హోరాహోరీగా జరగనున్న డబ్ల్యుటీసీ ఫైనల్ : The WTC final will be fierce
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ (WTC final match) ఈ నెల 7 వ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. గత 10 సంవత్సరాల నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ (ICC trophy) కూడా నెగ్గలేదు.
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ (WTC final match) ఈ నెల 7 వ తేదీ నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. గత 10 సంవత్సరాల నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ (ICC trophy) కూడా నెగ్గలేదు. భారత జట్టు జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానం భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లకు తటస్థ వేదికలా మారింది. అయితే, ఈ గ్రౌండ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాల్సి ఉంది. అంతకంటే ముందు ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 106 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 44 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, 32 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. 29 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టై అయింది.
ఓవల్‌లో భారత, ఆస్ట్రేలియా జట్ల రికార్డులు : India, Australia team records at the Oval
భారత జట్టు ఓవల్‌లో ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్ కేవలం 2 మాత్రమే గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 2021 లో ఇంగ్లండ్‌తో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇందులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన భారత జట్టు 157 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ 127 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఆ జట్టు 7 మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 17 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. 14 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కల నెరవేరేనా? : Will the 10-year ICC trophy dream come true?
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీలో 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions trophy) భారత్ చివరిగా ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) ని గెలుచుకుంది. ఆ తరువాత ఐసీసీ ట్రోఫీ కల నెరవేరనే లేదు. దీంతో 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ కరువును టీమ్ ఇండియా ఖచ్చితంగా తీర్చాలనుకుంటోంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ జట్టు టైటిల్ గెలుచుకుంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. మొబైల్‌లో ప్రత్యక్ష ప్రసారం కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను చూడవచ్చు.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మార్నస్ లబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్.
పొంచి ఉన్న వర్షం ముప్పు : A threat of rain lurking
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వర్షాకాలం (rainy season) కొనసాగుతోంది. వర్షాలతోపాటు చలి కూడా వీపరితంగా ఉంటోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ (WTC final match) వర్షం కారణంగా రద్దయినా లేదా మ్యాచ్ ఫలితం రాకపోయినా ఎవరు ఛాంపియన్‌గా నిలుస్తారనే ప్రశ్న అభిమానుల్లో మొదలయింది. టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ జరిగే జూన్ 7 నుంచి జూన్ 11 వరకు ఏదైనా రోజు వర్షం కారణంగా ఆటంకాలు ఎదురైతే దీని కోసం రిజర్వ్ డే కూడా కేటాయించారు. జూన్ 12న కూడా ఒక రోజు ఎక్కువగా మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక వేళ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజున అంటే జూన్ 12న కూడా ఫైనల్ మ్యాచ్ ఫలితం రాకపోతే గనుక భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ (ICC) ప్రకటిస్తుంది. వర్షం కారణంగా ఆటకు గనుక అంతరాయం ఏర్పడితే... రిజర్వ్ డేను వాడుకుంటారు. అప్పుడు కూడా ఆట సాధ్యం కాకపోతే రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. అయితే అభిమానులు మాత్రం మ్యాచ్ జరగాలనే ఆశిస్తున్నారు.
డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టిక : WTC points table
ఆస్ట్రేలియా : 68.52% పాయింట్ల శాతం, 148 పాయింట్లు.
భారత్ : 60.29% పాయింట్ల శాతం, 123 పాయింట్లు.
దక్షిణాఫ్రికా : 55.56% పాయింట్ల శాతం, 100 పాయింట్లు.
శ్రీలంక : 53.33% పాయింట్ల శాతం, 64 పాయింట్లు.