అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీలు :Fastest Centuries in Test Cricket

టెస్ట్ మ్యాచ్... సుదీర్ఘంగా 5 రోజుల పాటు ఆడే క్రికెట్. సహనం, ఓర్పు, సమయస్ఫూర్తి, ఫిట్నెస్... టెస్టు మ్యాచ్ కోసం ఎంతో ముఖ్యమైనది. బ్యాట్స్‌మెన్‌ల క్లాసికల్ షాట్లు చూడాలంటే టెస్ట్ మ్యాచ్ వీక్షించాల్సిందే.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీలు :Fastest Centuries in Test Cricket

 

అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో వేగవంతమైన సెంచరీలు : Fastest Centuries in Test Cricket

టెస్ట్ మ్యాచ్... సుదీర్ఘంగా 5 రోజుల పాటు ఆడే క్రికెట్. సహనం, ఓర్పు, సమయస్ఫూర్తి, ఫిట్నెస్... టెస్టు మ్యాచ్ కోసం ఎంతో ముఖ్యమైనది. బ్యాట్స్మెన్ క్లాసికల్ షాట్లు చూడాలంటే టెస్ట్ మ్యాచ్ వీక్షించాల్సిందే.

బ్యాట్స్మెన్ సహనానికి అసలైన 'టెస్టు'

టెస్టు క్రికెట్ ఫార్మాట్ ఎక్కువ రోజులు, ఎంతో ప్రధాన్యత కలిగిన ఫార్మాట్. దీనిని ప్రస్తుతం ఐదు రోజుల పాటు అడుతారు. రెండు జట్లు మ్యాచ్ లో నాలుగు ఇన్నింగ్స్  ఆడతాయి. ఒక రోజుని మూడు భాగాలుగా విభజిస్తారు. రోజులో మొత్తం ఆరు గంటల పాటు ఆట కొనసాగుతుంది. టీ విరామం 20 నిముషాలు, 40 నిముషాల భోజన విరామం ఉంటాయి. కేవలం టెస్ట్ హోదా కలిగిన జట్లు మాత్రమే ఫార్మాట్ ఆడతాయి. టెస్టు మ్యాచ్ లను కేవలం 12 దేశాలు మాత్రమే ఆడేందుకు హోదాను సంపాదించాయి.

వన్డే, టీ20 వలే ధనాధన్ మెరుపులుండవు. అలాగని దీనిలో వేగంగా ఆడతారా అనే సందేహం కలుగుతుంది. అయితే ఇందులో కూడా అతి వేగంగా బ్యాటింగ్ చేసి సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు.  బ్యాట్స్మెన్లు తమ ప్రతిభను కనబరిచి వారికిష్టమైన షాట్లు ఆడేందుకు ఇందులో ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ఎంతోమంది బ్యాట్స్మెన్లు చక్కటి క్లాసికల్ షాట్లతో టెస్టు మ్యాచులకు వన్నె తెచ్చారు. అందుకే దీనిని జెంటిల్మన్ క్రీడ అంటారు. అతివేగంగా సెంచరీలు సాధించి రికార్డులు సృష్టించిన కొందరు బ్యాట్స్మెన్లను చూద్దాం.

 

1. బ్రాండన్ మెక్కల్లమ్

న్యూజిలాండ్ కి చెందిన మెక్కల్లమ్ 2016 ఫిబ్రవరి 20 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. వన్డేలు, టీ20 ల్లో మాత్రమే సాధ్యమయ్యే వేగవంతమైన సెంచరీతో టెస్టుల్లో అద్భుతం చేసి చూపించాడు. మొత్తం మీద మ్యాచ్ లో 145 పరుగులు చేసాడు. ఇందులో 21 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

 

మెక్కల్లమ్ బ్యాటింగ్ గణాంకాలు

మెక్కల్లమ్ న్యూజిలాండ్తరపున అన్ని ఫార్మాట్లలోనూ ఆడాడు. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన మెక్కల్లమ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి బ్యాటింగ్ చేస్తాడు. 2009-10 సంవత్సరంలో షాన్ టైట్, డిర్క్ నాన్నెస్ 155 కిలోమీటర్ల వేగంతో వేసిన బాల్ ని వికెట్ కీపర్ తల మీదుగా స్కూప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 101 టెస్టుల్లో 176 ఇన్నింగ్స్ ఆడి 6453 పరుగులు చేసాడు. కీపర్ గా 198 క్యాచులు పట్టి 11 స్టంపౌట్లు చేసాడు. 260 వన్డేల్లో 228 ఇన్నింగ్స్ ఆడి 6083 పరుగులు చేసాడు.

