వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెటర్లు : Indian cricketers who have hit the most sixes in ODIs

క్రికెట్ ఆడే దేశాల్లో భారత దేశానికి ఒక ప్రత్యేక స్థానముంది. నేడు అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసం సృష్టించే క్రికెటర్లు ఇండియన్ టీమ్ లో ఉన్నారు. బౌండరీ లైన్ అవతలికి గానీ, స్టేడియం బైటకి గానీ బంతిని తమ బ్యాటింగ్ తో పంపించే వారు ఉన్నారు.

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెటర్లు : Indian cricketers who have hit the most sixes in ODIs

వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెటర్లు : Indian cricketers who have hit the most sixes in ODIs

క్రికెట్ ఆడే దేశాల్లో భారత దేశానికి ఒక ప్రత్యేక స్థానముంది. నేడు అన్ని ఫార్మాట్లలోనూ విధ్వంసం సృష్టించే క్రికెటర్లు ఇండియన్ టీమ్ లో ఉన్నారు. బౌండరీ లైన్ అవతలికి గానీ, స్టేడియం బైటకి గానీ బంతిని తమ బ్యాటింగ్ తో పంపించే వారు ఉన్నారు.

 

భారత క్రికెటర్ల వన్డే రికార్డులు : ODI records of Indian Cricketers

భారతీయ క్రికెటర్లను ఎక్కువగా ఆరాధించే, అభిమానించే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. భారత్ క్రికెట్ మ్యాచ్ దేశంతో ఆడుతున్నా ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు.. మొబైల్ లో లీనమైపోతారు. టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచులు ఇలా ఫార్మాట్ అయినా భారత క్రికెటర్లు మోత మోగిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఉద్దండ బ్యాట్స్ మన్లు ఇండియన్ క్రికెట్ ను ఒక స్థాయికి తీసుకెళ్లారు. అందుకే భారత క్రికెట్ క్రీడాభిమానులు వీరిని తమ ఆరాధ్య దేవుళ్లుగా కొలుస్తారు.

 

భారతదేశం మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ ను 1921 లో ఆడింది. అయితే అధికారిక టెస్ట్ మ్యాచ్ ను మాత్రం 1932, జూన్ 25 ఆడింది. అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టిన 50 సంవత్సరాల్లో 196 టెస్టులు ఆడి 35 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. 1983 సంవత్సరంలో జరిగిన మూడవ ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గెలుచుకుంది.

రెండు వరల్డ్ కప్స్ తెచ్చిపెట్టిన ధోని : Dhoni won two World Cups

అనంతరం 2011 లో ఎమ్మెస్ ధోని సారధ్యంలో సగర్వంగా రెండోసారి ప్రపంచ కప్ గెలిచింది. సహచరులతో మహీ భాయ్ గా పిలవబడే ఎమ్మెస్ ధోని సారధ్యంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకుంది. సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా మన భారత క్రికెటర్లలో వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన వారిని పరిశీలిస్తే...

 

రోహిత్ శర్మ (256 సిక్సులు)

ప్రస్తుత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ 2007 జూన్ 23 ఐర్లాండ్ పై ఆడాడు. ముంబై నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ హిట్ మ్యాన్ గా పేరుపొందారు. 1987 ఏప్రిల్ 30 మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించాడు. తండ్రి మరాఠీ కాగా, తల్లి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు కావడంతో తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడతాడు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా పై ఆడేందుకు ఇష్టపడతాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు. వన్డేల్లో మొట్టమొదటిగా డబుల్ సెంచురీ చేసిన మొదటి బ్యాట్స్ మాన్ గా రికార్డు సృష్టించాడు.

