100 టెస్టుల క్లబ్ లో పుజారా : Pujara in the 100-Test Club
సుదీర్ఘ ఫార్మాట్ అయిన 144 ఏళ్ళ టెస్టు క్రికెట్ చరిత్రలో 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల క్లబ్ లోకి టీమ్ ఇండియా నయా వాల్ పుజారా చేరాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకూ కేవలం 71 మంది మాత్రమే ఉన్నారు.
100 టెస్టుల క్లబ్ లో పుజారా : Pujara in the 100-Test Club
-ప్రపంచ వ్యాప్తంగా 100 టెస్ట్ ల క్లబ్ లో 71 మంది క్రికెటర్లు
-భారత్ నుంచి 13 మంది క్రికెటర్లు
-సచిన్ పేరిట 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రికార్డు
సుదీర్ఘ ఫార్మాట్ అయిన 144 ఏళ్ళ టెస్టు క్రికెట్ చరిత్రలో (144 years of Test History) 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ల క్లబ్ లోకి టీమ్ ఇండియా నయా వాల్ పుజారా చేరాడు. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకూ కేవలం 71 మంది మాత్రమే ఉన్నారు.
100 టెస్టుల క్లబ్ లో 13 మంది భారత క్రికెటర్లు : 13 Indian cricketers in 100 Tests club
ఏ క్రికెటర్ కి అయినా తమ కెరీర్లో 100 టెస్టు మ్యాచుల (100 Test Matches) మైలురాయిని చేరుకోవడం అనేది ఒక కల (A Dream). ఆ కల నిజంగా సాకారమైతే ఆ క్రికెటర్ ఆనందానికి అంతే ఉండదు. టీమ్ ఇండియా నయా వాల్ గా పిలువబడే ఛతేశ్వర్ పుజారా (Pujara) ఫిబ్రవరి 17న తన స్వప్నం సాకారం చేసుకున్నాడు. నిలకడగా ఆడితే ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పాడు. 100 టెస్టు మ్యాచులు ఆడిన 13వ భారతీయ క్రికెటర్ గా (13th Indian Cricketer) నిలిచాడు.
తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుజారా తన స్వప్నాన్ని సాకారం (Dream came True) చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ (5 రోజులు 5 days) ఆడే టెస్టు మ్యాచ్ కి ఏకాగ్రత, ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. రాహుల్ ద్రావిడ్ తరువాత (After Dravid) ఇండియన్ క్రికెట్ టీమ్ కి నయా వాల్ (Naya Wall) గా పుజారా సేవలు అందిస్తున్నాడు. పుజారా కెరీర్ ని ఒకసారి గమనిస్తే...
ద్రావిడ్ తరువాత పుజారానే అడ్డుగోడ : After Dravid Pujara is the Naya Wall
13 ఏళ్ళ క్రితం సౌరాష్ట్ర క్రికెట్ టీమ్ నుంచి జాతీయ జట్టులోకి (Entered National Team) పుజారా ప్రవేశం చేసాడు. భారత క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ (Dravid Retirement) ప్రకటించిన తరువాత పుజారా నయా వాల్ గా టెస్టు మ్యాచ్ తో ఆరంగ్రేటం చేసాడు. 2010 లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ (2010 Australia series) లో పుజారా తన తొలి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో నిలకడగా (Stability) రాణిస్తున్నాడు. భారత జట్టు టెస్టుల్లో రెండుసార్లు నెంబర్ వన్ స్థానంలో నిలబడడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
1వ టెస్ట్ ... 100వ టెస్ట్ ... ఈ రెండూ ఆసీస్ పైనే : 1st Test... 100 Test... Against Australia
పుజారా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన మొదటి టెస్టు మ్యాచ్, 100 వ టెస్టు మ్యాచ్ (1st and 100th Match) ను ఆస్ట్రేలియా (Australia) పైనే ఆడి తన ఖాతాలో ఒక అరుదైన రికార్డును (Record) నమోదు చేసాడు. 2010లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో మొదలు పెట్టిన తన పరుగు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్ (2023) లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ వరకు 13 ఏళ్ళ పాటు కొనసాగింది. ఈ 13 ఏళ్ళ కెరీర్లో (13 years career) ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్ళు పుజారా ఖాతాలో చేరాయి.
