ఐపీఎల్ లో నేడు బెంగళూరు, కోల్కతా ఢీ : RCB vs KKR play today in IPL
క్యాష్ రిచ్ లీగ్ గా పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. బ్యాట్స్‌మన్ల (batsmen) విన్యాసాలు, బౌలర్ల భీకర బౌలింగ్, ఫీల్డర్లు చేసే రనౌట్లు ఐపీఎల్ పై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఐపీఎల్ లో నేడు బెంగళూరు, కోల్కతా ఢీ : RCB vs KKR play today in IPL
క్యాష్ రిచ్ లీగ్ గా పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. బ్యాట్స్‌మన్ల (batsmen) విన్యాసాలు, బౌలర్ల భీకర బౌలింగ్, ఫీల్డర్లు చేసే రనౌట్లు ఐపీఎల్ పై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఐపీఎల్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) నేడు జరిగే 36 వ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఆర్సీబీ టీమ్ పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలోనూ, కేకేఆర్ 8 వ స్థానంలోనూ ఉన్నాయి. కేకేఆర్ కి ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ రేసులో నిలవాలని భావిస్తోంది.
ఆర్సీబీ విశ్లేషణ : RCB analysis
ఆర్సీబీ టీమ్ ఈ సీజన్ ఐపీఎల్ (IPL) లో తానాడిన మొదటి మ్యాచ్ లో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ (MI) పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ తరువాత కోల్కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లలో ఓటమి (lost) చెందింది. ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో మ్యాచ్ ను నెగ్గింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓడిపోయింది. మరలా పుంజుకుని పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లను ఓడించింది (defeated). మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ (RCB) 4 మ్యాచ్‌లు గెలిచి మూడింటిలో ఓడింది. 8 పాయింట్లతో 5 వ స్థానంలో నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలను (Hattrick) నమోదు చేయాలని భావిస్తోంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Duplessis) జట్టులోని అందరికంటే ఎక్కువ పరుగులు చేసాడు. ఆడిన 7 మ్యాచ్‌లలో 165.31 స్ట్రైక్ రేట్ తో 405 పరుగులు సాధించాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Kohli) 7 ఇన్నింగ్స్ లో 141.62 స్ట్రైక్ రేట్ తో 279 పరుగులు, గ్లెన్ మాక్స్‌వెల్ 188.81 స్ట్రైక్ రేట్ తో 7 ఇన్నింగ్స్ లో 253 పరుగులు చేసారు.
కేకేఆర్ విశ్లేషణ : KKR analysis
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ ఘోరంగా తయారయింది. ఐపీఎల్ (2 IPL titles win) టైటిళ్లను రెండుసార్లు గెలుచుకున్న కేకేఆర్ ఈ ఐపీఎల్ సీజన్లో (IPL season) ఆడిన తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించింది. అనంతరం పుంజుకుని రెండో మ్యాచ్‌లో బెంగళూరు (RCB) పైనా, మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ను ఓడించింది. ఆ తరువాత జరిగిన 4 మ్యాచ్‌లలో ఓటమి పాలై (Defeated in 4 matches) సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో బెంగళూరు జట్టుతో ఆడిన మ్యాచ్‌ను గెలవడం కోల్కతా టీమ్ కి బూస్ట్ లాంటిదని చెప్పవచ్చు. నేడు జరిగే మ్యాచ్‌ను గెలిచి రేసులో (IPL race) నిలవాలని జట్టు భావిస్తోంది. టీమ్ లోని వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, నితీష్ రాణా మాత్రమే బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. సునీల్ నరైన్ (Sunil Narine), ఆండ్రీ రస్సెల్ (Russel) తమ బ్యాటింగ్ కి పదును పెడితే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. వీరిద్దరూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ XI : RCB probable playing XI
విరాట్ కోహ్లి (కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైశాక్ విజయకుమార్ ఉండే అవకాశం ఉంది.
ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ : RCB full squad
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, ఫిన్, ఫిన్ అనుజ్ రావత్, మైకేల్ బ్రేస్‌వెల్, సిద్దార్థ్ కౌల్, సోనూ యాదవ్, మనోజ్ భాండాగే, వేన్ పార్నెల్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ.
కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI : KKR probable playing XI
ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ ఉండే అవకాశం ఉంది.
కేకేఆర్ ఫుల్ స్క్వాడ్ : KKR full squad
ఎన్ జగదీశన్, జాసన్ రాయ్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వీస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, లిట్టన్ దాస్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్, హర్షిత్ రాణా, ఆర్య దేశాయ్.
మ్యాచ్ వివరాలు : Match details
నేడు జరిగే మ్యాచ్ ఈ ఐపీఎల్ సీజన్లో (IPL season) 36వ మ్యాచ్ (36th match). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy stadium) ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) ఫాఫ్ డుప్లెసిస్, కోల్కతా నైట్ రైడర్స్‌కు (KKR) నితీష్ రాణా కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. జియో సినిమా (Jio cinema), స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ (Star Sports Network) లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
IPL 2023 పాయింట్ల పట్టిక