అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ : Fastest 50's in T20I

ప్రతి బంతినీ బౌండరీని దాటించే బ్యాట్స్‌మెన్లకు టీ20 లు వేదికగా నిలుస్తున్నాయి. బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ మెరుపులు, బౌండరీల హోరు వెరసి టీ20 క్రికెట్.

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ : Fastest 50's in T20I

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ : Fastest 50's in T20I

ప్రతి బంతినీ బౌండరీని దాటించే బ్యాట్స్మెన్లకు టీ20 లు వేదికగా నిలుస్తున్నాయి. బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ మెరుపులు, బౌండరీల హోరు వెరసి టీ20 క్రికెట్.

 

బౌండరీల జోరు... సిక్సర్ల హోరు...

పొట్టి క్రికెట్ గా పిలవబడే టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో అతివేగంగా 50 పరుగులను చేసిన రికార్డు భారత దేశానికి చెందిన యువరాజ్ సింగ్ పేరు మీద ఉంది. రికార్డును ఇప్పటివరకూ ఎవ్వరూ బద్దలు కొట్టలేదు. రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. కేవలం 12 బంతుల్లోనే పరుగులను సాధించి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్ గా కూడా చరిత్రకెక్కాడు. అతి తక్కువ బంతుల్లో వేగంగా 50 పరుగులు రాబట్టిన కొందరు బ్యాట్స్మెన్లను పరిశీలిద్దాం.

1. యువరాజ్ సింగ్ (12)

భారత క్రికెటర్లలో ఆల్ రౌండర్ గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్ తన మెరుపు బ్యాటింగ్ తో భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. 2007 సెప్టెంబర్ 19 ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులను సాధించి తన పేరిట ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద 16 బంతులను ఎదుర్కొని 58 పరుగులు చేసాడు.

 

యువరాజ్ బ్యాటింగ్ గణాంకాలు

తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ భారత్ కు విజయాలను అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో మొత్తం టోర్నమెంట్లో 362 పరుగులు, 15 వికెట్లు తీసి ఉత్తమ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో 6 బంతులను 6 సిక్సర్లుగా మలిచిన మొట్టమొదటి క్రికెటర్ గా నిలిచాడు. 40 టెస్టుల్లో 62 ఇన్నింగ్స్ ఆడి 1900 పరుగులు చేసాడు. 9 వికెట్లు కూడా తీసాడు. 304 వన్డేల్లో 278 ఇన్నింగ్స్ ఆడి 8701 పరుగులు చేయడమే కాకుండా 111 వికెట్లు కూడా తీసాడు. 51 అంతర్జాతీయ టీ 20 ల్లో 1177 పరుగులు చేసాడు.

యువరాజ్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

2. మీర్జా ఎహసాన్ (14)

ఆస్ట్రియాకి చెందిన మీర్జా ఎహసాన్ లక్సెంబర్గ్ తో 2019 ఆగస్టు 31 జరిగిన మ్యాచ్ లో 13 బంతులను ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో రెండు ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద 14 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేసాడు.

 

ఎహసాన్ బ్యాటింగ్ గణాంకాలు

మీర్జా ఎహసాన్ ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో ఆడుతున్న ఎహసాన్ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్. అంతర్జాతీయ టీ20ల్లో 21 మ్యాచుల్లో 18 ఇన్నింగ్స్ ఆడి 386 పరుగులు చేసాడు. అత్యధిక స్కోరు 69 పరుగులు. 4 అర్ధ సెంచరీలు చేసాడు. ఎహసాన్ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ 183.81 గా ఉంది.

ఎహసాన్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

3. రమేష్ సతీశన్ (14)

రొమేనియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సతీశన్ సెర్బియాతో 2021 జూన్ 26 జరిగిన మ్యాచులో 14 బంతుల్లోనే 50 పరుగులను సాధించాడు. ఇందులో 6 బౌండరీలు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద 15 బంతులను ఎదుర్కొని 56 పరుగులు చేసాడు.

