వన్డే క్రికెట్ ప్రపంచకప్ విజేతల జాబితా : ODI World Cup Winners

ప్రపంచ కప్... ఏ ఆటలోనైనా ప్రపంచ కప్ ను గెలవాలని ఆటగాళ్లతో పాటూ అభిమానులూ కోరుకుంటుంటారు. ఇక క్రికెట్ అయితే ఆ కోరికకు అంతే ఉండదు.

వన్డే క్రికెట్ ప్రపంచకప్ విజేతల జాబితా : ODI World Cup Winners

వన్డే క్రికెట్ ప్రపంచకప్ విజేతల జాబితా : ODI World Cup Winners

 

ప్రపంచ కప్... ఆటలోనైనా ప్రపంచ కప్ ను గెలవాలని ఆటగాళ్లతో పాటూ అభిమానులూ కోరుకుంటుంటారు. ఇక క్రికెట్ అయితే కోరికకు అంతే ఉండదు.

 

ప్రపంచ కప్... ప్రతి ఒక్కరి కల...

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. తమ అభిమాన జట్టు ఆడుతోందంటే దానికోసం ఎన్ని పనులున్నా మానుకుని మ్యాచ్ ను వీక్షించే వాళ్ళూ ఉన్నారు. 1975 లో మొదలైన వన్డే క్రికెట్ ప్రపంచ కప్ నాలుగేళ్లకోసారి కోట్లాది అభిమానులను అలరిస్తోంది. ఏడాది 2023 లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నీ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

 

మొట్టమొదటి ప్రపంచ కప్ టోర్నమెంట్ ఇంగ్లాండ్ లో నిర్వహించారు. కప్ 1975 లో ప్రారంభించినప్పుడు 60 ఓవర్ల పాటు ఆడేవారు. అనంతరం 1987 ప్రపంచ కప్ నుంచి 50 ఓవర్లకు కుదించారు. మొదటిసారిగా 1987 లో భారత్, పాకిస్థాన్ దేశాల్లో టోర్నమెంట్ నిర్వహించారు.

 

మొదటి ప్రపంచ కప్ ప్రారంభించిన 1975 లో వెస్టిండీస్ జట్టు ట్రోఫీ గెలుచుకుంది. తిరిగి 1979 లో దీనిని నిలబెట్టుకుంది. 1983, 2011 లో నిర్వహించిన ప్రపంచ కప్ ను భారత్ గెలుపొందింది. ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలుచుకుని విజయవంతమైన జట్టుగా ఘనత వహించింది. పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి గెలుపొందాయి. క్రికెట్ కి పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ 4 సార్లు ఫైనల్ కి చేరితే ప్రపంచ కప్ గెలవాలన్న కోరికను చివరిగా నిర్వహించిన 2019 ప్రపంచ కప్ ను గెలుచుకుని ఊరట చెందింది. ఇప్పటివరకు జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ విజేతల వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే...

 

1. వెస్టిండీస్ (1975)

ఇంగ్లాండ్ లో 1975 లో నిర్వహించిన మొట్టమొదటి ప్రుడెన్షియల్ ప్రపంచ కప్ ను వెస్టిండీస్ జట్టు గెలుచుకుంది. మొదటి ప్రపంచ కప్ ను 8 జట్లతో టోర్నమెంట్ నిర్వహించారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఫైనల్లో తలపడ్డాయి. మొదటిగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు (291/8) చేసింది. సమాధానంగా ఆస్ట్రేలియా 274 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో గెలుపొంది సగర్వంగా కప్ ను అందుకుంది.

 

విండీస్ జట్టులోని క్లయివ్ లాయిడ్ ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. మొదట బ్యాటింగ్ లో 85 బంతుల్లో 102 పరుగులను చేసాడు. బౌలింగ్ లోనూ రాణించి ఒక వికెట్ తీసాడు. లాయిడ్ తో పాటు రోహన్ కన్హాయి 55 పరుగులను సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోయింది. ఇయన్ చాపెల్ 65 పరుగులు, అలాన్ టర్నర్ 40 పరుగులు చేసారు. విండీస్ జట్టు విజయంలో ఫీల్డింగ్ ప్రధాన పాత్ర పోషించింది. మ్యాచ్ లో ఏకంగా 5 రన్ ఔట్లు అవడం గమనార్హం. క్లయివ్ లాయిడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

