2023లో జరగనున్న మేజర్ క్రికెట్ టోర్నమెంట్‌లు : Major Cricket Tournaments in 2023

కొడితే వెళ్లి స్టాండ్స్ లో పడాలి బంతి... సిక్సర్... బంతిని బాదితే పరిగెత్తాలి.... బౌండరీకి... బాల్ వేస్తే ఎగిరిపడాలి వికెట్లు. గాల్లోకి డైవ్ చేస్తే బంతిని ఒంటి చేతితో ఒడిసి పట్టాలి క్యాచ్ రూపంలో. ఇన్ని రకాల విన్యాసాలను చూడడానికి...

2023లో జరగనున్న మేజర్ క్రికెట్ టోర్నమెంట్‌లు : Major Cricket Tournaments in 2023
Upcoming cricket Tournaments in 2023

2023లో జరగనున్న మేజర్ క్రికెట్ టోర్నమెంట్లు : Major Cricket Tournaments in 2023

కొడితే వెళ్లి స్టాండ్స్ లో పడాలి బంతి... సిక్సర్... బంతిని బాదితే పరిగెత్తాలి.... బౌండరీకి... బాల్ వేస్తే ఎగిరిపడాలి వికెట్లు. గాల్లోకి డైవ్  చేస్తే బంతిని ఒంటి చేతితో ఒడిసి పట్టాలి క్యాచ్ రూపంలో. ఇన్ని రకాల విన్యాసాలను చూడడానికి... మనల్ని అలరించడానికి 2023 సంవత్సరం పలు రకాల క్రికెట్ టోర్నమెంట్లకు, సిరీస్ లకు సిద్ధం కానుంది.

 

భారత్ తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో క్రికెట్ అనేది మతం లాంటిది. భారత్ లో అయితే తమ అభిమాన క్రికెటర్లను దేవుళ్లుగా కూడా పూజిస్తారు. అటువంటి క్రికెటర్లలో సచిన్, ధోని వంటి ఉద్దండ క్రీడాకారులు ఉన్నారు. ఐసీసీ ప్యానెల్ లోని అన్ని జట్లు పాల్గొనే టోర్నమెంట్లను ఐసీసీ ముందుగానే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ని ఖరారు చేస్తుంది. దీని ఆధారంగా ఆయా జట్లు తమ ప్రణాళికలను మార్చుకుని వివిధ దేశాలతో ద్వైపాక్షిక టోర్నమెంట్లలో పాల్గొంటుంటాయి. ఐసీసీ తాయారు చేసే జాబితాను ప్యానెల్ లోని అన్ని జట్లు అనుసరిస్తుంటాయి.

 

ముఖ్యంగా వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఐపీల్, మహిళల టీ20 ప్రపంచ కప్, వన్ డే ప్రపంచ కప్, ఆసియా కప్ వంటి మేజర్ టౌర్నమెంట్లు జరగనున్నాయి. దీంతో క్రికెట్ క్రీడాభిమానులకు పండుగ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఇవే కాకుండా వన్డేలు, టెస్టులు కూడా క్రికెట్ ప్రేమికులను అలరించనున్నాయి.

 

ఇప్పటివరకూ జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్స్ ని పరిశీలిస్తే...

 

మొట్టమొదటి ఆసియా కప్ 1984లో ప్రారంభం అయింది. టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  (యూఏఈ) ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు టోర్నీలో పాల్గొన్నాయి. ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. భారత్ 7 సార్లు (6 సార్లు వన్డేల్లోనూ, ఒక టీ20 లో) టైటిల్ విజేతగా నిలవగా, శ్రీలంక ఆరు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ట్రోఫీని నెగ్గాయి. బంగ్లాదేశ్ అత్యధికంగా ఐదు సార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 2014 వరకు జరిగిన ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్లో నిర్వహించేవారు. 2015 నుంచి టోర్నీని వన్డే, టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. ధోని కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ సాధించింది భారత్.

