డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు : WTC final Indian squad

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC final) కోసం భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఊహించని రీతిలో అనూహ్యంగా అజింక్య రహానే (Ajinkya Rahane) ను ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరడం ఇది రెండోసారి. ఈసారి ఎలాగైనా భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు  : WTC final Indian squad

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత జట్టు  : WTC final Indian squad

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌ (WTC final) కోసం భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఊహించని రీతిలో అనూహ్యంగా అజింక్య రహానే (Ajinkya Rahane) ను ఎంపిక చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరడం ఇది రెండోసారి. ఈసారి ఎలాగైనా భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) సాధించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

 

రహానేకు చోటు కల్పించిన బీసీసీఐ : BCCI called Rahane

డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 తేదీ నుంచి 11 (WTC final from June 7th-11th) తేదీ వరకు లండన్లోని ఓవల్లో ఆస్ట్రేలియాతో జరగనుంది. మ్యాచ్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అజింక్య రహానేను 17 నెలల సుదీర్ఘ విరామం తరువాత (After 17 months) జట్టులోకి భారత జట్టులోకి బీసీసీఐ (BCCI) ఎంపిక చేసింది. సీఎస్కే తరపున ఆడుతున్న రహానే ఐపీఎల్ 16 సీజన్లో (16th IPL season) ఎవ్వరూ ఊహించని రీతిలో బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో జాతీయ జట్టులోకి (Indian team) తిరిగి పిలుపు వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ను మొదట ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ సీనియారిటీ, ప్రస్తుత ప్రదర్శనతో రహానే ఛాన్స్ కొట్టేసాడు. దాదాపు 199 స్ట్రైక్ రేట్ తో రహానే అత్యుతమ ప్రదర్శన చేస్తున్నాడు. రహానేతో పాటు ఆంధ్ర వికెట్ కేర్ కేఎస్ భారత్ (KS Bharat) కూడా జట్టులోకి ఎంపికయ్యాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత టెస్టు జట్టు : India team for WTC final

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

 

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టు : Australia team for WTC final

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, స్టివ్ స్మీ , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్