మెక్కల్లమ్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

2. సర్ వివియన్ రిచర్డ్స్

ఇంగ్లాండ్ తో 1986 ఏప్రిల్ 11 జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ కి చెందిన రిచర్డ్స్ కేవలం 56 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తం మీద మ్యాచ్ లో 110 పరులను చేసాడు. ఇందులో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 30 సంవత్సరాల పాటు రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అనంతరం మెక్కల్లమ్ దీనిని బద్దలు కొట్టాడు.

 

రిచర్డ్స్ బ్యాటింగ్ గణాంకాలు 

'సర్' గా గౌరవించబడ్డ రిచర్డ్స్ వెస్టిండీస్ కి చెందిన దిగ్గజ బ్యాట్స్మెన్. వివియన్ రిచర్డ్స్ టెస్టులలో మొత్తం 121 మ్యాచ్లు ఆడి 50.23 సగటుతో 8540 పరుగులు చేసాడు. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో రిచర్డ్స్ అత్యధిక స్కోరు 291 పరుగులు. 50 టెస్టులలో వెస్టిండీస్ కు నాయకత్వం వహించి 24 సార్లు గెలిపించాడు. 8 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఒక్క టెస్ట్ సీరీస్ కూడా ఓడిపోని వెస్టిండీస్ కెప్టెన్గా ఉన్న రికార్డు ఇప్పటికీ ఈయన పేరునే ఉంది. టెస్టులలో రిచర్డ్స్ 84 సిక్సర్లు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 291. వెస్టిండీస్ తరఫున ఆరవ అత్యధిక వ్యక్తిగత స్కోరు.

రిచర్డ్స్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

3. మిస్బా-ఉల్-హక్

పాకిస్థాన్ కి చెందిన మిస్బా-ఉల్-హక్ 2014 అక్టోబర్ 30 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో 56 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో రిచర్డ్స్ రికార్డును మిస్బా సమం చేసాడు. సెంచరీలో మొత్తం 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. తన సెంచరీని 74 నిమిషాల్లోనే పూర్తి చేసాడు. ఆస్ట్రేలియాకి చెందిన జాక్ గ్రెగరీ 1921 లో తన సెంచరీని 70 నిమిషాల్లో చేరుకొని మొదటి స్థానంలో ఉన్నాడు.

 

మిస్బా బ్యాటింగ్ గణాంకాలు 

మిస్బా తన కెరీర్లో 75 టెస్టులు ఆడి 5222 పరుగులు చేసాడు. 161 అతని అత్యధిక స్కోర్. 162 వన్డేలు ఆడిన మిస్బా 5122 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 96. మిస్బా 39 టీ20 మ్యాచులు ఆడి 788 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 87 పరుగులు. తన కెరీర్లో నాలుగేళ్ల పాటు 2003 నుంచి 2007 మధ్యలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. కేవలం వన్డేలు మాత్రమే ఆడాడు. పాకిస్థాన్ కు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.

మిస్బా బ్యాటింగ్ వీడియో హైలైట్స్

4. ఆడమ్ గిల్క్రిస్ట్

ఇంగ్లాండ్ తో 2006 డిసెంబర్ 14 జరిగిన టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా కి చెందిన గిల్క్రిస్ట్ సెంచరీతో కదం తొక్కాడు. మ్యాచులో 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. మొత్తం మీద మ్యాచులో 102 పరులు చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

 

గిల్క్రిస్ట్ బ్యాటింగ్ గణాంకాలు

ఎడమచేయి వాటం బ్యాట్స్మెన్ అయిన గిల్క్రిస్ట్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్. కెప్టెన్ గా ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించాడు. అటాకింగ్ బ్యాటింగ్ తో పరుల వరద పారించేవాడు. తన టెస్టు కెరీర్లో 96 మ్యాచుల్లో 137 ఇన్నింగ్స్ ఆడిన గిల్క్రిస్ట్ 5570 పరుగులు చేసాడు. 204 పరుగులు అతని అత్యధిక స్కోరు. 379 క్యాచులు పట్టి 37 స్టంపవుట్లు చేసాడు. 287 వన్డేల్లో 279 ఇనింగ్స్ ఆడి 9619 పరుగులు చేసాడు. 417 క్యాచులు పట్టి 55 స్టంపింగ్స్ చేసి ఉత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.