 

ఆసియా కప్ లో శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య 25 మ్యాచ్ల్లో 1196 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకకే చెందిన ముత్తయ్య మురళీ ధరన్ 24 మ్యాచ్ల్లో 30 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

 

  • క్రికెట్ ప్రపంచ కప్ ప్రతి ఒక్కరి కల... అందులోని రికార్డులను పరిశీలిస్తే...
  •  1975లో ప్రారంభం అయిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు కప్ ను గెలుచుకుంది.
  • భారత్, వెస్టిండీస్ రెండేసి సార్లు, ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి కప్పులను గెలుచుకున్నాయి.
  •  భారత్ కు 1983 లో కపిల్ దేవ్ నాయకత్వంలోనూ, 2011 లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ప్రపంచ కప్పులను సాధించి పెట్టారు.
  •  1987 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ఇండియా మధ్య జరగాల్సిన 60 ఓవర్ల మ్యాచ్ ను 50 ఓవర్లకు కుదించారు.
  •  అత్యధిక టీమ్ స్కోర్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2015లో  ఆఫ్ఘనిస్థాన్ పై  (417/6)  స్కోరు సాధించింది.
  •  అత్యల్ప స్కోర్ 2003 లో కెనడా శ్రీలంకపై 36 పరుగులు చేసింది.
  •  2015 లో ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచులో ఇరుజట్లు 18 వికెట్లు కోల్పోయి 688  పరుగులు చేసాయి.

 

అత్యధిక పరుగుల ఛేదనలో 2011 లో ఇంగ్లాండ్ చేసిన 327/8 పరుగులను ఐర్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా అత్యధికంగా 65 మ్యాచుల్లో విజయం సాధించగా, 48 విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. జింబాబ్వే అత్యధికంగా 42 మ్యాచుల్లో ఓడిపోగా, శ్రీలంక 35 మ్యాచుల్లో ఓడిపోయింది.

 

సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 2,278 పరుగులు సాధించగా, రికీ పాంటింగ్ 1,743 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అత్యధి అర్ధ శతకాలు కూడా సచిన్ పేరిట ఉన్నాయి. సచిన్ మొత్తం 21 హాఫ్ సెంచురీలు చేయగా, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 12 చేసాడు. 2015 లో జింబాబ్వేతో  జరిగిన మ్యాచులో వెస్టిండీస్ కి చెందిన క్రిస్ గేల్ 138 బంతుల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచురీ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెగ్రాత్ 71 వికెట్లు సాధించగా, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ 68 వికెట్లను సాధించి రెండో స్థానంలో నిలిచాడు.

 

ధనాధన్ టీ20 క్రికెట్ లో రికార్డులు

 

2007 లో ప్రారంభించిన పొట్టి క్రికెట్ గా పిలువబడే మొట్టమొదటి టీ20 క్రికెట్ టోర్నమెంటును పాకిస్థాన్ ను ఓడించి భారత్ టైటిల్ సాధించింది. 2007 - 2022 వరకు జరిగిన టోర్నీలో వెస్టిండీస్, ఇంగ్లాండ్ లు అత్యధికంగా రెండేసి సార్లు టైటిళ్లు సాధించాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి గెలుపొందాయి. 2012, 2016 లో వెస్టిండీస్, 2010, 2022 లో ఇంగ్లాండ్, 2009 లో పాకిస్తాన్, 2014 లో శ్రీలంక, 2021 లో ఆస్ట్రేలియా గెలుపొందాయి.

 

టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 27 మ్యాచుల్లో 25 ఇన్నింగ్స్ ఆడి 89 పరుగుల అత్యధిక స్కోరుతో 81.50 సగటు, 14 అర్ధ సెంచురీలతో 1,141 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే 1,016 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

 

ప్లేయర్లకు కోట్లు కురిపిస్తున్న ఐపీల్... ప్రతిభ చూపుతున్న వర్ధమాన క్రీడాకారులు ...