సతీశన్ బ్యాటింగ్ గణాంకాలు

 

సతీశన్ రొమేనియా టీమ్ లో మంచి ఆల్ రౌండర్. ఇప్పటివరకు 28 అంతర్జాతీయ టీ20ల్లో 26 ఇన్నింగ్స్ ఆడిన సతీశన్ 863 పరుగులు చేసాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 92 పరుగులు అతని అత్యధిక స్కోర్. 166.60 స్ట్రయిక్ రేట్. 15 ఇన్నింగ్స్ లో 14 వికెట్లు తీసాడు. 3/14 సతీశన్ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

సతీశన్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

4. కొలిన్ మున్రో (14)

న్యూజిలాండ్ కు చెందిన మున్రో 2016 జనవరి 10 శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 14 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫోరు, 7 సిక్సర్లు ఉన్నాయి.

కొలిన్ బ్యాటింగ్ గణాంకాలు

దక్షిణాఫ్రికాలో జన్మించిన మున్రో న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాట్స్మెన్ గా పేరొందాడు. అందుకే జట్టులో టాప్ ఆర్డర్లో తన స్థానాన్ని స్థిరపరచుకున్నాడు. 57 వన్డేల్లో 53 ఇన్నింగ్స్ ఆడిన మున్రో 1271 పరుగులు చేసాడు. ఇందులో 8 అర్ధ సెంచరీలు వున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 62 ఇన్నింగ్స్ ఆడి 1724 పరుగులు చేసాడు. ఇందులో 3 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 109 పరుగులు.

కొలిన్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

5. ఫైసల్ ఖాన్ (15)

సౌదీ అరేబియాకు చెందిన ఫైసల్ కువైట్ తో 2019 జనవరి 24 జరిగిన మ్యాచులో 15 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు. ఇందులో 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద మ్యాచులో 28 బంతులను ఎదుర్కొని 83 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు.

 

ఫైసల్ బ్యాటింగ్ గణాంకాలు

సౌదీ అరేబియా టీమ్ కి ఆడుతున్న ఫైసల్ టీ20 స్పెషలిస్ట్ గా పేరొందాడు. ఇప్పటివరకు 18 టీ20 లు ఆడిన ఫైసల్ 443 పరుగులు చేసాడు. రెండుసార్లు నాటవుట్ గా నిలిచాడు. అత్యధిక స్కోర్ 83 నాటవుట్. 50 ఫోర్లు, 27 సిక్సులు బాదాడు. స్ట్రయిక్ రేట్ 179.35 గా ఉంది.మీడియం పేస్ బౌలింగ్ కూడా చేసి 4 వికెట్లు తీసాడు.

ఫైసల్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

6. ఎస్.డి హోప్ (16)

బాంగ్లాదేశ్ తో 2018 డిసెంబర్ 17 జరిగిన మ్యాచులో వెస్టిండీస్ జట్టుకి చెందిన హోప్ 16 బంతుల్లో 50 పరుగులు చేసాడు. ఇందులో మూడు ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ లో 23 బంతులు ఎదుర్కొని 55 పరుగులను సాధించాడు.

హోప్ బ్యాటింగ్ గణాంకాలు

హోప్ 21 సంవత్సరాల వయస్సులో వెస్టిండీస్ టెస్టు టీమ్ లోకి అడుగుపెట్టాడు. అప్పటివరకు కేవలం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 38 టెస్టుల్లో 72 ఇన్నింగ్స్ ఆడిన హోప్ 1726 పరుగులు చేసాడు. 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 104 వన్డేల్లో 99 ఇన్నింగ్స్ ఆడి 4308 పరుగులు చేసాడు. ఇందులో 13 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 19 అంతర్జాతీయ టీ20ల్లో 17 ఇనింగ్స్ ఆడి 304 పరుగులు చేసాడు. రెండు అర్ధ సెంచరీలు కూడా చేసాడు.

హోప్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

7. మొయిన్ అలీ (16)

ఇంగ్లాండ్ కి చెందిన మొయిన్ అలీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 16 బంతుల్లోనే అర్ధ శతకం చేసాడు. ఇందులో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద మ్యాచ్ లో 18 బంతులను ఎదుర్కొని 52 పరుగులు చేసాడు.

