సెంచరీలతో తిరిగి ఫామ్ : Back to form with centuries

స్పిన్నర్... ఫాస్ట్ బౌలర్... బౌలర్ ఎలాంటి వారైనా సరే వాళ్ళు బ్యాట్ ఝుళిపిస్తే స్టాండ్స్ (stands) లోకి వెళ్లి పడాల్సిందే. క్రీజ్ (crease)లో కి వస్తూనే తమ బ్యాట్ కి పని చెప్పి బౌలర్లను ఉతికారేసేవారు. వాళ్లకు చుక్కలు చూపించేవారు.

సెంచరీలతో తిరిగి ఫామ్ : Back to form with centuries

సెంచరీలతో తిరిగి ఫామ్ : Back to form with centuries

స్పిన్నర్... ఫాస్ట్ బౌలర్... బౌలర్ ఎలాంటి వారైనా సరే వాళ్ళు బ్యాట్ ఝుళిపిస్తే స్టాండ్స్ (stands) లోకి వెళ్లి పడాల్సిందే. క్రీజ్ (crease)లో కి వస్తూనే తమ బ్యాట్ కి పని చెప్పి బౌలర్లను ఉతికారేసేవారు. వాళ్లకు చుక్కలు చూపించేవారు.

 

సెంచరీలు బాదారుఫామ్లోకి వచ్చారు : Scored centuries... came back in form

స్పిన్నర్... ఫాస్ట్ బౌలర్... బౌలర్ (bowler) ఎలాంటి వారైనా సరే వాళ్ళు బ్యాట్ ఝుళిపిస్తే స్టాండ్స్ లోకి వెళ్లి పడాల్సిందే. క్రీజ్ లోకి వస్తూనే తమ బ్యాట్ కి పని చెప్పి బౌలర్లను ఉతికారేసేవారు. వాళ్లకు చుక్కలు (stars) చూపించేవారు. బౌలింగ్ చేయాలంటే భయం పుట్టేలా చేసారు. అంతటి దిగ్గజ బ్యాట్స్మెన్లకు (batsman) సైతం చీకటి రోజులు వచ్చాయి. తమ సెంచరీలతో రికార్డులు (centuries) సృష్టించి, బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చిన బ్యాటర్లు కొన్నాళ్లపాటు చీకటి రోజులు గడిపారు. సెంచరీలు చేయలేక, ఫామ్ కోల్పోయి (lost the form) అన్ని వైపుల నుంచీ విమర్శలను ఎదుర్కొన్నారు. ఒక్క సెంచరీ కోసం సంవత్సరాల తరబడి వేచి చూశారు. చివరికి తామేంటో, తమ విలువేంటో అందరికీ చూపించారు.

సంవత్సరాల పాటు (many years) తమ పరుగుల దాహం కోసం అలమటించారు. కొన్నిసార్లు జట్టులో కూడా స్థానం కోల్పోయారు. అయినా సరే నిరాశ చెందకుండా కఠోర శ్రమ చేసారు. తిరిగి జట్టులోకి ప్రవేశించి, తాము ఎంతటి విలువైన వాళ్ళమో బ్యాట్ కి పదును చెప్పి చూపించారు. విమర్శకుల (critics) నోళ్లు మూయించారు. పడి లేచిన కెరటంలా ఎగిసిపడి మునుపటి ఫామ్ ని అందుకుని మరిన్ని రికార్డులు (records) సృష్టించారు. ఎక్కడ పోగొట్టుకున్నారో పోయిన చోటే వెతుక్కున్నారు. అటువంటి క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి గురించి ఒకసారి తెలుసుకుందాం.

 

1020 రోజుల తరువాత సెంచరీ : After 1020 days Kohli done century 

ఫిట్నెస్ పై శ్రద్ధ వహించే రన్ మెషిన్ గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా పరుగుల కోసం తపించాడు. క్రీజ్ లోకి వస్తే పరుగుల వరద పారించే కోహ్లీ ఫామ్ కోల్పోయి పరుగులు (runs) చేయడానికి తంటాలు పడ్డాడు. చాలా సంవత్సరాల (many years) పాటు పరుగులు చేయలేకపోయాడు. తన బ్యాట్ లో పదును తగ్గింది. జట్టులో స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు (questions) కూడా ఎదురయ్యాయి. విమర్శకులు (critics) సైతం కోహ్లీ పని అయిపొయింది, ఇక క్రికెట్ కు టాటా (bye bye) చెప్పడం మేలని కూడా సూచించారు కొందరు విశ్లేషకులు (Analysts). జట్టుకి మరపురాని విజయాలు (Unforgettable victories) అందించడమే కాకుండా, తన బ్యాటింగ్ తో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లీ ఫామ్ ను కోల్పోయి దానిని తిరిగి అందుకోవడానికి నానా తంటాలూ పడ్డాడు.

