నేడు జాతీయ సైన్స్ దినోత్సవం : National Science Day 2023

నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’అని భారత రత్న బిరుదును అందుకుంటున్నప్పుడు రామన్ చేసిన ఉద్భోద ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆణిముత్యాల వంటి పలుకులు, అందరికీ మార్గదర్శకాలు.

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం : National Science Day 2023

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం : National Science Day 2023

నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయిఅని భారత రత్న బిరుదును అందుకుంటున్నప్పుడు రామన్ చేసిన ఉద్భోద ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆణిముత్యాల వంటి పలుకులు, అందరికీ మార్గదర్శకాలు.

 

‘నా మతం సైన్సు... దానినే జీవితాంతం ఆరాధిస్తా...’ భారతీయుల్లో ప్రతిభకు కొదవ లేదు... పరిశోధనల కోసం మన భారతీయులు విదేశాలకు వెళ్లడం ఎందుకు? విదేశీయులేపరిశోధనల కోసం ఇక్కడకు రావాలని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి సర్ సీవీ రామన్. విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదునిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయిఅని భారత రత్న బిరుదును అందుకుంటున్నప్పుడు రామన్ చేసిన ఉద్భోద ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆణిముత్యాల వంటి పలుకులు, అందరికీ మార్గదర్శకాలు.

రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు 95 ఏళ్ళు : 95 Years of Discovery of Raman Effect

1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ఆవిష్కరణ చేసిన రోజునే జాతీయ సైన్స్ దినోత్సవం (National Science Day) గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయాన్ని 1987 ఫిబ్రవరి నుంచి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసి (First Asian Person) సీవీ రామన్ కావడం గమనార్హం. భారతీయ సైన్స్ సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు. కేవలం 200 రూపాయల (With 200 Rupees) విలువైన పరికరాలతోనే అతి క్లిష్టమైన ప్రయోగాలు చేసి ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన మహోన్నతమైన వ్యక్తి రామన్.

ఫిజిక్స్ లో నోబెల్ (Nobel in Physics) అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిన రామన్ రికార్డును ఇప్పటివరకూ ఎవ్వరూ అధిగమించలేదు. రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. రామన్ కి అవార్డు దక్కక ముందువరకూ నోబెల్ బహుమతులు (Nobel Awards) అన్నీ విదేశీయలకే లభించేవి. ఇక్కడే విద్యాబ్యాసం, పరిశోధనలు చేసి సైన్స్ రంగంలో భారత్ ఖ్యాతిని (India's reputation) ప్రపంచానికి చాటి చెప్పారు. జీవిత చరమాంకం వరకూ శాస్త్రాన్వేషణలోనే తరించిన వ్యక్తి.

 

సీవీ రామన్ (CV Raman) పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్ (Chandrasekhar Venkata Raman). 1888 నవంబరు 7 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు ఆయన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ప్రాథమిక విద్యను (Primary Studies) పూర్తి చేశారు. రామన్ తండ్రి కూడా భౌతిక శాస్త్రం (Physics) ఉపాధ్యాయుడు. 12 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన రామన్ బంగారు పతకం (Gold Medal) సాధించాడు. చిన్నతనం నుంచే విజ్ఙాన శాస్త్రం (Science) పై అమితమైన ఆసక్తిని చూపించేవారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ (UG), మాస్టర్స్ డిగ్రీ (Master’s Degree) పూర్తి చేసారు. అక్కడ కూడా ఆయన బంగారు పతకం (Gold Medal) సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. అనంతరం రామన్ తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పరీక్షల్లో (ICS Exams) ఉత్తీర్ణులై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో (Treasury Department) డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. తరువాత కలకత్తాలోని బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ (Indian Association for Cultivation of Science) సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధనలు చేసేందుకు ఆయన నుంచి అనుమతిని పొందారు.

18 సంవత్సరాల నుంచే వ్యాసాలు : Writing Essays from 18 Years

రామన్ తన 18 సంవత్సరాల వయస్సులోనే కాంతికి సంబంధించిన ధర్మాలపై (Virtues) రాసిన వ్యాసాలు లండన్ నుంచి ప్రచురితమయ్యే ఫిలాసిఫికల్ మేగజైన్లో (Philosophical Magazine) ప్రచురితమయ్యాయి. దీంతో రామన్ కి ఉన్న జ్ఞానం, అభిరుచిని గమనించిన ప్రొఫెసర్లు (Professors) మరింత మెరుగైన పరిశోధనల కోసం ఇంగ్లాండ్ (England) వెళ్లాలని సూచించారు. అయితే ఇంగ్లాండ్ వెళ్ళడానికి ముందుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకి అక్కడి వాతావరణం సరిపడదని చెప్పారు. దీంతో రామన్ ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగిగా చేరి 1907లో కలకత్తాకు ఉద్యోగ రీత్యా బదిలీపై (Transfer) వెళ్లారు. కలకత్తాలో ఉన్న ఇండియన్ సైన్స్ అసోషియేషన్ (Indian Science Asoociation) కి ప్రతిరోజూ వెళ్లి అక్కడ ఆయన పరిశోధనలు చేసేవారు. రామన్ కి ఉన్న ఆసక్తిని గమనించిన కలకత్తా యూనివర్సిటీ (Kolkata University) వైస్-ఛాన్సలర్ (Vice-Chancellor) అశుతోష్ ముఖర్జీ ఆయన్ని ఎంతో ప్రోత్సహించారు. స్వయంగా అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ (British Government) రామన్ చేస్తున్న పరిశోధనలను ఉపయోగించుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో రామన్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో పరిశోధనల కోసం తన సమయాన్ని కేటాయించారు.

రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ వీణను (Raman's Mother Plays Veena) అద్భుతంగా వాయించేవారు. దీంతో రామన్ తన తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై కొనసాగించారు. విజ్ఞాన పరిశోధనలపై (Scientific research) ఉద్యోగానికి రాజీనామా (Resigned the Job) చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా (Physics Professor) చేరారు. తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై (Acoustic mystery of musical instruments) 1921లో లండన్లో ఉపన్యాసాలు ఇచ్చారు. శ్రోతల్లోని వ్యక్తి ఇలాంటి అంశాలపై పరిశోధనలు చేసి రాయల్ సొసైటీ సభ్యుడవుదామని (Royal Society Member) భావిస్తున్నావా అంటూ రామన్ ను హేళన చేశాడు.

దీంతో రామన్శబ్దశాస్త్రం (Phonology) నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించారు. ఇంగ్లాండు నుంచి భారత దేశానికి తిరిగి వస్తుండగా ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని గమనించాడు. అప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు సముద్రపు నీలం రంగుకు (Sea blue color) కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని.... సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం (Light scattering) చెందడమే కారణమని ఊహించాడు.

 

కలకత్తా చేరుకోగానే తాను ఏదైతే ఊహించాడో దానిని నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం (Dispersion) గురించి పరిశోధనలు (Experiments) చేశారు. పరిశోధనలో రామన్ కి కె.ఆర్.రామనాథన్, కె.యస్ .కృష్ణన్ అనే యువ శాస్త్రవేత్తలు అండగా నిలిచారు. 1927 సంవత్సరానికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందిన కాంప్టన్ ఎక్స్ కిరణాలు (Compton X rays) పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆయన యొక్క ఆలోచనే రామన్ ఎఫెక్ట్కు దారితీసింది.

 

తన పరోశోధన కోసం అధునాతన పరికరాలు లేకపోయినప్పటికీ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మాడు. దీనికి తగ్గట్లుగానే 1928 ఫిబ్రవరి 28 ఆయన రామన్ ఎఫెక్ట్ను (Raman Effect) కనుగొన్నారు. అదే ఏడాది మార్చి 16 బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో (Scientists conference) రామన్ విషయాన్ని వెల్లడించారు. రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం.. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రామన్ రుజువు చేసి చూపించారు. పరిశోధనల కోసం ఉన్నటువంటి అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను ప్రపంచ నలుదిశలా (Worldwide) ప్రసరింపజేశారు.

కేవలం రూ.200 ఖర్చుతో ప్రయోగం : Experiment at a cost of just Rs.200

కేవలం 200 రూపాయల ఖర్చుతో (With 200 rupees Expense) దృగ్విషయ నిరూపణ (Phenomenological proof) చేయడం అసామాన్యమని అందరూ కొనియాడారు. రామన్ పరిశోధనను గుర్తించిన రాయల్ స్వీడిష్ అకాడమీ భౌతికశాస్త్ర (Swedish Academy Physics) విభాగంలో ఆయనకి 1930లో నోబెల్ (Nobel) బహుమతి ప్రదానం చేసింది. అంతేకాకుండా బ్రిటిష్ (British Government) ప్రభుత్వం ఆయన పరిశోధనల కోసం అనుమతిని నిరాకరించిందో అదే ప్రభుత్వం 1929లో నైట్ హుడ్ బిరుదుతో (Knighthood Award) రామన్ ను సత్కరించి గౌరవించింది. భారత ప్రభుత్వం ఆయనకు 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో (Bharat Ratna) సత్కరించింది. రామన్పరిశోధనలు సైన్స్లో ఒక కొత్త విప్లవానికి పునాది వేసాయి. రామన్స్పెక్ట్రోస్కోపీ (Raman Spectroscopy) ఆవిర్భావానికి, శాస్త్రరంగంలోను, పారిశ్రామిక రంగంలోను కొత్తపుంతలు తొక్కేందుకు దారితీసింది.

 

అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్‌‌కు 1924లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం (Membership of Royal Society) లభించింది. అనంతరం 1928లో అత్యంత గౌరవమైన సర్ బిరుదు (Honor of Sir Award) దక్కింది. 1947లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ వరించింది. సీవీ రామన్ తన పరిశోధనలతో రామన్ ఎఫెక్ట్ (Raman Effect) కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. అందుకే ఆయన గౌరవార్ధం ప్రతి ఏడాది ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవం (National Science Day) గా జరుపుకుంటున్నాము. సర్ సీవీ రామన్ 1970 నవంబర్ 21 కన్నుమాశారు.