మారనున్న ప్లేఆఫ్స్ బెర్త్ సమీకరణాలు : Playoffs berths that have become interesting
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్త్‌ల (playoffs berth) కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారింది. ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు దీనిపై ప్రభావం చూపించాయి.
మారనున్న ప్లేఆఫ్స్ బెర్త్ సమీకరణాలు : Playoffs berths that have become interesting
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 వ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్త్‌ల (playoffs berth) కోసం జరుగుతున్న పోరు రసవత్తరంగా మారింది. ఆదివారం నాడు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు దీనిపై ప్రభావం చూపించాయి. రాజస్థాన్‌పై (RR) బెంగళూరు (RCB), చెన్నైపై (CSK) కోల్‌కతా (KKR) ఘన విజయం సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే మిగిలిన 9 టీమ్స్ కూడా ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే ఉండటం గమనార్హం. రాజస్థాన్‌పై గెలిచిన బెంగళూరు జట్టు తన ఫ్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ జట్టు ఓటమి చెందడంతో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు కూడా ప్లేఆఫ్స్ (Playoffs) అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. లీగ్ దశలో మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఒకసారి ఆయా జట్లకు సంబంధించిన ప్లేఆఫ్ అవకాశాలు (playoff chances), మిగిలిన మ్యాచ్‌లు వంటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
గుజరాత్ టైటాన్స్ : Gujarat Titans
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ (GT in 1st place) మరో మ్యాచ్ గెలిస్తే చాలు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలుస్తుంది. గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు అధిక శాతం ఉన్నాయి. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ జట్టు తదుపరి దశకు చేరినట్లే. గుజరాత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో (last league match) మే 21 ఆర్సీబీతో తలపడనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ : Chennai Super Kings
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఓటమితో ధోనీ సేన (Dhoni team) ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. చెన్నై (CSK) జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో (last match with DC) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ముంబై, లక్నోలు చెన్నైను వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ : Mumbai Indians
లీగ్ దశలో వరుస ఓటములు చెందినప్పటికీ నిరుత్సాహ పడకుండా ఛాంపియన్స్ లా ఆడిన ముంబై ఇండియన్స్ (MI) 12 మ్యాచ్‌లు ఆడి ఏడింటిలో గెలుపొంది 14 పాయింట్లు సాధించింది. ముంబై జట్టు మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే గనుక ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది. ముంబై జట్టు మంగళవారం జరిగే మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. ఆ తర్వాత మే 21న సన్‌రైజర్స్‌తో ఢీకొట్టనుంది. ఈ రెండు మ్యాచ్ గెలిస్తే ముంబై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకొని క్వాలిఫైయర్-1 మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముంబై గనుక రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు తగ్గుతాయి. ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతాతోపాటు సన్‌రైజర్స్ కూడా ముంబైని దాటేసే ఛాన్స్ ఉంటుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో గెలిచినా సరే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ : Lucknow Super Giants
ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కానీ లక్నో తన చివరి మ్యాచ్‌ల్లో బలమైన ముంబై, కోల్‌కతా జట్టులతో తలపడనుంది. ఈ రెండింట్లోనూ ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్, కోల్‌కతా, పంజాబ్ జట్లు లక్నో కంటే పాయింట్ల పట్టికలో ముందు నిలిచే అవకాశం ఉంటుంది. లక్నో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో గెలిచినా ప్లేఆఫ్స్ రేసు (Playoffs race) నుంచి రాజస్థాన్, కోల్‌కతా ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు చివరి స్థానం కోసం ఆర్సీబీతో పోటీపడుతుంది. ఒకవేళ ముంబై కూడా తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడితే.. లక్నో మూడో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. చెన్నై చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి చెంది, ముంబై ఒక మ్యాచ్‌లోనే గెలిచి... లక్నో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే... లక్నో టీమ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం కూడా ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : Royal Challengers Bangalore