కోహ్లీ ఆఖరిసారిగా 22 నవంబరు 2019 తన 70 సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఆటను పరుగులు (runs) చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 2022 లో అతని పరుగుల దాహానికి తెరపడింది. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan) తో జరిగిన వన్డే మ్యాచ్లో మునుపటి కోహ్లీని (Kohli) మరిపించాడు. తన 71 అంతర్జాతీయ సెంచరీని సాధించి విమర్శకుల (critics) నోళ్లు మూయించాడు. 2022 సెప్టెంబర్ 8 తేదీన దుబాయిలో ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 61 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ (strike rate) 200 కావడం గమనార్హం. కోహ్లీకి సెంచరీని అందుకోవడానికి 1020 రోజులు పట్టింది. అనంతరం మరో మూడు సెంచరీలు చేసి 74 సెంచరీలతో సచిన్ (Sachin) తరువాత అత్యధిక సెంచరీలు చేసిన వారిలో ప్రపంచంలోనే రెండో స్థానానికి (2nd place) చేరుకున్నాడు.

 

అన్ని ఫార్మాట్లలో కోహ్లీ చేసిన పరుగులు : Kohli's runs in all formats

టెస్టులు : 104 మ్యాచుల్లో 177 ఇన్నింగ్స్ ఆడి 8119 పరుగులు చేసాడు. ఇందులో 7 డబల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 913 ఫోర్లు, 24 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 254 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 48.90

 

వన్డేలు : 269 మ్యాచుల్లో 260 ఇన్నింగ్స్ ఆడి 12762 పరుగులు చేసాడు. ఇందులో 46 సెంచరీలు, 64 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 1199 ఫోర్లు, 136 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 183. బ్యాటింగ్ యావరేజ్ 58.

 

టీ20I : 115 మ్యాచుల్లో 107 ఇన్నింగ్స్ ఆడి 4008 పరుగులు చేసాడు. ఇందులో 1 సెంచరీ, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 356 ఫోర్లు, 117 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 122 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 52.73

 

18 నెలలు నిరీక్షించిన స్మిత్ : Smith waited for 18 months

టెస్ట్ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సైతం కోహ్లీలానే పరుగుల కోసం తంటాలు పడ్డాడు. కోహ్లీలా రన్ మెషిన్ (run machine) గా పేరుగాంచాడు. ఆఖరిసారిగా జనవరి 2021లో భారత్పై (India) సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్ లో సెంచరీని (131, century) సాధించాడు. అప్పటి నుంచి పరుగులు (runs) చేసేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒక్క సెంచరీ చేసేందుకు దాదాపు 18 నెలలు అంటే 2022 జులై వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

దాదాపు 16 ఇన్నింగ్స్ తరువాత స్మిత్ 8 జులై 2022 శ్రీలంకతో (Srilanka) జరిగిన మ్యాచ్ లో 14 ఫోర్లతో 212 బంతులను ఎదుర్కొని 109 పరుగులు చేసాడు. ఇది స్మిత్ కి 28 సెంచరీ. దీంతో స్మిత్ కోహ్లీ పేరిట ఉన్న 27 టెస్ట్ సెంచరీల రికార్డును (century record) అధిగమించాడు. అనంతరం ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు సాధించి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున 52+ యావరేజ్ ఉన్న 10 మంది క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.

 

అన్ని ఫార్మాట్లలో స్మిత్ చేసిన పరుగులు : Smith's runs in all formats

టెస్టులు : 92 మ్యాచుల్లో 162 ఇన్నింగ్స్ ఆడి 8647 పరుగులు చేసాడు. ఇందులో 4 డబల్ సెంచరీలు, 30 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 942 ఫోర్లు, 49 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 239. బ్యాటింగ్ యావరేజ్ 60.89 

వన్డేలు : 139 మ్యాచుల్లో 124 ఇన్నింగ్స్ ఆడి 4917 పరుగులు చేసాడు. ఇందులో 12 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 431 ఫోర్లు, 47 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 164. బ్యాటింగ్ యావరేజ్ 45.11 

 

టీ20I : 63 మ్యాచుల్లో 51 ఇన్నింగ్స్ ఆడి 1008 పరుగులు చేసాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 85 ఫోర్లు, 24 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 90. బ్యాటింగ్ యావరేజ్ 25.20 

 

67 ఇన్నింగ్స్ నిరీక్షించిన వార్నర్ : Warner waited for 64 innings 

ఎంతటి దిగ్గజ బ్యాట్స్మెన్ కి అయినా చీకటి రోజులు (dark days) తప్పవు. ఫామ్ ని కోల్పోవడం, దానిని అందుకోవడం జరుగడం సాధారణం. దీనికి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (David Warner) కూడా అతీతుడేమీ కాదు. 14 జనవరి 2020 భారత్పై తన 43 అంతర్జాతీయ సెంచరీ (International century) నమోదు చేసిన తరువాత దాదాపు 34 నెలల (34 months) వరకు ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 2022 నవంబరు 22 ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 106 పరుగులు చేసి తన పరుగుల (runs) దాహాన్ని తీర్చుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి.