 

2008 లో ప్రారంభించిన పొట్టి క్రికెట్ గా పిలువబడే ధనాధన్ ఐపీల్ ఇప్పటి వరకూ 14 సార్లు జరిగింది. ఇందులో అత్యధికంగా ముంబై ఇండియన్స్ 5 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు, కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి గెలుపొందాయి. ఎంతోమంది వర్ధమాన క్రీడాకారులు తమ ప్రతిభను ఐపీల్ లో కనబరుస్తూ జాతీయ జట్టులో కూడా స్థానాన్ని సంపాదిస్తున్నారు. అంతే కాకుండా వేలంలో కొనుగోలు చేసుకుంటున్న జట్లు ఆటగాళ్లకు లక్షల నుంచి కోట్లను కుమ్మరిస్తున్నాయి. మొట్టమొదటి ఐపీల్ టోర్నమెంటును రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది.

 

అత్యధిక సిక్సులు బాదిన వారిలో మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మొత్తం 5 ఐపీల్ టైటిళ్లను ముంబై ఇండియన్స్ కు, ఒకసారి డెక్కన్ చార్జర్స్ జట్టుకు టైటిళ్లు సాధించి పెట్టి విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు రన్నరప్ గా నిలిచింది.

 

ఇవేకాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ రకాల పేర్లతో క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతుంటాయి. ఆయా మ్యాచుల్లో ఎంతో మంది క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తుంటారు. దీనికోసం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జూనియర్ స్థాయి నుంచే ప్రతిభ కలిగిన వారికి తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) ద్వారా ఇప్పటికే ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు బైటకు వచ్చారు. వారు తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా 2023 లో జరగనున్న మేజర్ క్రికెట్ టోర్నమెంట్లు

 

డిసెంబర్ 2022 - 23 ఫిబ్రవరి నెల వరకు బిగ్ బాష్ లీగ్ ఆస్ట్రేలియాలో ఫైనల్ మ్యాచ్ తో సహా మొత్తం 61 మ్యాచులు జరగనున్నాయి.

 

జనవరి - ఫిబ్రవరి 2023 వరకు బీపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తో సహా మొత్తం 46 టీ20 మ్యాచులు బాంగ్లాదేశ్ లో జరగనున్నాయి .

ఫిబ్రవరి 2023 లో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. మొత్తం 23 మ్యాచులు జరగనున్నాయి.

 

2023 మార్చి నుంచి జూన్ వరకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐపీల్ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 74 మ్యాచులు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. మ్యాచులు భారత దేశంలోని పలు నగరాల్లో జరగనున్నాయి.

 

2023 జూన్ నుంచి జులై నెల మధ్యలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక 5 మ్యాచుల యాషెస్ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ లో జరగనుంది.

 

2023 సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగనుంది. ఒక ఫైనల్ మ్యాచ్  సహా 12 మ్యాచులు జరగనున్నాయి. ఈసారి టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.

 

2023 అక్టోబర్-నవంబర్ నెల మధ్య వన్డే ప్రపంచకప్ జరగనుంది. భారత దేశం ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్ లో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి.

 

అదేవిధంగా భారత్ జనవరిలో శ్రీలంకతో స్వదేశంలోనే తలపడనుంది.ఇందులో 3 టీ20 మ్యాచులు, 3 వన్డేలు ఆడనుంది. అనంతరం జనవరి-ఫిబ్రవరి మధ్యలో న్యూజిలాండ్ తో స్వదేశం లోనే భారత్ 3 టీ20 మ్యాచులు, 3 వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి-మర్చి మధ్యలో ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది. పర్యటనలో 4 టెస్టులు, 3 వన్డే మ్యాచులు ఆడనుంది.

 

ప్రపంచంలో అత్యధికంగా టీవీ, క్రీడా మైదానాల్లో వీక్షించే క్రీడా ఏదైనా ఉంది అంటే అది ఒక్క క్రికెట్ మాత్రమే అంటే సందేహం లేదు. కోట్లాది మంది క్రీడను ఆస్వాదిస్తున్నారు. అందుకే క్రికెట్ అనేది ఒక మతం... మతానికి కులమత భేదం అనేది లేదు. పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు... ప్రతి ఒక్కరూ క్రికెట్ ను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.