మొయిన్ బ్యాటింగ్ గణాంకాలు

మంచి ఆల్ రౌండర్ అయిన మొయిన్ ఇంగ్లాండ్ జట్టుకి మరపురాని విజయాలను అందించాడు. టెస్టుల్లో 3000 పరుగులు, 200 వికెట్లు తీసిన మొయిన్ ఇంగ్లాండ్ మూడవ స్పిన్నర్ గా ఖ్యాతి గడించాడు. టెస్టులు, వన్డేలు, టీ20 మూడు ఫార్మాట్లోనూ ఆడాడు. 64 టెస్టుల్లో 111 ఇన్నింగ్స్ ఆడి 2914 పరుగులు చేసి, 195 వికెట్లు తీసాడు. అత్యధిక స్కోర్ 155 పరుగులు. 5 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు సాధించాడు. 123 వన్డేల్లో 97 ఇన్నింగ్స్ ఆడిన మొయిన్ 2051 పరుగులు చేసి 95 వికెట్లు తీసాడు. 128 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్. 71 అంతర్జాతీయ టీ20ల్లో 61 ఇన్నింగ్స్ లో ఆడి చేసిన 1044 పరుగుల్లో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 40 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

మొయిన్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్ 

8. మార్టిన్ అకాయెజు (16)

రువాండాకు చెందిన అకాయెజు ఘనాతో 2021 ఆగష్టు 18 జరిగిన మ్యాచ్ లో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద 19 బంతుల్లో 51 పరుగులు చేసాడు.

అకాయెజు బ్యాటింగ్ గణాంకాలు

రువాండా జట్టు తరపున ఆడుతున్న అకాయెజు అల్ రౌండర్. అటు బ్యాట్ తోనూ, ఇటు బాల్ తోనూ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 31 టీ20ల్లో 26 ఇన్నింగ్స్ ఆడిన అకాయెజు 208 పరుగులు చేసాడు. ఇందులో 51 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్. 23 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసి 29 వికెట్లు పడగొట్టాడు. 4/9 అకాయెజు ఉత్తమ బౌలింగ్ గణాంకాలు.

అకాయెజు 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

9. లియామ్ లివింగ్స్టన్ (17)

ఇంగ్లాండ్ జట్టుకి ఆడుతున్న లివింగ్స్టన్ 2021 జూలై 17 పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 17 బంతుల్లోనే 50 పరుగులను చేసాడు. ఇందులో 6 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తమ్మీద లివింగ్స్టన్ మ్యాచ్ లో 43 బంతులను ఎదుర్కొని 103 పరుగులను సాధించాడు.

లివింగ్స్టన్ బ్యాటింగ్ గణాంకాలు

ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినా తనదైన ముద్ర వేసాడు లివింగ్స్టన్. ఆల్ రౌండర్ గా జట్టుకు సేవలందిస్తున్నాడు. కేవలం ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడి రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 16 పరుగులే చేసాడు. 12 వన్డేల్లో 10 ఇన్నింగ్స్ ఆడి 250 పరుగులు చేసాడు. 66 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్. 29 అంతర్జాతీయ టీ20ల్లో 423 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 6 వికెట్లు, టీ20ల్లో 15 వికెట్లు తీసాడు.

లివింగ్స్టన్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్

10. టిమ్ డేవిడ్ (17)

సింగపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్ 2020 మార్చి మూడున మలేషియాతో జరిగిన మ్యాచ్ లో 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇందులో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ లో 32 బంతులను ఎదుర్కొన్న డేవిడ్ 92 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు.

 

డేవిడ్ బ్యాటింగ్ గణాంకాలు

ఆస్ట్రేలియాకి చెందిన డేవిడ్ సింగపూర్ జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. 2022 లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ లో తమ జట్టు తరపున ఆడేందుకు రూ.8.25 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ లో తానూ ఎదుర్కొన్న 86 బంతుల్లో 16 బంతులను సిక్సర్లుగా మలిచాడు. 25 టీ20ల్లో 23 ఇన్నింగ్స్ ఆడి 740 పరుగులు చేసాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యకిగత స్కోర్ 92 పరుగులు. 64 ఫోర్లు, 36 సిక్సులు బాదాడు.

డేవిడ్ 'ఫిఫ్టీవీడియో హైలైట్స్