 

2. వెస్టిండీస్ (1979)

లార్డ్స్ మైదానంలో 1979 లో జరిగిన రెండో ప్రపంచ కప్ ఫైనల్ లో కూడా వెస్టిండీస్ జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్, విండీస్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 60 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు (286-9) చేసింది. విండీస్ కి చెందిన వివియన్ రిచర్డ్స్ సెంచరీతో కదం తొక్కాడు. రిచర్డ్స్ 138 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. సీఎల్ కింగ్ 86 పరుగులు చేసాడు. అయితే జట్టులో ముగ్గురు బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు.

 

భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలో గట్టిగానే పోరాడింది. ఓపెనర్లలో జేఎం బ్రేర్లీ 64, బాయికాట్ 57 పరుగులు చేశారు. అయితే విండీస్ బౌలర్లు క్రమం తప్పక వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ కి ఓటమి తప్పలేదు. ఏకంగా ఐదుమంది బ్యాట్స్మెన్లు డకౌట్ అవడంతో ఇంగ్లాండ్ 194 పరుగులకు అన్ని వికెట్లను కోల్పోయి 92 పరుగుల తేడాతో ఓటమి చెందింది. విండీస్ బౌలర్ గార్నర్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా వివియన్ రిచర్డ్స్ నిలిచాడు.

 

3. భారత్ (1983)

మూడవ ప్రపంచ కప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ కి చేరుకొని సంచలనం సృష్టించింది. మూడవసారి కూడా ఫైనల్ కి చేరిన విండీస్ జట్టును ఓడించి కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమ్ సగర్వంగా కప్ ను ఎత్తుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లకే 183 పరుగులకు ఆల్ అవుట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 140 పరుగులకే కుప్పకూలడంతో 42 పరుగుల తేడాతో భారత్ గెలుపొందిందిస్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. జట్టులోని ఆరుగురు బ్యాట్స్మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందుగా భారత్ ఫైనల్ కి చేరిందంటే దానికి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ విజయమే కారణం. మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓపెనర్లు గవాస్కర్, శ్రీకాంత్ డకౌట్ అయ్యారు. అమర్నాథ్ (5), సందీప్ పాటిల్ (1), యశ్పాల్ శర్మ (9) పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 17 పరుగులకే భారత్ సగం వికెట్లు చేజార్చుకుంది. అప్పుడు బరిలోకి వచ్చిన కపిల్ దేవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 138 బంతుల్లోనే 16 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో విరుచుకుపడి 175 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. ఇప్పటికీ మ్యాచ్ అన్ని ప్రపంచ కప్ టోర్నీలలో అత్యుత్తమమైనదిగా నిలిచింది. మ్యాచ్ తో భారత్ ఫైనల్ మార్గం సుగమం చేసుకుంది.

 

4. ఆస్ట్రేలియా (1987)

ఇండియా, పాకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన రిలయన్స్ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్ జట్టులు ఫైనల్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా మొదటిసారిగా టైటిల్ గెలుపొందిందితొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 253 పరుగులు (253–5) చేసింది. ఆసీస్ జట్టులోని డేవిడ్ బూన్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మైక్ వెలెట్టా సుడిగాలిలా 31 బంతుల్లో 45 పరుగులు చేసాడు.

 

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు (246/8) మాత్రమే చేసి 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చెందింది. బిల్ అథెయ్ (58), అలెన్ లాంబ్ (45)  మైక్  గాటింగ్ (41), గ్రాహం గూచ్ (35) పరుగులు చేసారు. బిల్ రన్ అవుట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది.

 

5. పాకిస్తాన్ (1992)

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ నిర్వహించిన ఐదవ ప్రపంచ కప్ (బెన్సన్ అండ్ హెడ్జెస్) లో పాకిస్థాన్ జట్టు మొదటిసారి విజేతగా నిలించింది. ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో తలపడిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్లు కోల్పోయి 249 పరుగులు (249/6) చేసింది. జట్టులోని ఇమ్రాన్ ఖాన్ (72), జావేద్ మియాందాద్ (58), ఇంజమామ్-ఉల్-హక్ (42), వసీం అక్రమ్ (33) పరుగులు చేసారు.