 

సురేష్ రైనా తరువాత మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్ట్, టీ20 )లో సెంచురీలు చేసిన రెండో బ్యాట్స్ మాన్. ఒకే మ్యాచులో 16 సిక్సులు కొట్టి ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ తో సమానంగా నిలిచాడు. 2007-2022 మధ్య కాలంలో 235 మ్యాచుల్లో 228 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 34 సార్లు నాటవుట్ గా నిలిచాడు. 89.42 సగటుతో 9454 పరుగులను సాధించాడు. ఇందులో 29 సెంచురీలు, 46 అర్ధ సెంచురీలు ఉన్నాయి. మొత్తం 256 సిక్సులు కొట్టి భారత క్రికెటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

 

ఎమ్మెస్ ధోని (229 సిక్సులు)

ధనాధన్ ధోనీగా ప్రసిద్ధికెక్కిన ఎమ్మెస్ ధోని భారత్ ను క్రికెట్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాడనడంలో సందేహమే లేదు. 1981 జులై 7 తేదీన అప్పటి బీహార్ ఇప్పటి ఝార్ఖండ్ లోని రాంచీలో పుట్టాడు. 2004 లో భారత వన్డే క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసాడు. తాను ఆడిన మొదటి 4 వన్డేల్లోనూ విఫలమైన ధోని తరువాత పాకిస్తాన్ తో జరిగిన ఐదో వన్డేలో 148 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. 2007 లో వన్డే క్రికెట్ కెప్టెన్సీ చేపట్టిన ధోని టీ20 వరల్డ్ కప్ ను సాధించి పెట్టాడు.

 

2009 డిసెంబర్ లో మొట్టమొదటిసారి భారత్ ను టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా నిలబెట్టాడు. 2011 లో ఇండియాలోనే జరిగిన ప్రపంచ వన్డే క్రికెట్ లో శ్రీలంకను మట్టికరిపించి ట్రోఫీని సాధించి పెట్టాడు. 2017 లో తన క్రికెట్ కెరీర్ కి వీడ్కోలు పలికాడు. 2004-2019 వరకు 350 వన్డే మ్యాచుల్లో 297 ఇన్నింగ్సులు ఆడిన ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేసాడు. మొత్తంగా తానాడిన వన్డేల్లో 229 సిక్సులు బాదాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఐపీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 

సచిన్ టెండూల్కర్ (195 సిక్సులు)

వన్డే క్రికెట్ అంటే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది సచిన్ పేరు. అంతలా క్రికెట్ తో పెనవేసుకున్న సచిన్ భారత క్రికెట్ అభిమానులు  క్రికెట్ దేవుడిగా పిలుచుకుంటుంటారు. సచిన్ ముంబయిలో 1973 ఏప్రిల్ 24 జన్మించాడు. బ్యాటింగ్ తో పటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో వికెట్లు సాధించి ఆల్ రౌండర్ గా పేరొందాడు. చిన్న వయసులోనే భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ బౌలర్ అయినా లెక్కచేసే వాడు కాదు.

 

463 వన్డేల్లో 452 ఇన్నింగ్స్ ఆడి 44.83 సగటుతో18426 పరుగులు సాధించాడు. 86.23 స్ట్రయిక్ రేట్ ఉన్న సచిన్ తాను ఆడిన వన్డేల్లో మొత్తం 195 సిక్సర్లు కొట్టాడు. 2011 వన్డే ప్రపంచ క్రికెట్ జట్టులో సభ్యుడైన సచిన్ ను కప్ గెలిచినా అనంతరం జట్టులోని సభ్యులు అందరూ సచిన్ ని తమ భుజాలపైకి ఎక్కించుకుని స్టేడియం మొత్తం తిరగడం సచిన్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

 

సౌరబ్ గంగూలీ (190 సిక్సులు)

ఆఫ్-సైడ్ క్రికెట్ కి దేవుడిగా పేరొందిన సౌరబ్ గంగూలీ ఇండియన్ క్రికె టీమ్ ని నడిపించే నాయకుడిగా పనిచేసాడు. 1992-2007 మధ్య భారత్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కి అధ్యక్షుడిగా చేసారు. 1972 జులై 8 కలకత్తాలో జన్మించిన గంగూలీ 1996 లో లార్డ్స్ మైదానంలో చేసిన సెంచురీ చిరస్మరణీయమైనది చెబుతాడు. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ కాంబినేషన్లో ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు నమోదయ్యాయి. మొత్తం 311 మ్యాచుల్లో 300 ఇన్నింగ్స్ ఆడిన గంగూలీ 41.02 సగటుతో 11363 పరుగులు సాధించాడు. 73.70 స్ట్రయిక్ రేట్ ఉన్న గంగూలీ వన్డేల్లో మొత్తం 190 సిక్సులు బాదాడు.

