దివికేగిన ఫుట్బాల్ దిగ్గజం పీలే : Pele the Legendary Player
మరో ధృవతార రాలిపోయింది... దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు పీలే ఇక లేరు. మూడు ఫుట్బాల్ ప్రపంచ కప్పులు గెలిచిన అయన క్యాన్సర్ తో పోరాడుతూ మృత్యు ఒడికి చేరుకున్నారు.
దివికేగిన ఫుట్బాల్ దిగ్గజం పీలే : Pele the Legendary Player
మరో ధృవతార రాలిపోయింది... దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు పీలే ఇక లేరు. మూడు ఫుట్బాల్ ప్రపంచ కప్పులు గెలిచిన అయన క్యాన్సర్ తో పోరాడుతూ మృత్యు ఒడికి చేరుకున్నారు.
ఫుట్బాల్ దిగ్గజంగా పేరుగాంచిన బ్రెజిల్ కి చెందిన పీలే (82) తుదిశ్వాస వదిలారు. నాలుగు ప్రపంచ కప్పుల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించిన పీలే మూడు ప్రపంచ కప్పులను బ్రెజిల్ కు అందించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రాత్రి కన్నుమూశారు. 1958, 1962, 1970 ల్లో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ ట్రోపీలో పాల్గొని కప్పులు సాధించారు.
ప్రపంచకప్స్ లో జరిగిన 14 మ్యాచుల్లో పాల్గొని 12 గోల్స్ కొట్టాడు 1970 లో ఉత్తమ ఆటగాళ్లకు ఇచ్చే 'గోల్డెన్ బూట్' అందుకున్నాడు. పీలే పూర్తి పేరు ఎడ్సన్ ఆరాంట్స్ డో నాసిమియాంటో. స్కూల్లో ముద్దుగా పిలిచే పేరు పీలే తోటి ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. దాదాపు 20 ఏళ్లపాటు ఫుట్బాల్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు.
17 ఏళ్లకే ప్రపంచ కప్ : In the Age of 17 played World Cup
1958 ఫుట్బాల్ ప్రపంచకప్ (FIFA) పోటీల సమయంలో పీలే వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. జూన్ 29 న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ స్వీడన్ ను 5-2 గోల్స్ తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్స్ లో పీలే 2 గోల్స్ చేసాడు. ఒక్క 1959 వ సంవత్సరంలోనే 126 గోల్స్ చేసాడు. పీలే మొత్తం 757 గోల్స్ అధికారికంగా జరిగిన మ్యాచుల్లో చేసినట్లు ఫిఫా (FIFA) ప్రకటించింది. అతను ఆడిన అధికారికంగా, అనధికారికంగా ఆడిన 1363 మ్యాచుల్లో 1281 గోల్స్ చేసాడు. బంతిని మెరుపువేగంతో గోల్ పోస్ట్ లోకి పంపడంలో పీలేకి ఎవరూ సతి రారనడంలో సందేహమే లేదు. పీలే మృతి పట్ల ఫుట్బాల్ క్రీడాకారులు రోనాల్డో, మెస్సీ వంటి దిగ్గజాలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేసారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.