 

స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ పరాజయం పాలయింది. నీల్ ఫెయిర్ బ్రదర్ (62), అలెన్ లాంబ్ (31), గ్రాహం గూచ్ (29) పరుగులు చేసారు. ఇంగ్లాండ్ జట్టు 49.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ బౌలర్లలో వసీం అక్రమ్, ముస్తాక్ అహ్మద్ చెరో మూడు, ఆఖిబ్ జావేద్ రెండు వికెట్లు పడగొట్టారు.

 

6. శ్రీలంక (1996)

ఇండియా-పాకిస్థాన్ రెండోసారి ఆతిథ్యం ఇచ్చిన టోర్నమెంట్లో ఫైనల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. శ్రీలంక విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు (241/7) చేసింది. మార్క్ టేలర్ (74) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లలో రికీ పాంటింగ్ (45), మైఖేల్ బేవాన్ (36) పరుగులు చేసారు. శ్రీలంక బౌలర్లలో అరవింద డిసిల్వా 3 వికెలు తీసాడు.

 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 245 పరుగులు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. బౌలింగ్ లో రాణించి 3 వికెట్లు తీసిన డిసిల్వా తన అద్భుతమైన బ్యాటింగ్ తో 107 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. డిసిల్వాకు తోడుగా అసంక గురుసిన్హా (65), అర్జున రణతుంగ (47) పరుగులు చేసారు. సిరీస్ మొత్తం అద్భుతంగా రాణించిన సనత్ జయసూరియ (221 పరుగులు, 7 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.

 

7. ఆస్ట్రేలియా (1999)

ఇంగ్లాండ్ 7 ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. స్వల్ప స్కోర్ నమోదు చేసిన పాకిస్థాన్ ను ఓడించిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ప్రపంచ కప్ ని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 39 ఓవర్లలో మొత్తం వికెట్లను కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్ ను దెబ్బతీశాడు. పాకిస్తాన్ జట్టులో 5 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

 

స్వల్ప స్కోర్ ను ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది. ఆడమ్ గిల్క్రిస్ట్ (54), మార్క్ వా (37), రికీ పాంటింగ్ (24) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. పాకిస్థాన్ బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయాన్ని సాధించింది.

 

8. ఆస్ట్రేలియా (2003)

దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 359 పరుగులు (359/2) చేసింది. మ్యాచ్ లో రికీ పాంటింగ్ (140 నాటవుట్), ఆడమ్ గిల్క్రిస్ట్ (57), మాథ్యూ హేడెన్ (37) పరుగులు చేసారు. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీసాడు.

 

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ లో విఫలమై 39.2 ఓవర్లలో 234 పరుగులకే ఆల్ అవుట్ అయింది. జట్టులోని 5 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్ (82), రాహుల్ ద్రావిడ్ (47) పరుగులు చేసారు. మెక్గ్రాత్ 3 వికెట్లు తీసి రాణించాడు.

 

9. ఆస్ట్రేలియా (2007)

వెస్టిండీస్ లో జరిగిన 9 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడోసారి ఫైనల్ కి ప్రవేశించింది. శ్రీలంకతో ఫైనల్లో తలపడిన ఆసీస్ జట్టు ట్రోఫీని గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 38 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు (281/4) చేసింది. గిల్క్రిస్ట్ సెంచరీ (149)తో చెలరేగాడు. హేడెన్ (38), పాంటింగ్ 37, సైమండ్స్ 23 పరుగులతో రాణించారు. మలింగా రెండు వికెట్లు పడగొట్టాడు.

 

డక్ వర్త్ లూయిస్ ప్రకారం 36 ఓవర్లలో 269 పరుగులు లక్ష్యం కాగా శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 215 పరుగులు (215/8) మాత్రమే చేసి ఓటమి చెందింది. సనత్ జయసూరియ (63), సంగక్కర (54) పరుగులతో రాణించిన మిగతా బ్యాట్స్ మెన్లు రాణించక పోవడంతో ఓటమి పాలయింది. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు రాక పోవడంతో పాటు క్రమం తప్పకుండ వికెట్లు కోల్పోయి ట్రోఫీని చేజార్చుకుంది.