144 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో 71 మంది 100 టెస్టులు : 144 years of Test Cricket 71 played 100 Tests
144 ఏళ్ళ చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్లో (144 years Test Matches History) ఇప్పటివరకు 71 మంది మాత్రమే 100 టెస్టు మ్యాచ్ ల (only 71 played 100 Tests) మైలురాయిని చేరుకున్నారు. ఈ 71 మందిలో 12 మంది భారత క్రికెటర్లు ఉండడం విశేషం. ఇందులో 200 టెస్టు మ్యాచ్ లు ఆడిన రికార్డు మాత్రం కేవలం సచిన్ టెండూల్కర్ పేరు (Sachin played 200 Tests) మీదనే ఉండడం గమనార్హం. భారత్ తమ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లను 1932 నుండి ఆడడం ప్రారంభించింది (India played first Test in 1932). 1932 జూన్ 25-28 తేదీల మధ్య ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో తమ మొదటి మ్యాచ్ ను ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి చెందింది.
పుజారా రికార్డులు : Records of Pujara
- 100 టెస్టుల క్లబ్ (100 Tests club) లోకి చేరుకున్న పుజారా పలు రికార్డులు కూడా సాధించాడు. తన కెరీర్లో ఆడిన 99 టెస్టు మ్యాచ్ ల్లో 150 కి పైగా (150 runs) పరుగులను ఆరుసార్లు (6 times) సాధించాడు.
- 7వ వికెట్ కు వికెట్ (7th wicket partnership) కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాతో 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 69 ఏళ్ళ రికార్డును (69 years record broken) బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో హేము అధికారి- విజయ్ హజారే పేరుతో ఉండేది. ఈ మ్యాచ్ లో 525 బాల్స్ ఎదుర్కొన్న పుజారా 21 బౌండ్రీలతో 202 పరుగుల స్కోరు చేసి (202 runs in 525 balls with 21 fours) అవుటయ్యాడు.
- మొదటి పరుగు తీయడానికి 40కి పైగా బంతులను (For first run diffensed 40 balls) డిఫెన్స్ ఆడిన వన్ డౌన్ బ్యాట్స్‌మన్.
- 5 సెషన్లు, 11 గంటలు (5 sessions, 11 hours) ఆడి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్.
- అత్యధికంగా 525 బాల్స్ (faced 525 balls) ఎదుర్కొని రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్ పేరున (495 బాల్స్) ఉండేది.
- ఆస్ట్రేలియా పై రెండేసి డబుల్ సెంచరీలు (Scored two double centuries against Australia) సాధించి సచిన్, లక్ష్మణ్ ల సరసన నిలిచాడు.
- 13 దశాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఐదు రోజులూ (5 days plyed cricketer) ఆడిన 8 మంది ఆటగాళ్లలో (only 8 players) పుజారా ఒకడు. భారత్ నుంచి ఈ ఘనతను సాధించిన వారిలో ఎమ్.ఎల్. జై సింహా, రవి శాస్త్రి మాత్రమే ఉన్నారు. విదేశీ క్రికెటర్లలో జెఫ్ బాయ్ కాట్, కిమ్ హ్యూస్, అలెన్ ల్యాంబ్, అడ్రియన్ గ్రిఫిత్, యాండ్రూ ఫ్లింటాఫ్ మాత్రమే ఉన్నారు.
100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన వారు : Century Test Matches Played
క్రికెటర్ (Name of the Cricketer) |
ఆడిన మ్యాచ్ లు (Matches Played) |
చేసిన పరుగులు (Runs) |
తీసిన వికెట్లు (Wickets) |
సచిన్ (Sachin) |
200 |
15921 |
46 |
రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) |
163 |
13265 |
1 |
వీవీఎస్ లక్ష్మణ్ (VVS Lakshman) |
134 |
8781 |
2 |
అనిల్ కుంబ్లే (Anil Kumble) |
132 |
2506 |
619 |
కపిల్ దేవ్ (Kapil Dev) |
131 |
5248 |
434 |
సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) |
125 |
10122 |
1 |
దిలీప్ వెంగ్ సర్కార్ (Dilip Vengsarkar) |
116 |
6868 |
- |
సౌరవ్ గంగూలీ (Saurabh Ganguly) |
113 |
7212 |
32 |
ఇషాంత్ శర్మ (Ishant Sharma) |
104 |
785 |
311 |
హర్బజన్ సింగ్ (Harbhajan Singh) |
103 |
2224 |
417 |
వీరేంద్ర సెహ్వాగ్ (Veerendra Sehwag) |
103 |
8503 |
40 |
విరాట్ కోహ్లీ (Virat Kohli) |
105 |
8131 |
- |
ఛతేశ్వర్ పుజారా (Chhateshwar Pujara) |
100 |
7021 |
- |