ఐపీఎల్ లో కొత్త నిబంధనలు : New rules in IPL

ధనాధన్ క్రికెట్, పొట్టి క్రికెట్ అని పిలువబడే ఐపీఎల్ T20 లీగ్ ను (IPL T20 league) మరింత రసవత్తరంగా సాగేలా టోర్నీలో ఎన్నో కొత్త కొత్త నిబంధనలు (new rules) అమలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 16 వ సీజన్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.

ఐపీఎల్ లో కొత్త నిబంధనలు : New rules in IPL

ఐపీఎల్ లో కొత్త నిబంధనలు : New rules in IPL

ధనాధన్ క్రికెట్, పొట్టి క్రికెట్ అని పిలువబడే ఐపీఎల్ T20 లీగ్ ను (IPL T20 league) మరింత రసవత్తరంగా సాగేలా టోర్నీలో ఎన్నో కొత్త కొత్త నిబంధనలు (new rules) అమలు చేస్తున్నారు. దీంతో ఏడాది జరగనున్న ఐపీఎల్ 16 సీజన్ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.

 

క్రికెట్ఆటలో నిబంధనలు (rules) ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. క్రీడాభిమానులకు మరింత ఆసక్తిని కల్పించేలా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఐసీసీ (ICC) నిర్వహణలో నడిచే టోర్నీలతో పాటుగా ఐపీఎల్ (IPL) వంటి లీగ్స్ లో సైతం మార్పులు జరుగుతున్నాయి. ఆయా దేశాలు నిర్వహించే లీగ్స్ (leagues) లో కీలకమైన నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. దీనివల్ల అభిమానులకు క్రికెట్ కనువిందు (entertainment) చేస్తోంది.

టాస్ తరువాత తుది జట్టు ప్రకటన : after toss can announce final team list 

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 16 సీజన్ ఐపీఎల్ లో సరికొత్త నిబంధన (rule) అమల్లోకి రానుంది. ఆయా ప్రాంచైజీలు టాస్ అనంతరం (after toss) తమ తుది జట్లను, ఇంపాక్ట్ ప్లేయర్ (impact player) పేరు, వివరాలను ప్రకటించే వెసులుబాటును బీసీసీఐ (BCCI) కల్పించింది. దీని వల్ల ఫ్రాంచైజీలు టాస్ గెలుపు, ఓటముల ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధన ఇంపాక్ట్ ప్లేయర్ ను ఎంచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది (very useful). గత 15 సీజన్ల వరకు ఆయా జట్ల కెప్టెన్లు టాస్ వేయడానికి ముందే తుది జట్టు వివరాలు, ఇంపాక్ట్ ప్లేయర్ వివరాలను ప్రకటించేవారు. దీని వల్ల ఒక్కోసారి జట్టు కూర్పు విషయంలో కొంత ఇబ్బంది ఉండేది. కొత్త నిబంధన (new rule) తమకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయా జట్ల కెప్టెన్లు (captains), ఫ్రాంచైజీలు (franchises) ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరికొత్తగా అమలు చేస్తున్న నిబంధనను ఇటీవల నిర్వహించిన దక్షిణాఫ్రికా T20 లీగ్ (South Africa T20 league) లో అమలు చేసారు.