 

యువరాజ్ సింగ్ (155 సిక్సులు)

ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన మొదటి బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించిన లైఫ్ హ్యాండ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్. చండీగఢ్ లో 1981 డిసెంబర్ 12 జన్మించిన యువరాజ్ భారత్ క్రికెట్ తరపున ఆడుతూ ఎన్నో మ్యాచుల్లో మరపురాని ఇన్నింగ్స్ ఆడి చరిత్రలో నిలిచిపోయాడు. బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా వేస్తూ ఎన్నో వికెట్లను సాధించాడు. 2007 లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తానాడిన 304 వన్డేల్లో 278 ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ 36.55 సగటుతో 8701 పరుగులు సాధించాడు. 87.67 స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్నాడు. మొత్తం తాను ఆడిన వన్డేల్లో 155 సిక్సులు కొట్టాడు.

 

వీరేంద్ర సెహ్వాగ్ (136 సిక్సులు)

అది టెస్టు మ్యాచ్ అయినా... వన్డే మ్యాచ్ అయినా ...ఒకేలా బ్యాటింగ్ చేసే బ్యాట్స్ మన్ గా వీరేంద్ర సెహ్వాగ్ పేరు పొందాడు. రాగానే బంతిపై దాడి చేసేవాడు డైనమిక్ బ్యాట్స్ మన్ సెహ్వాగ్. నిర్దాక్షిణ్యంగా బౌలర్ పై విరుచుకు పడేవాడు. సెహ్వాగ్1978 అక్టోబర్ 20 తేదీన ఢిల్లీలో జన్మించాడు. 1999-2013 వరకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. సెహ్వాగ్ కి బౌలింగ్ చేయడానికి బౌలర్లు ఆలోచనలో పడేవారంటే సెహ్వాగ్ విధ్వంసం ఎంతలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. క్రీజులో నుంచుని బాల్ ని స్టాండ్స్ లోకి పంపేవాడు. ఫాస్ట్ బౌలర్, స్పిన్ బౌలర్ ఎవ్వరినీ వదిలిపెట్టే వాడు కాదు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచురీ చేసిన మొదటి భారతీయ గా నిలిచాడు.  278 బంతుల్లో 319 పరుగులు చేసాడు. మొత్తం 251 మ్యాచుల్లో 245 ఇన్నింగ్స్ లో 35.05 సగటుతో 8273 పరుగులు చేసిన సెహ్వాగ్ 104.03 స్ట్రయిక్ రేట్ ను సాధించాడు. మొత్తం వన్డేల్లో 136 సిక్సర్లు సాధించాడు.

 

విరాట్ కోహ్లీ (127 సిక్సులు)

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఐకాన్ క్రికెర్ గా పేరు పొందిన భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ పేరుపొందారు. 2008 లో కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ను సాధించిన అనంతరం వెలుగులోకి వచ్చాడు కోహ్లీ. 1983 నవంబర్ 5 తేదీన ఢిల్లీలో విరాట్ జన్మించాడు. 2008 లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో భారత సీనియర్ జట్టులో ప్రవేశించాడు. విరాట్ బ్యాటింగ్ లో ఎక్కువగా టెక్నిక్ ఉంటుందని క్రికెట్ నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకు తగినట్లుగానే విరాట్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో అందరినీ అలరిస్తున్నాడు. సినీ హీరోయిన్ అనుష్క శర్మ ను వివాహం చేసుకున్నాడు. ఇప్పటివరకూ 265 మ్యాచుల్లో 256 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 57.47 సగటుతో 93.01 స్ట్రయిక్ రేట్ తో 12471 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకూ నాటిన వన్డేల్లో 127 సిక్సులు బాదాడు.

