2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ : 2023 ODI World Cup schedule released by ICC

సరిగా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ కోసం... క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసింది.

2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ : 2023 ODI World Cup schedule released by ICC

సరిగా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్ కోసం... క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసింది. అక్టోబర్ 5 న టోర్నీ ప్రారంభం కానుండగా అదే రోజున తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోదీ మైదానంలో జరగనుంది. గత ప్రపంచ కప్ 2019 ఫైనల్లో ఈ రెండు జట్లూ తలపడగా సూపర్ ఓవర్లో ఇంగ్లాండ్ గెలిచి టైటిల్ నెగ్గింది. అక్టోబర్ 8 న టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో చెన్నైలోని స్టేడియంలో తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 15 న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుంది.

 

ఈ ఏడాది పురుషుల వన్డే ప్రపంచ కప్ 10 వేదికల్లో నిర్వహించనున్నారు. మొత్తం టోర్నీ అంత భారత్ లోనే జరగనుంది. నవంబర్ 19 న నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15 న మొదటి సెమీ ఫైనల్ మొబైలోనూ, 19 న రెండో సెమీఫైనల్ కోల్కతాలో జరగనున్నాయి. మొతం 45 లీగ్ మ్యాచ్ లు, మూడు నాకౌట్ మ్యాచ్ లు 46 రోజుల పాటు జరుగుతాయి. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, ధర్మశాల, లక్నో, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలో మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్స్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేస్ ఉంటాయి. భారత్ గనుక సెమీ ఫైనల్ కి చేరితే నాకౌట్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. లీగ్ దశలో 10 టీమ్స్ కూడా ఒకదానితో ఒకటి ఒకసారి తలపడనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందుగా ఆయా జట్లు 29 సెప్టెంబర్-3 అక్టోబర్ మధ్య వార్మప్‌ మ్యాచ్ లను హైదరాబాద్, తిరువనంతపురం, గౌహతిలలో ఆడనున్నాయి. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ మొత్తం రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనుంది. లీగ్ దశ ముగిసిన తరువాత టాప్-4 లో నిలిచిన జట్ల మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. హైదరాబాద్‌ లోని ఉప్పల్ స్టేడియం ప్రపంచ్ కప్‌లో మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

 

 2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్

గురువారం, 5 అక్టోబర్ ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్, అహ్మదాబాద్ లోని స్టేడియం

శుక్రవారం, 6 అక్టోబర్ పాకిస్తాన్ vs క్వాలిఫైయర్ 1, హైదరాబాద్ లోని స్టేడియం

శనివారం, 7 అక్టోబర్ బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, ధర్మశాలలోని స్టేడియం

మంగళవారం, అక్టోబర్ 10 ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్, ధర్మశాలలోని స్టేడియం .

బుధవారం, 11 అక్టోబర్ భారత్ vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీలోని స్టేడియం

శుక్రవారం, 13 అక్టోబర్ ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా లక్నోలోని స్టేడియం

ఆదివారం, 15 అక్టోబర్ భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్ లోని స్టేడియం

సోమవారం, 16 అక్టోబర్ ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫైయర్ 2 లక్నోలోని స్టేడియం

గురువారం, 19 అక్టోబర్ భారత్ vs బంగ్లాదేశ్, పూణేలోని స్టేడియం

శుక్రవారం, 20 అక్టోబర్ ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ బెంగళూరులోని స్టేడియం

శనివారం, 21 అక్టోబర్ క్వాలిఫైయర్ 1 vs ‘క్వాలిఫైయర్ 2 లక్నోలోని స్టేడియం

ఆదివారం, 22 అక్టోబర్ భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాలలోని స్టేడియం

సోమవారం, అక్టోబర్ 23, పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్థాన్, చెన్నైలోని స్టేడియం

మంగళవారం, 24 అక్టోబర్ దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, ముంబైలోని స్టేడియం

అక్టోబరు 28, శనివారం ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, ధర్మశాలలోని స్టేడియం

అక్టోబరు 29 ఆదివారం భారత్ vs ఇంగ్లాండ్, లక్నోలోని స్టేడియం

బుధవారం, నవంబర్ 1 న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, పూణేలోని స్టేడియం

గురువారం, 2 నవంబర్ భారత్ vs క్వాలిఫైయర్ 2 ముంబైలోని స్టేడియం

శుక్రవారం, 3 నవంబర్ క్వాలిఫైయర్ 1 vs ఆఫ్ఘనిస్తాన్, లక్నోలోని స్టేడియం

శనివారం, 4 నవంబర్ న్యూజిలాండ్ vs పాకిస్తాన్, బెంగళూరులోని స్టేడియం

ఆదివారం, 5 నవంబర్ భారత్ vs సౌతాఫ్రికా, కోల్‌కతాలోని స్టేడియం

సోమవారం, 6 నవంబర్ బంగ్లాదేశ్ vs క్వాలిఫైయర్ 2 ఢిల్లీలోని స్టేడియం

మంగళవారం, 7 నవంబర్ ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ ముంబైలోని స్టేడియం

బుధవారం, 8 నవంబర్ ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్ 1 పూణేలోని స్టేడియం

గురువారం, 9 నవంబర్ న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 2 బెంగళూరులోని స్టేడియం

శుక్రవారం, 10 నవంబర్ దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్ అహ్మదాబాద్ లోని స్టేడియం

శనివారం, 11 నవంబర్ భారతదేశం vs క్వాలిఫైయర్ 1 బెంగళూరులోని లోని స్టేడియం

ఆదివారం, 12 నవంబర్ ఇంగ్లాండ్ vs పాకిస్థాన్, కోల్‌కతాలోని స్టేడియం

ఆదివారం, 12 నవంబర్ ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, పూణేలోని స్టేడియం

 

ప్రపంచ కప్ 2023 లో భారత్ ఆడబోయే మ్యాచ్ ల పూర్తి షెడ్యూల్

అక్టోబర్ 8 – భారత్ vs ఆస్ట్రేలియా, చెన్నై

అక్టోబర్ 11 – ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

అక్టోబర్ 15- భారత్ vs పాకిస్థాన్, అహ్మదాబాద్

అక్టోబర్ 19 – భారత్ vs బంగ్లాదేశ్, పూణే

అక్టోబర్ 22 – భారత్ vs న్యూజిలాండ్, ధర్మశాల

అక్టోబర్ 29 – భారత్ vs ఇంగ్లండ్, లక్నో

నవంబర్ 2 – భారత్ vs క్వాలిఫైయర్, ముంబై

నవంబర్ 5 – భారత్ vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా

నవంబర్ 11 – భారత్ vs క్వాలిఫైయర్స్, బెంగళూరు