 

10. భారత్ (2011)

రెండోసారి ప్రపంచ కప్ సాధించాలన్న 28 సంవత్సరాల నిరీక్షణకు కెప్టెన్ గా చేసిన మహేంద్ర సింగ్ ధోనీ తెరదించాడు. భారత్-బాంగ్లాదేశ్ లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్లు నష్టపోయి 274 పరుగులు (274–6) చేసింది. మహిళా జయవర్ధనే (103) సెంచరీ చేసాడు. సంగక్కర 48, తిలకరత్నే దిల్షాన్ 33 పరుగులతో రాణించారు. యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు.

 

అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ డకౌట్ గా వెనుదిరిగాడు. సచిన్ 18 పరుగులకే అవుట్. గౌతమ్ గంభీర్ (97), విరాట్ కోహ్లీ (35) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. బరిలోకి బ్యాటింగ్ కి దిగిన కెప్టెన్ ధోని (79 బంతుల్లో 91 పరుగులు)సుడిగాలి ఇన్నింగ్స్ తో కోట్లాది మంది కళ్ళల్లో వెలుగులు నింపాడు. 28 ఏళ్ళ అభిమానుల ఆశల్ని నెరవేర్చి చరిత్రలో నిలిచిపోయాడు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ గా ధోని, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా యువరాజ్ సింగ్ (362 పరుగులు, 15 వికెట్లు) నిలిచారు.

 

11. ఆస్ట్రేలియా (2015)

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఆతిథ్యం ఇచ్చిన 11 ప్రపంచ కప్ లో ఆతిథ్య జట్లు రెండూ ఫైనల్ కి చేరాయి. ఇందులో ఆసీస్ నే విజయం వరించింది. దీంతో 5 సారి ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. తక్కువ స్కోర్లు నమోదైన ఫైనల్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 45 ఓవర్లలో 183 పరుగులకు మొత్తం వికెట్లు కోల్పోయింది. నలుగురు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. మిచెల్ జాన్సన్, జేమ్స్ ఫాల్కనర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

 

బదులుగా ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు (186/3) చేసింది. మైఖేల్ క్లార్క్ 74, స్టీవెన్ స్మిత్ 56, డేవిడ్ వార్నర్ 45 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చి చరిత్ర రచించారు.

 

12. ఇంగ్లాండ్ (2019)

ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 12 ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు నాటకీయ రీతిలో గెలుపొందింది. ఇరుజట్లూ నిర్ణీత ఓవర్లలో 241 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. నిర్ణయాత్మక సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టుని నిర్ణయించి ఇంగ్లాండ్ ని విజేతగా ప్రకటించారు. న్యూజిలాండ్ ని దురదృష్టం వెన్నాడింది.

 

ప్రపంచ కప్ అందుకోవాలన్న న్యూజిలాండ్ ఆశలు అడియాసలయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్లను 241 పరుగులు (241) చేసింది. హెన్రీ నికోలస్ 55 పరుగులు చేసాడు. వోక్స్, ప్లంకెట్ 3 వికెట్లు చొప్పున పడగొట్టారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ సరిగ్గా 241 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బెన్ స్టోక్స్ 84, జాన్ బట్లర్ 59 పరుగులతో రాణించారు. ఫెర్గుసన్, జేమ్స్ నీషం మూడేసి వికెట్ల చొప్పున తీశారు.

 

ఏడాది 2023 లో 13 ప్రపంచ కప్ టోర్నమెంట్ జరగనుంది. భారత్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికోసం అన్ని జట్లూ ఇపటినుంచే సన్నద్ధమవుతున్నాయి. అందుకు కొన్ని టోర్నమెంట్లను కూడా ఆడడం మొదలుపెట్టాయి. ఆయా దేశాల క్రికెట్ అభిమానులు అందరూ తమ జట్లు గెలవాలంటే తమ జట్లు గెలవాలని కోరుకుంటారు. సగటు భారత అభిమానులు కూడా 13 ఏళ్ళ తమ నిరీక్షణకు తెరదించి భారత్ ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నారు.