ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికరమైన పోరు : Another interesting match in IPL today
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేడు లక్నో వేదికగా వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబయి ఇండియన్స్ (MI) జట్లు ఈ ఆసక్తికరమైన మ్యాచ్ లో తలపడనున్నాయి.
ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికరమైన పోరు : Another interesting match in IPL today
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేడు లక్నో వేదికగా వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబయి ఇండియన్స్ (MI) జట్లు ఈ ఆసక్తికరమైన మ్యాచ్ లో తలపడనున్నాయి. ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 3, 4 స్థానాల్లో ఉన్న ముంబయి, లక్నో జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచులో గెలవాల్సిందే. ఉన్న ఈ ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా ఉంది. ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం ఇతర జట్ల మ్యాచ్ ల పైన ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల అటు ఇరు జట్లు, ఇటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వరుస ఓటములతో సీజన్‌ను (16th IPL season) ప్రారంభించిన ముంబయి ఇండియన్స్ (MI) జట్టు ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో బలంగా పుంజుకుంది. చివరి 5 మ్యాచుల్లో గెలిచి టాప్-3 (top-3) లో నిలిచింది. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా నిలకడగా వికెట్లు తీస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచులో ఫర్వాలేదనిపించాడు. నేడు జరుగనున్న ఈ కీలక మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జట్టులోని మిగతా బ్యాట్స్‌మన్స్ లో కొందరు మాత్రమే రాణిస్తున్నారు. అందరూ సమిష్టిగా రాణిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు.
ముంబై జట్టులా కాకుండా ఈ సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో ఓటములతో వెనుకబడి ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమ్ కీలకమైన రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న లక్నో టీమ్ గనుక అన్ని రంగాల్లో సమిష్టిగా కలిసి రాణిస్తే మాత్రం ముంబై జట్టుపై విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబయి 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి 5 మ్యాచుల్లో ఓటమి చెందింది, లక్నో 12 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి మరో 6 మ్యాచుల్లో ఓటమి పాలయింది. ఇరు జట్లకు కలిపి లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచులో ఓడినప్పటికీ.. రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. కాకపోతే అపుడు ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు, నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ మ్యాచులో ముంబయి గెలిస్తే మాత్రం దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరినట్లే. లక్నో హోమ్ గ్రౌండ్ ఈ సీజన్‌లో ఎక్కువగా స్పిన్‌కి సహకరిస్తోంది. ఇక్కడ జరిగిన మ్యాచుల్లో తక్కువ స్కోర్లే నమోదవుతున్నాయి. మొత్తంగా ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ లక్నో టీమ్ గెలవడం గమనార్హం. అందులోనూ నేడు మ్యాచ్ జరిగే స్టేడియం లక్నో జట్టుకి హోమ్ గ్రౌండ్ కావడం ఆ జట్టుకి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు.
లక్నో ప్లేయింగ్ XI : LSG playing XI
క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, పెరక్ మన్‌కడ్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, కె.గౌతమ్, యుధ్వీర్ చారక్ లేదా యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా
లక్నో ఫుల్ స్క్వాడ్ : LSG full squad
KL రాహుల్(C), MP స్టోయినిస్, YS ఠాకూర్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, KH పాండ్యా, కృష్ణప్ప గౌతం, నికోలస్ పూరన్(wk), రవి బిష్ణోయ్, A మిశ్రా, నవీన్-ఉల్-హక్. మార్క్ వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, DR సామ్స్, పిఎన్ మన్కడ్, ఎ బడోని, క్యూ డి కాక్, రొమారియో షెపర్డ్, ఎం వోహ్రా, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, యుధ్వీర్ సింగ్, AN గులేరియా
ముంబయి ప్లేయింగ్ XI : MI playing XI
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేర, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, క్రిస్ జోర్దాన్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెరెన్ డార్ఫ్
ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్ : MI full squad
కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టిక
పొజిషన్ |
టీమ్ |
ఆడినవి |
విజయం |
ఓడినవి |
ఫలితం తేలనివి |
నెట్ రన్ రేట్ |
పాయింట్లు |
1 |
గుజరాత్ టైటాన్స్ |
13 |
9 |
4 |
0 |
+0.835 |
18 |
2 |
చెన్నై సూపర్ కింగ్స్ |
13 |
7 |
5 |
1 |
+0.381 |
15 |
3 |
ముంబై ఇండియన్స్ |
12 |
7 |
5 |
0 |
-0.117 |
14 |
4 |
లక్నో సూపర్ జెయింట్స్ |
12 |
6 |
5 |
1 |
+0.309 |
13 |
5 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు |
12 |
6 |
6 |
0 |
+0.166 |
12 |
6 |
రాజస్థాన్ రాయల్స్ |
13 |
6 |
7 |
0 |
+0.140 |
12 |
7 |
కోల్కతా నైట్ రైడర్స్ |
13 |
6 |
7 |
0 |
-0.256 |
12 |
8 |
పంజాబ్ కింగ్స్ |
12 |
6 |
6 |
0 |
-0.268 |
12 |
9 |
సన్ రైజర్స్ హైదరాబాద్ |
12 |
4 |
8 |
0 |
-0.575 |
8 |
10 |
ఢిల్లీ క్యాపిటల్స్ |
12 |
4 |
8 |
0 |
-0.686 |
8 |