం 2013 లో రికార్డును క్రిస్ గేల్ తుడిచిపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడిన గేల్ పంజాబ్ వారియర్స్ పై కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. గేల్ 13 ఫోర్లు, 17 సిక్సులతో 265.15 స్ట్రయిక్ రేట్ తో స్కోర్ సాధించాడు. ఇప్పటి వరకు రికార్డు చెక్కు చెదరకుండా ఉంది

 

ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సులు

ఐపీఎల్ అంటేనే సిక్సులు మోత. ఫోర్ల హోరు. హోరులో సిక్సుల సునామీ సృష్టించిన వారు ఎందరో ఉన్నారు. అత్యధిక వ్యక్తిగత పరుగుల వీరుడు గేల్ సిక్సుల సునామీతో ఐపీఎల్ లో చరిత్రను సృష్టించాడు. మూడు సార్లు అత్యధిక సిక్సులు బాదాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడిన గేల్ 2013 సీజన్లో పూణే వారియర్స్ తో జరిగిన మ్యాచులో 17 సిక్సులతో చెలరేగి పోయాడు. దీనికంటే ముందు 2012 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచులో 13 సిక్సులను హన ఖాతాలో వేసుకున్నాడు. 2015 లో కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 12 సిక్సులు బాదాడు. గేల్ కంటే ముందుగా 2008 లో జరిగిన ఆరంభ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన బ్రాండన్ మెక్కల్లమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై 13 సిక్సులను తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కి చెందిన ఏబీ డివిలియర్స్ 2016 లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 సిక్సులు బాదాడు.

 

మ్యాచ్ లో అత్యధిక భాగస్వామ్యం

మ్యాచ్ లో వికెట్లు పడకుండా స్కోర్ ను కాపాడుకోవాలంటే కావాల్సింది బ్యాటింగ్ భాగస్వామ్యం. ఆడిన 15 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) రికార్డులు మాత్రం సృష్టించడంలో ముందు వరసలో ఉంది. అత్యధిక పరుగుల వీరుడు, అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వద్దు, అత్యధిక సిక్సులు ఇవన్నీ ఆర్సీబీ పేరు మీదే ఉన్నాయి. దీనితో పాటుగా అత్యధిక పరుగుల భాగస్వామ్యం కూడా టీమ్ పేరు మేడే ఉంది. 2016 లో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో మిస్టర్ 360 గా పిలువబడే ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆది రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి కేవలం 96 బంతుల్లోనే 229 పరుగులు చేసారు. ఇందులో డివిలియర్స్ 52 బంతుల్లో 129 పరుగులు, కోహ్లీ 55 బంతుల్లో 109 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ భాగస్యామ్యం.

 

అత్యధిక పరుగుల వీరుడు విరాట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్గ్ గా వ్యవహరించిన భారత స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురిలో నలుగురు భారత క్రికెటర్లు ఉండడం గమనార్హం. కోహ్లీ మొత్తం 204 ఇన్నింగ్స్ లో 6390 పరుగులు చేసాడు. ఇందులో 5 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 549 ఫోర్లు, 212 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 113 పరుగులు. కోహ్లీ తరువాత శిఖర్ ధావన్ 5981 పరుగులు, రోహిత్ శర్మ 5719 పరుగులు, సురేష్ రైనా 5528 పరుగులు చేసారు. సురేష్ రైనా పేరిట మరో రికార్డు కూడా నమోదయింది. అత్యధికంగా 102 క్యాచ్ లు పట్టిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు.

 

ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు

బ్యాటింగ్ లో విధ్వం సృష్టిస్తే, బౌలింగ్ లో కూడా రికార్డులను సృష్టిస్తున్నారు బౌలర్లు. ఒకటి రెండు వికెట్లు తీస్తే చాలు అనుకుంటే ఏకంగా ఆరేసి వికెట్లను పైగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు బౌలర్లు. అలజరి జోసెఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో 2019 ఏప్రిల్ 6 తేదీన జరిగిన మ్యాచ్ లో 3.4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసాడు. రికార్డు తొలుత సోహైల్ తన్వీర్ పై ఉండేది.  దీనిని జోసెఫ్ అధిగమించాడు. 2008 మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కి చెందిన  సోహైల్ తన్వీర్ 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై రికార్డు సృష్టించాడు. వీరే కాకుండా ఆడమ్ జంపా 19 పరుగులిచ్చి 6 వికెట్లు, అనిల్ కుంబ్లే 5 పరుగులిచ్చి 5 వికెట్లు, ఇషాంత్ శర్మ 12 పరుగులకు 5 వికెట్లు, లసిత్ మలింగా 13 పరుగులకు 5 వికెట్లు పడగొట్టారు.

 

హ్యాట్రిక్ వీరుడు మిశ్రా

వరుసగా వికెట్లు తీయాలంటే ఎంతో అసాధ్యం. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి పలుమార్లు తన పేరున రికార్డులు నమోదు చేసుకున్న ఏకైక బౌలర్ అమిత్ మిశ్రా. ఒకసారి కాదు మూడు సార్లు రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 15 సీజన్లలో ఇప్పటి వరకు 21 హ్యాట్రిక్స్ నమోదయ్యాయి. అందులో 3 సార్లు అమిత్ మిశ్రా నమోదు చేసాడు. మిశ్రా ఫిట్ ను ప్రారంభ సీజన్ 2008 లో డెక్కన్ ఛార్జర్స్ పై (5/17), 2011 లో కింగ్స్ లెవెన్ పంజాబ్ పై (4/9), 2013 లో పూణే వారియర్స్ పై (4/19) వికెట్లు సాధించాడు. అయితే మిశ్రా కంటే మొట్టమొదటి హ్యాట్రిక్ 2008 లోనే లక్ష్మిపతి బాలాజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ పై (5/24) వికెట్లు తీసాడు.

 

అత్యధిక టీమ్ స్కోర్

ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులను సాధించిన టీమ్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అగ్ర స్థానంలో నిలిచింది. 2013 సీజన్లో పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఇది సాధ్యమయింది. మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో 5 వికెట్లను కోల్పోయి 263 (263/5) పరుగులు చేసింది.

 

అత్యధిక పరుగుల మార్జిన్ విజయం

అత్యధిక మార్జిన్ తో విజయం సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. 2017 మే 6 జరిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 146 పరుగుల మార్జిన్ తో గెలుపొందింది. 213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 66 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై జట్టు భారీ పరుగుల తేడాతో  గెలుపొందింది.

 

అత్యధిక వికెట్ల వీరుడు

ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ 15 సీజన్లలో అత్యధిక వికెట్లను సాధించిన మొదటి బౌలర్ గా బ్రేవో ఖ్యాతి గడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపు ఆడుతున్న బ్రేవో 183 మ్యాచుల్లో 161 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల జాబితాలో తోలి స్థానంలో నిలిచి రికార్డ్ సృష్టించాడు.

 

తక్కువ స్కోర్ మ్యాచ్ లో సీఎస్కె రికార్డు

తక్కువ పరుగులు చేసి మ్యాచ్ ను కాపాడుకుని విజయం సాధించాలంటే కష్టమే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ దీనిని సాధ్యం చేసి చూపించింది. ధోని సారధ్యంలోని జట్టు అద్భుతం చేసింది. 2009 సీజన్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కింగ్స్ లెవెన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేయగలిగింది,