T20I చరిత్రలో పరుగుల రికార్డు : Record runs in T20I history

T20 లు అంటేనే పరుగుల వరద పారించడం. అందుబాటులో ఉన్న 20 ఓవర్లలో అత్యధిక పరుగులు (highest runs) సాధించేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి.

T20I చరిత్రలో పరుగుల రికార్డు : Record runs in T20I history

T20I చరిత్రలో పరుగుల రికార్డు : Record runs in T20I history

T20 లు అంటేనే పరుగుల వరద పారించడం. అందుబాటులో ఉన్న 20 ఓవర్లలో అత్యధిక పరుగులు (highest runs) సాధించేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. 50 ఓవర్ల పాటు జరిగే వన్డేల్లో 250 నుంచి 300 పరుగులు చేస్తే అత్యధిక స్కోర్ గా పరిగణిస్తారు. మరి అదే 250 పరుగులను 20 ఓవర్ల పాటు సాగే T20I ల్లో సాధిస్తే అది నిజంగా సాధ్యమేనా అనిపిస్తుంది. అటువంటి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చూపించారు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చిందిన బ్యాట్స్‌మెన్‌లు.

 

T20I లో పరుగుల సునామీ : Tsunami of runs in T20I

పరుగుల వాన కాదు. ఏకంగా పరుగుల సునామీని (Tsunami) సృష్టించాయి ఇరుజట్లు. దీంతో పలు రికార్డులు T20 లో నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో T20I ఇందుకు వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు రికార్డు స్థాయిలో 258 పరుగులు (258 record runs) చేసి గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. అయితే దక్షిణాఫ్రికా (South Africa) స్టార్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ (Quinton De Kock) వారి ఆశలను అడియాసలు చేసాడు. అద్భుతమైన సెంచరీ చేసి వెస్టిండీస్ (West indies) కి షాకిచ్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 258 (258/5) పరుగుల స్కోర్ చేసింది. జట్టుకు చెందిన జాన్సన్చార్లెస్‌ (Johnson Charles) 46 బంతుల్లో 10 ఫోర్లు, 11 భారీ సిక్సర్లతో 118 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు. జాన్సన్ కి మద్దతుగా కైల్మేయర్స్‌ (Kailey Mayors) 27 బంతుల్లో 51 పరుగులు, షెప్పర్డ్‌ (Shepherd) 18 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 41 పరుగులు చేసారు.

అనంతరం భారీ లక్ష్యంతో ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా (South Africa) జట్టులోని స్టార్ బ్యాట్స్మెన్ డికాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేసాడు. ఇంకో బ్యాట్స్మెన్ హెన్డ్రిక్స్‌ (Hendricks) 28 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికా కేవలం 18.5 ఓవర్లలోనే 259/4 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయం అందుకుంది. దీంతో T20I ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన (highest runs chased) జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇరు జట్లూ కలిపి మ్యాచ్లో 517 పరుగులు చేసి అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్గా రికార్డు నెలకొల్పాయి.

 

రికార్డు స్థాయిలో బౌండరీలు : A record boundaries

మొత్తమ్మీద మ్యాచ్లో 35 సిక్సర్లు (35 sixes) నమోదయ్యాయి. ఇందులో వెస్టిండీస్ 22, దక్షిణాఫ్రికా 13 సిక్సర్లు కొట్టాయి. అదేవిధంగా దక్షిణాఫ్రికా (South Africa) 29, వెస్టిండీస్ (West indies) 17 ఫోర్లు నమోదు చేసాయి. కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 394 పరుగులు from 4’s and sixes 394 runs) వచ్చాయి. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో 2016 లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్గా ఇప్పటివరకూ రికార్డు (previous record) కలిగి ఉంది. మ్యాచ్లో 489 పరుగులు నమోదయ్యాయి. అదేవిధంగా అత్యధిక పరుగులు ఛేదన రికార్డు (highest run chased previous record) 2018 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 పేరిట ఉంది. మ్యాచ్లో ఆస్ట్రేలియా 245 పరుగుల లక్ష్యాన్ని (target) అలవోకగా ఛేదించింది. ఇప్పటివరకూ నమోదై ఉన్న రెండు రికార్డులు ఆదివారం జరిగిన మ్యాచ్లో బ్రేక్ అయ్యాయి.

 

మ్యాచ్లో నమోదైన రికార్డులు...

రెండు జట్లు కలిపి చేసిన 517 పరుగులు (highest runs) ఒక అంతర్జాతీయ T20I మ్యాచ్లో అత్యధిక పరుగులు

రెండు జట్లు కలిసి బాదిన సిక్సర్లు 35. ఒక అంతర్జాతీయ T20I మ్యాచ్లో (highest sixers in one T20I match) ఇవే అత్యధిక సిక్సర్లు.

మొదటి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా (South Africa) 149 పరుగులు (first 10 overs 149) చేసి ప్రపంచరికార్డు నెలకొల్పింది