బెంగుళూరు జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయాలు సాధించాలి. రాజస్థాన్‌పై 112 పరుగుల భారీ ఆధిక్యంతో గెలుపొందడంతో బెంగళూరు నెట్ రన్‌రేట్ (Net Run Rate) గణనీయంగా పెరిగింది. కానీ ఆర్సీబీ (RCB) ప్లేఆఫ్స్ చేరాలంటే... మే 18 న సన్‌రైజర్స్, 21 న గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లను తప్పక గెలిచి తీరాల్సిందే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీ ఖాతాలో 14 పాయింట్లు మాత్రమే చేరతాయి. ఇప్పటికే ముంబై (MI) ఖాతాలో 14 పాయింట్లు ఉండగా... లక్నో (LSG) ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లో గెలిచినా చాలు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. ప్రస్తుతం ఆర్సీబీతోపాటు రాజస్థాన్, కోల్‌కతా, పంజాబ్ జట్ల ఖాతాలోనూ 12 పాయింట్లే ఉన్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ : Kolkata Knight Riders
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి గెలుపొందిన కోల్‌కతా ప్లేఆఫ్స్ (KKR playoffs) ద్వారాలు మూసుకుపోకుండా చూసుకోగలిగింది. కానీ ఇప్పటికీ ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తేనే కోల్‌కతాకు ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటి ముఖం పడుతుంది. కోల్‌కతా తాను ఆడే చివరి మ్యాచ్‌లో గెలిచి... ముంబై, బెంగళూరు, రాజస్థాన్, పంజాబ్‌లు వారివారి చివరి మ్యాచ్‌ల్లో ఓడితే నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. నెట్ రన్ రేట్ మైనస్‌లో (minus NRR) ఉండటం కోల్‌కతాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ : Rajasthan Royals
ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఓడటంతో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. 112 పరుగుల తేడాతో ఓడటంతో ఆ జట్టు రన్‌రేట్‌పై భారీ ఎఫెక్ట్ పడింది. రాజస్థాన్ ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. మే 19న పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధిస్తే... రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. ముంబై చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో గెలిచి, లక్నో చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధిస్తే... రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కి (RR playoffs) అర్హత సాధించాలంటే... ఆ జట్టు పంజాబ్‌పై గెలవడంతోపాటు... ముంబై, లక్నో, ఆర్సీబీ జట్లు ఇకపై ఆడబోయే మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. కానీ లక్నో, ముంబై ముఖాముఖి తలపడనుండటంతో... ఈ రెండు జట్లలో ఒకటి రాజస్థాన్ కంటే మెరుగైన పొజిషన్లో నిలిచే అవకాశం కచ్చితంగా ఉంది.
పంజాబ్ కింగ్స్ : Punjab Kings
పంజాబ్ (PBKS) ప్లేఆఫ్స్ చేరాలంటే తన చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది. అలాగే ఆర్సీబీ, లక్నో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. కానీ ముంబై ఒక మ్యాచ్‌లో, లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే... ముంబై, పంజాబ్ జట్లలో నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. పంజాబ్ (PBKS) మే 17 వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19 వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : Sunrisers Hyderabad
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడింట్లోనూ గనుక గెలిస్తే హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. అప్పుడు సన్‌రైజర్స్ కంటే గుజరాత్, చెన్నై ఖాతాల్లోనే ఎక్కువ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ తన చివరి లీగ్ మ్యాచ్‌ల్లో తలపడబోయేది బలమైన గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై జట్లు కావడం గమనార్హం. ఒకవేళ గుజరాత్‌పై సన్‌రైజర్స్ జట్టు గెలిస్తే గనుక మిగతా జట్లకు చెమటలు పట్టడం ఖాయం. టీమ్ గనుక బెంగుళూరు జట్టుపై గెలిస్తే... ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ముంబై టీమ్ పై సన్‌రైజర్స్ విజయం సాధిస్తే... రోహిత్ సేన ప్లేఆఫ్స్ ఛాన్సులు దెబ్బతింటాయి. అదే సమయంలో మిగతా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోతాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ : Delhi Capitals
ఈ సీజన్ ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనతో వార్నర్ సేన ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ (DC) తన చివరి లీగ్ మ్యాచ్‌ల్లో పంజాబ్, చెన్నై జట్లతో తలపడనుంది. పంజాబ్ జట్టుపై ఢిల్లీ గెలిస్తే గనుక పంజాబ్ ప్లేఆఫ్స్ పోరాటం అక్కడితోనే ముగుస్తుంది. చెన్నైపై కూడా ఢిల్లీ విజయం సాధిస్తే... ధోనీ సేన టాప్-2లో నిలిచే అవకాశాన్ని కోల్పోతుంది. అది మినహా ఢిల్లీ జట్టుతో మిగతా జట్లకు వచ్చిన నష్టమేమీ లేదు.