 

సురేష్ రైనా (120 సిక్సులు)

టీ20 మ్యాచుల్లో విధ్వంసం సృష్టించే ఎడమ చేతివాటం బ్యాట్స్ మన్ గా సుప్రసిద్ధి చెందిన సురేష్ రైనా భారత సీనియర్ జట్టులోకి 2005 లో అడుగుపెట్టాడు. గాయాల కారణంగా కొన్నాళ్లపాటు దూరమైనా టీ20 లతో అందరినీ ఆకర్షించాడు. 1986 నవంబర్ 27 ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని మురాద్ నగర్ లో సురేష్  రైనా జన్మించాడు.

తాను ఆడిన అన్ని ఫార్మాట్లలో రైనా సెంచురీలు సాధించడం విశేషం. 2005-2018 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉంది జట్టు విజయాల్లో కీల పాత్ర పోషించాడు. మొత్తం 226 మ్యాచుల్లో 194 ఇన్నింగ్స్ ఆడిన రైనా 35.31 సగటుతో 93.50 స్ట్రయిక్ రేటుతో 5615 పరుగులు సాధించాడు. మొత్తం తాను ఆడిన వన్డేల్లో 120 సిక్సర్లు సాధించాడు.

 

అజయ్ జడేజా (85 సిక్సులు)

గుజరాత్ కి చెందిన అజయ్ జడేజా ఒకప్పటి మేటి బ్యాట్స్ మన్, బౌలర్ గా అందరికీ సుపరిచితమే. 1971 ఫిబ్రవరి 1 జాంనగర్ లో జన్మించిన జడేజా 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కుకుని అపఖ్యాతి పాలయ్యాడు. అయితే 2003 జనవరి 27 ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేసి మరలా జాతీయ, అంతర్జాతీయ మ్యాచులు ఆడదానికి మార్గం కల్పించిన తన కెరీర్ కి ముగుంపు పలికాడు. తన కెరీర్లో 196 వన్డేల్లో 179 ఇన్నింగ్స్ లో 37.47 సగటు, 69.79 స్ట్రయిక్ రేట్ తో 5359 పరుగులు సాధించాడు. మొత్తం వన్డేల్లో 85 సిక్సర్లు బాదాడు.

 

శిఖర్ ధావన్ (79 సిక్సులు)

మొహాలీలో 2012-13 లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచులో అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచురీ సాధించి ధావన్ వెలుగులోకి వచ్చాడు. 1985 డిసెంబర్ 5 ఢిల్లీలో జన్మించిన శిఖర్ 2010 లో తన కెరీర్ ని ఆరంభించాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ లో 84.16 సగటుతో 505 పరుగులను మూడు సెంచురీలతో సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పటికీ భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ధావన్ 167 మ్యాచుల్లో 164 ఇన్నింగ్స్ ఆడి 44.11 సగటు, 91.35 స్ట్రయిక్ రేట్ తో 6793 పరుగులు చేసాడు. మొత్తం వన్డేల్లో ఇప్పటి వరకు 79 సిక్సులు కొట్టాడు.

సిక్సులే సిక్సులు : Sixers sixers 

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16 వ సీజన్ (IPL 16th season) కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని (MS Dhoni) ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఎవరు బౌలింగ్ చేసినా దానిని సిక్సర్లుగా మలుస్తున్న వీడియోలు నెట్టింటిలో (Sixers video viral) వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన ధోని కొడుతున్న సిక్సర్ల వీడియోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ధోని ఆడతాడో లేదో అనే అనుమానం ఇప్పటికే అభిమానుల్లో మొదలయింది. ఒకవేళ ఇదే చివరి ఐపీఎల్ అయితే మాత్రం ఖచ్చితంగా చెన్నై జట్టుకు ధోని కప్ (IPL Cup) అందించి తీరతాడని CSK అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల నుంచి ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకున్న (All formats retirement) ధోని ఈ ఏడాది చెన్నై జట్టుకు సీపీ అందించాలనే పట్టుదలతో ఉన్నట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.