నేడు ఐపీఎల్ లో రెండు ధమాకా మ్యాచ్‌లు : Today will played 2 matches in IPL

నేడు ఐపీఎల్ లో రెండు ధమాకా మ్యాచ్‌లు : Today will played 2 matches in IPL

నేడు ఐపీఎల్ లో రెండు ధమాకా మ్యాచ్‌లు : Today will played 2 matches in IPL

క్యాష్ రిచ్ లీగ్ గా పిలవబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు రెండు ధమాకా మ్యాచ్‌లు జరగనున్నాయి. గత ఏడాది 15 వ సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఈ 16 వ ఐపీఎల్ సీజన్ లో టాప్ లో ఉన్న టీమ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

ఢీ అంటే ఢీ : face to face 

లక్నో, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. గత ఏడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టీమ్ తలపడనుంది. ఈ రెండు జట్లూ గత ఏడాది 15 వ ఐపీఎల్ సాజంలోనే ఆరంగ్రేటం చేయడం గమనార్హం. అయితే రెండు జట్లూ తలపడిన రెండు మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ దే పై చేయి కావడం గమనార్హం. అయితే పొట్టి క్రికెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ 16 వ ఐపీఎల్ (16th IPL season) సీజన్లో మాత్రం లక్నో జట్టు మంచి ఆట తీరును కనబరుస్తోంది. అందుకు నిదర్శనంగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో లక్నో నిలిచింది. టీమ్ సమిష్టి కృషికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే అన్ని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుండడంతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

లక్నో టీమ్ పరిస్థితి చూస్తే... : Lucknow team review ...

ఐపీఎల్ 16 వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే పాయింట్ల పట్టకలో రెండో స్థానంలో ఈ టీమ్ నిల్చింది. తన ఆఖరి మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను 10 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత లక్నో జట్టు తక్కువ స్కోర్ 154 పరుగులు చేసినప్పటికీ రాయల్స్ జట్టును 144 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది.  కైల్ మేయర్స్ ఈ ఐపీఎల్ 16 వ సీజన్‌లో తన మూడో అర్ధ సెంచరీని సాధించి లక్నో సూపర్ జెయింట్స్ కు మంచికి బూస్టింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు. 

ముంబై vs పంజాబ్ : MI vs PBKS 

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంటే అందరికీ పండగే. ఎందుకంటే ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ సీజన్లలో 29 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో ముంబై టీమ్ 15 మ్యాచ్‌లు గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ జట్టు 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. దీంతో హెడ్ టు హెడ్ విషయంలో రెండు జట్లదీ చేరి సగమే అని చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో రెండు జట్లూ ఎలా ఆడతాయో అందేది వేచి చూడాల్సిందే. 

లక్నో సూపర్ జెయింట్స్ తుది XI అంచనా : LSG probable XI prediction 

KL రాహుల్ (కెప్టెన్), MP స్టోయినిస్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, KH పాండ్యా, A బదోని, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యుధ్వీర్ సింగ్

లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్ : LSG full squad 

కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), నవీన్ ఉల్ హక్, ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, కరణ్ శర్మ, యుధ్వీర్ చరక్, యశ్ ఠాకూర్, రొమారియో షెపర్డ్, మార్క్ వుడ్, స్వప్నిల్ సింగ్, మనన్ వోహ్రా, డేనియల్ సామ్స్, ప్రేరక్ మన్కడ్, కృష్ణప్ప గౌతం, జయదేవ్ ఉనద్కత్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్

గుజరాత్ టైటాన్స్ తుది XI అంచనా : GT probable XI prediction 

శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాయి సుదర్శన్, ఎ మనోహర్, డిఎ మిల్లర్,రాహుల్ తెవాటియా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, ఎం షమీ, అల్జారీ జోసెఫ్, ఎంఎం శర్మ

గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్ : GT full squad 

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శ్రీకర్ భరత్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, ఉర్విల్ పటేల్, రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ సాయి కిషోర్, సాయి సుదర్శన్, ప్రదీప్ సాంగ్వాన్, దసున్ షనక, విజయ్ శంకర్, మోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఒడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, మాథ్యూ వేడ్, జయంత్ యాదవ్, యశ్ దయాల్

ముంబై ఇండియన్స్ తుది XI అంచనా : MI probable XI prediction 

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

పంజాబ్ కింగ్స్ తుది XI అంచనా : PBKSI probable XI prediction 

అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్