గిల్క్రిస్ట్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

5. జాక్ గ్రెగరీ

పాతతరం క్రికెటర్లలో ఒకరైన ఆస్ట్రేలియాకి చెందిన గ్రెగరీ 1921 నవంబర్ 12 దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచులో వేగవంతమైన సెంచరీ చేసాడు. మ్యాచులో మొత్తం మీద 119 పరుగులు చేసారు. ఇందులో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

 

గ్రెగరీ బ్యాటింగ్ గణాంకాలు 

వాస్తవానికి గ్రెగరీ ఫాస్ట్ బౌలర్. మంచి హైట్ ఉన్న ఈయన 20 యార్డ్స్ దూరం నుంచి రనప్ తీసుకుని బౌలింగ్ వేసేవారు. బంతితోనే కాకుండా బ్యాట్ తో కూడా అద్భుతాలు చేసారు. 24 టెస్టుల్లో 34 ఇన్నింగ్స్ ఆడి 1146 పరుగులు చేసారు. ఇందులో 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్ లో 85 వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 129 మ్యాచుల్లో 504 వికెట్లు తీశారు. చేతి గ్లౌజులు లేకుండా బ్యాటింగ్ చేసేవారు.

6. శివ నరేన్ చందర్‌పాల్

వెస్టిండీస్ కి చెందిన చందర్‌పాల్ 2003 ఏప్రిల్ 10 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో 69 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసాడు. సెంచరీలో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

 

చందర్‌పాల్ బ్యాటింగ్ గణాంకాలు 

 

వెస్టిండీస్ తరపున 100 టెస్టులు ఆడిన మొట్టమొదటి  ఇండో-కరేబియన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 14 టెస్టులు, 16 వన్డేల్లో టీమ్ కి నాయకత్వం వహించాడు. వెస్టిండీస్ తరపున 10 వేల టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 164 టెస్టుల్లో 280 ఇన్నింగ్స్ ఆడి 11867 పరుగులు, 268 వన్డేల్లో 251 ఇన్నింగ్స్ ఆడి 8778 పరుగులు, 22 టీ20 మ్యాచుల్లో 343 పరుగులు చేసి ఉత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా నిలిచాడు. 

చందర్‌పాల్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

7. డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియాకి చెందిన వార్నర్ భారత్ పై 2012 జనవరి 13 జరిగిన టెస్టు మ్యాచ్ లో 69 బంతుల్లో సెంచరీ చేసాడు. మొత్తమ్మీద మ్యాచులో 180 పరుగులు చేసాడు. ఇందులో 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

 

వార్నర్ బ్యాటింగ్ గణాంకాలు 

వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ ఆడడం ద్వారా భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. ఇక్కడి తెలుగు, హిందీ పాటలను అనుకరిస్తూ చేసే డ్యాన్సులు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ ఆడే వార్నర్ ఆస్ట్రేలియాకి మరపురాని విజయాలను అందించాడు. 100 టెస్టుల్లో 183 ఇన్నింగ్స్ ఆడి 8122 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 335 పరుగులు. 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలున్నాయి.

వార్నర్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

8. క్రిస్ గేల్

వెస్టిండీస్ కి చెందిన గేల్ ఆస్ట్రేలియాతో 2009 డిసెంబర్ 16 జరిగిన టెస్టులో 70 బంతుల్లో శతక్కొట్టాడు. శతకంలో 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద క్రిస్ గేల్ మ్యాచ్ లో 102 పరుగులు చేసాడు.