 

దాదాపు 67 ఇన్నింగ్స్ తరువాత వార్నర్ సెంచరీ (century) చేసి తన పరుగుల దాహాన్ని తేర్చుకోవడమే కాకుండా పలు రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. 50 ఓవర్ల మ్యాచుల్లో మార్క్ వా చేసిన 18 సెంచరీలు అధిగమించి రికీ పాంటింగ్ (29) తరువాతి స్థానంలో నిలిచాడు. వన్డేల్లో అతివేగంగా 6000 పరుగులు (six thousand runs) పార్టీ చేసిన ముగ్గురితో సమానంగా నిలిచాడు.

 

అన్ని ఫార్మాట్లలో వార్నర్ చేసిన పరుగులు : Warner's runs in all formats

టెస్టులు : 101 మ్యాచుల్లో 184 ఇన్నింగ్స్ ఆడి 8132 పరుగులు చేసాడు. ఇందులో 3 డబల్ సెంచరీలు, 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 957 ఫోర్లు, 64 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 335. బ్యాటింగ్ యావరేజ్ 46.2  

వన్డేలు : 141 మ్యాచుల్లో 139 ఇన్నింగ్స్ ఆడి 6007 పరుగులు చేసాడు. ఇందులో 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 638 ఫోర్లు, 92 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 179. బ్యాటింగ్ యావరేజ్ 44.83

 

టీ20I : 99 మ్యాచుల్లో 99 ఇన్నింగ్స్ ఆడి 2894 పరుగులు చేసాడు. ఇందులో ఒక సెంచరీతో సహా 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 296 ఫోర్లు, 105 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 100. బ్యాటింగ్ యావరేజ్ 32.89  

 

ఒక్క సెంచరీకి 1443 రోజుల నిరీక్షణ : 1443 days waiting for one century

భారత టెస్టు క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ తర్వాతి స్థానాన్ని భర్తీ చేస్తాడనే పేరు పొందిన చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఘోరంగా విఫలమవుతూ (failed) విమర్శల పాలయ్యాడు. క్రీజ్ లోకి వచ్చిందే తడువు నిలకడ లేమి లోపించి ఔటైపోతుండడంతో విమర్శలు మొదలయ్యాయి. జట్టులో నుంచి తొలగించాలని, ఎన్నాళ్ళపాటు ఇంకా అవకాశాలు ఇస్తారని పలువురు మాజీ క్రికెటర్లు (ex-cricketers) ప్రశ్నించారు. అయినప్పటికీ పుజారా విమర్శలనన్నింటినీ తట్టుకుని ఆస్ట్రేలియాతో 2019 జనవరి 3 జరిగిన మ్యాచ్ లో 193 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు.

అయితే అప్పటి నుంచి మళ్ళీ ఫామ్ (form) కోల్పోవడం, పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డాడు. 2020-21 సీజన్లో మొత్తం 18 టెస్టులు ఆడి 865 పరుగులు చేశాడు. సెంచరీ కోసం నిరీక్షించిన పుజారా (pujara) 2022 డిసెంబర్ 14 బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో 130 బంతుల్లో 102 పరుగులు చేసి సెంచరీ (century) దాహాన్ని తీర్చుకున్నాడు. టెస్టులోనే 7000 పరుగులు పూర్తి చేసుకుని బ్రాడ్మన్ రికార్డును (Bradman record) అధిగమించాడు. అంతే కాకుండా భారత క్రికెటర్లలో 7000 పరుగులు పూర్తి చేసిన 8 బ్యాట్స్మెన్ గా నిలిచాడు.

అన్ని ఫార్మాట్లలో పుజారా చేసిన పరుగులు : Pujara's runs in all formats

టెస్టులు : 98 మ్యాచుల్లో 168 ఇన్నింగ్స్ ఆడి 7014 పరుగులు చేసాడు. ఇందులో 3 డబల్ సెంచరీలు, 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 843 ఫోర్లు, 15 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 206. బ్యాటింగ్ యావరేజ్ 44.39   

వన్డేలు : 5 మ్యాచుల్లో 5 ఇన్నింగ్స్ ఆడి 51 పరుగులు చేసాడు.  అత్యధిక స్కోర్ 27.

 

ఐపీఎల్ : 30 మ్యాచుల్లో 22 ఇన్నింగ్స్ ఆడి 390 పరుగులు చేసాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తం 50 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. అత్యధిక స్కోర్ 51. బ్యాటింగ్ యావరేజ్ 20.53

ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అయితే వాటన్నింటికీ తట్టుకుని పడి లేచి తానేంటో నిరూపించుకుంటే అందరి నోళ్ళూ మూతపడతాయి. అందుకు క్రికెటర్లే ఉదాహరణ. ఒక్క సెంచరీ కోసం సంవత్సరాల తరబడి వేచి చూశారు. చివరికి తామేంటో, తమ విలువేంటో అందరికీ చూపించారు.