పెనాల్టీగా 5 పరుగులు : 5 runs as penalty

నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో (IPL) మరిన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బౌలర్ తన ఓవర్ ను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయకుంటే ఓవర్ రేట్ పెనాల్టీ (over rate penalty) ఉంటుంది. ఓవర్ రేట్ పెనాల్టీ విధిస్తే 30 యార్డ్స్ (30 yards) సర్కిల్ బయట నాలుగు ఫీల్డర్లు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. అదేవిధంగా ఫీల్డర్ గానీ లేదా వికెట్ కీపర్ కావాలనే అటూ ఇటూ అనుమానాస్పదంగా కదిలితే సమయంలో బౌలర్ వేసే బంతిని డెడ్ బాల్ (dead ball) గా పరిగణించి ప్రత్యర్థి జట్టుకి 5 పరుగులు పెనాల్టీ (5 penalty runs) కింద ఇస్తారు. కొత్తగా అమలు చేసిన నిబంధనల వల్ల బ్యాటింగ్ జట్టుకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో వికెట్ కీపర్ (wicket keeper), ఇతర ఆటగాళ్లు ఎలా వ్యవహరించినా బ్యాటింగ్ చేసే జట్టుకి (batting team) ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు. కొత్త నిబంధన కారణంగా ఇకనుండి అదనంగా ఐదు పరుగులు (extra 5 runs) వచ్చే అవకాశం బ్యాటింగ్ చేసే జట్టుకు రానుంది. అంతే కాకుండా నిబంధన కారణంగా ఫీల్డింగ్ చేసే జట్టు కూడా మైదానంలో అప్రమతంగా ఉండేందుకు దోహద పడుతుందని భావిస్తున్నారు.

ఐపీఎల్ 2023 షెడ్యూల్ : 2023 IPL schedule

ఐపీఎల్ 16 సీజన్ (IPL 16th season) నెల 31 నుంచి మే 28 వరకు జరగనుంది. షెడ్యూల్ ను ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు సంబర పడుతున్నారు. మొత్తం 10 జట్లు (10 teams) ఐపీఎల్ లో పాల్గొంటున్నాయి. 10 జట్ల మధ్య లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది 15 సీజన్లో (15th season) పుణే, అహ్మదాబాద్, ముంబయి స్టేడియాల్లో మాత్రమే ఐపీఎల్ లీగ్ (IPL league) నిర్వహించారు. అయితే ఏడాది మాత్రం ప్రతి హోమ్ టీమ్ తమ సొంత మైదానంలో (home ground) జరగనున్నాయి. గత ఏడాది విజేత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans, defending champion GT) ఐపీఎల్ తొలి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అహ్మదాబాద్ వేదికపై ఆడనుంది. అదేవిధంగా ఏప్రిల్ 1 తేదీన మొహాలీలో పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్రైడర్స్ (KKR), అదేవిధంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSJ), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య డబుల్ హెడర్ మ్యాచ్లు (double header matches) జరగనున్నాయి. 70 లీగ్ మ్యాచ్లు మొత్తం 12 వేదికల్లో 52 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. మొత్తం 10 జట్లు తన సొంత మైదానంలో ఏడు మ్యాచ్లు, ప్రత్యర్థి జట్టు మైదానంలో ఏడు మ్యాచ్లు ఆడనున్నాయి.

అదేవిధంగా కరోనా కారణంగా మూడు సంవత్సరాలపాటు హైదరాబాద్లో (due to corona 3 years no matches in Hyderabad) ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండడంతో ఈసారి ఇక్కడి సొంత మైదానంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. దీంతో సీజన్లో హైదరాబాద్లో మొత్తం ఏడు మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (RR) తో తలపడనుంది. రెండవ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో (PBKS) ఆడుతుంది. అదేవిధంగా పంజాబ్, రాజస్థాన్ జట్లు రెండు వేదికల్లో ఆడనున్నాయి. రాజస్థాన్ సొంత మైదానంలో జరిగే ఏడు మ్యాచ్ల్లో మొదటి రెండు మ్యాచ్లను గువాహటి (Guwahati) వేదికగా ఆడనుంది. మిగిలిన ఐదు మ్యాచ్లు జైపూర్ లో (Jaipur) ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ జట్టు తమ మొదటి ఐదు మ్యాచ్లు మొహలీలోనూ, చివరి రెండు మ్యాచ్లు ధర్మశాలలో (Dharamshala) ఆడనుంది. బీసీసీఐ (BCCI) ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్ షెడ్యూల్ (league schedule) మాత్రమే విడుదల చేసింది. ప్లేఆఫ్స్ షెడ్యూల్ (playoffs schedule) తరువాత విడుదల చేయనుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో మే 28 జరగనుంది.