 

గేల్ బ్యాటింగ్ గణాంకాలు 

యూనివర్సల్ బాస్ గా ప్రసిద్ధి చెందిన గేల్ వన్డేలు, టెస్టులు, టీ20 లు ఫార్మాట్లో అయినా తన  విశ్వరూపాన్ని చూపిస్తాడు. 1999 నుంచి వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 ల్లో తనదైన ముద్ర వేసాడనడంలో సందేహమే లేదు. 2007 లో ప్రపంచ టీ20 కప్ లో దక్షిణాఫ్రికాపై 57 బంతుల్లోనే 117 పరుగులు చేసాడు. 2013 ఐపీఎల్ సీజన్లో 66 బంతుల్లో 175 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. కేవలం వీటిద్వారానే 154 పరుగులు చేసాడు.

గేల్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

9. రాయ్ ఫ్రెడ్రిక్స్

వెస్టిండీస్ కి చెందిన రాయ్ ఫ్రెడ్రిక్స్ ఆస్ట్రేలియాతో 1975 డిసెంబర్ 12 జరిగిన టెస్టులో 71 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 169 పరుగులు చేసిన ఫ్రెడ్రిక్స్ 27 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కేవలం ఫోర్ల ద్వారానే 108 పరుగులు రావడం గమనార్హం.

 

ఫ్రెడ్రిక్స్ బ్యాటింగ్ గణాంకాలు 

 

వెస్టిండీస్ తరపునన 1968 నుంచి 1977 వరకు టెస్టు మ్యాచుల్లో ఆడాడు. 1970 దశకంలో బిపులేర్లపై కౌంటర్ అటాకింగ్ ఎలా చేయాలో తన బ్యాటింగ్ తో చేసి చూపించాడు.  ఫ్రెడ్రిక్స్ తన టెస్టు కెరీర్లో 59 టెస్టుల్లో 109 ఇన్నింగ్స్ ఆడి 4334 పరుగులు చేసాడు. అత్యధిక స్కోరు 169 పరుగులు. కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడి 311 పరుగులు చేసాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 223 మ్యాచ్ ల్లో 391 ఇన్నింగ్స్ ఆడి 16384 పరుగులు చేసాడు.

ఫ్రెడ్రిక్స్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

10. కోలిన్ డి గ్రాండ్హోమ్

న్యూజిలాండ్ కి చెందిన గ్రాండ్హోమ్ వెస్టిండీస్ తో 2017 డిసెంబర్ 1 జరిగిన టెస్టు మ్యాచ్ లో 71 బంతుల్లో సెంచరీ చేసాడు. మ్యాచులో అతను 105 పరుగులను సాధించాడు. స్కోరులో 11 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

 

గ్రాండ్హోమ్ బ్యాటింగ్ గణాంకాలు 

 

మంచి ఆల్ రౌండర్ అయిన గ్రాండ్హోమ్ తన దేశానికి చక్కటి విజయాలను అందించాడు. కెరీర్ అని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన గ్రాండ్హోమ్ 29 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్ ఆడి 1432 పరుగులు చేయడమే కాకుండా 49 వికెట్లు తీసాడు. 45 వన్డేల్లో 35 ఇన్నింగ్స్ ఆడి 742 పరుగులు చేసాడు. 30 వికెట్లు కూడా తీసాడు. 41 టీ20 ల్లో 39 ఇన్నింగ్స్ ఆడి 505 పరుగులు చేసాడు. 12 వికెట్లు కూడా తీసాడు. జింబాబ్వే నుంచి వచ్చి న్యూజిలాండ్ తరపున మొట్టమొదట టీ20 ల్లో అడుగుపెట్టాడు.

గ్రాండ్హోమ్ బ్యాటింగ్ వీడియో హైలైట్స్

ప్రపంచ 'టెస్టు' కప్ ఫైనల్స్ కోసం ఆసీస్ తో భారత్ పోరాటం : India fights with Aussies for Test cup finals 

ఈ ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో స్థానం కోసం భారత్ ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నాలుగు టెస్టులు గెలిస్తే భారత్ ఫైనల్స్ కి చేరునే అవకాశం మెరుగుపడుతుంది. అందుకోసం స్టార్ ఆటగాళ్లు అందరూ ఇప్పటికే తమ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 

ఆస్ట్రేలియాతో జరగబోయే 4 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. మిగిలిన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్),కేఎస్  భారత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, పుజారా, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, అక్షత్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.